Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

హీరోయిన్ షీలాతో నాటి ఎన్టీయార్ ఉక్కు రొమాన్స్… ఫాఫం, ఠారెత్తిపోయింది…

January 31, 2024 by M S R

Subramanyam Dogiparthi……   ఈ సినిమా వచ్చిన రోజుల్లో ఒక జోక్ ఉండేది . NTR హీరోయిన్ షీలాల శృంగారం ఘట్టిగా ఉంటుంది . పత్రికలు కూడా వేలెత్తి చూపాయి . షూటింగ్ అంతా అయిపోయాక షీలా విరిగిపోయిన ఎముకల్ని రిపేరు చేయించుకోవటానికి హాస్పిటల్లో చేరిందని జోక్ ఉండేది . యన్ టి ఆరా ! మజాకా !

ప్రముఖ దర్శకులు యస్ డి లాల్ 1968 లో వచ్చిన ఈ నేనే మొనగాడ్ని సినిమాకు నిర్మాత , దర్శకులు కూడా . ఆయన NTR తోనే ఎక్కువ సినిమాలు తీసారు . ఈ సినిమాలో రాజనాల – NTR తండ్రీకొడుకులు . Of course . సినిమా ఆఖర్లో తెలుస్తుందనుకోండి వాళ్ళిద్దరికీ . మనకు మొదట్లోనే తెలుస్తుంది . సినిమా క్లైమాక్సులో NTR మెషీన్ గన్ తో విలన్లందరినీ ఢమఢమా కాల్చేసి , నేనే మొనగాడ్ని నేనే మొనగాడ్ని అని అరుస్తుంటాడు . మేము కూడా ఫ్రెండ్సుతో అలాగే ఢాం ఢాం అంటూ నేనే మొనగాడ్ని అని అరిచేవాళ్ళం . కుర్రాళ్ళం కదా !

టి వి రాజు సంగీత దర్శకత్వంలో పాటలు వెరైటీగా ఉంటాయి . ఒక పాట మధ్యలో NTR మాటలు ఉంటాయి . తల్లా పెళ్ళామా సినిమా కన్నా ముందే ఈ సినిమాలో ఆ ప్రయోగం చేసారన్న మాట . నిన్ను చూసింది మొదలూ కలలే కలలు… నిన్ను వలచింది , వయసు పిలిచింది… ఎందుకో నాలో వలపు విరిసింది… పాటలు చాలా శ్రావ్యంగా ఉంటాయి . మిగిలిన పాటలు గారడి చేస్తా నేనే గమ్మత్తు చేస్తా , చూస్కో నా రాజా చూస్కో , షోకిల్లా పిల్లా నిన్నే నిన్నే మెచ్చుకుంటంది మసాలా పాటలు బాగుంటాయి .

Ads

NTR , షీలా , రాజనాల , ధూళిపాళ , శాంతకుమారి , సత్యనారాయణ , అల్లు రామలింగయ్య , రాజబాబు , సంధ్యారాణి , రమణారెడ్డి , గీతాంజలి , జ్యోతిలక్ష్మి ప్రభృతులు నటించారు . అల్లు రామలింగయ్య అపవాదు అనే పత్రికకు ఎడిటర్ అనే కామెడీ పాత్రను , రాజబాబు , సంధ్యారాణి రిపోర్టర్ల జంటగా నటించారు .

సినిమాలో పస తక్కువ అయినా , NTR షీలా శృంగారం B , C క్లాస్ సెంటర్లలో ప్రేక్షకులకు బాగా నచ్చింది . కమర్షియల్ గా కూడా సక్సెస్ అయిందనుకుంటా . By the way , తెలుగులో షీలాకు ఇదే మొదటి సినిమా అనుకుంటా . ఆమెకు , ప్రేం నజీర్ కు ఓ ప్రపంచ రికార్డు ఉంది . 130 సినిమాల్లో జంటగా నటించారు . Hats off to both of them and Malayalam audience .

మా నరసరావుపేటలో వెంకటేశ్వర పిక్చర్ పేలస్ లో రెండు సార్లు చూసా . టి వి లో వచ్చినప్పుడు కూడా చూసా . యూట్యూబులో ఉంది . చూడండి . షీలా హాస్పిటల్లో ఎందుకు చేరవలసి వచ్చిందో చూడాలి కదా !! అందుకోసం ఖాళీగా ఉన్నప్పుడు వీక్షించండి . NTR – షీలావి రెండు డ్యూయెట్లు బాగుంటాయి .

#తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #telugureels #TeluguCinemaNews #telugucinema

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సీఎం జనంలో ఉంటే… అపహసించే ప్రతిపక్షం చరిత్రలో ఇదే తొలిసారి…
  • కీలక డాక్యుమెంట్… సాయుధ పోరాట దుస్థితిపై ఐదేళ్లుగా అంతర్గత చర్చ..!!
  • వావ్… తొలిసారిగా ఓ ‘ప్రెస్‌’టీజియస్ పోస్టులోకి లేడీ జర్నలిస్ట్..!
  • స్క్రిప్టెడ్ లవ్‌ట్రాక్ కాదు… సైలెంటుగా చిగురించి పెనవేసుకున్న బంధం..!
  • జుహీ చావ్లా తొలి తెలుగు సినిమా… అదీ సూపర్ స్టార్ డైరెక్షన్‌లో…
  • మెస్సీ పట్ల ఈ ‘ఫస్ట్ లేడీ’ అమర్యాదకర ప్రవర్తన..! నెటిజనం తిట్టిపోతలు..!!
  • ఎవరూ అడుగుమోపని… ఆ మార్మిక కైలాస పర్వతం ఎక్కిన ఏకైక వ్యక్తి..!!
  • 55 ఏళ్ల క్రితం గల్లంతు..! ఆ అణు పరికరం కథ తెలిస్తే నేటికీ వణుకే..!!
  • నందమూరి దిష్టి తమన్… తెలియకపోతే అన్నీ మూసుకోవాలి బ్రదర్..!!
  • మూడు తెలుగు సినిమా పాటలు- ఒక నోస్టాల్జియా… అజరామరం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions