సాధారణంగా ఏ ప్రెస్‌మీటయినా సరే… కేసీయార్ ప్రశ్నలడిగే ఒకరిద్దరు జర్నలిస్టులపై దాడి చేస్తాడు… (అఫ్‌కోర్స్, అడిగే జర్నలిస్టులకన్నా చెప్పింది రాసుకుని పోయేవాళ్లే మెజారిటీ… అడిగే జర్నలిస్టులను కూడా అడ్డుకునే వాళ్లుంటారు…) ఒకరిద్దరిని దబాయిస్తే మిగతా జర్నలిస్టులు ఇక దాంతో సెట్ రైట్ అయిపోతారనేమో భావన…
పెద్ద బాసే అలా చేస్తే చిన్న బాసులు ఇంకెలా చేస్తారు..? సేమ్, కేటీయార్, హరీష్ కూడా అంతే… నిజానికి హరీష్ జర్నలిస్టు మిత్రుడంటారు… ఒక్కో పదాన్ని ఆచితూచి మాట్లాడుతుంటాడు… ఎక్కడా టంగ్ స్లిప్ కాడు… పొల్లు మాటలకు దిగడు… కానీ చివరకు ఏం ఫ్రస్ట్రేషన్ ఆవరిస్తుందో ఏమిటో గానీ హరీష్ కూడా అలాగే మారడం విచిత్రంగా కనిపిస్తోంది…
మీట్ ది ప్రెస్‌లో గానీ… ఎన్టీవీ గ్రూప్ ఇంటర్వ్యూలో గానీ హరీష్ చెప్పిన చాలా మాటలు అసలు మాట్లాడేది హరీషేనా అన్నట్టున్నాయి… ప్రత్యేకించి ఓ లేడీ జర్నలిస్టు మీద హరీష్ వ్యాఖ్యలు ఏమాత్రం సబబుగా లేవు… ‘సంపద పెంచి పేదలకు పంచాలనే మీ ఉద్దేశం మంచిదే కానీ ఫీల్డులో అది ఫెయిలైంది’ అన్నట్టుగా ఆమె ఏదో అడిగింది… దాంతో ఒక్కసారిగా హరీష్‌లో కోపం పొంగుకొచ్చింది… (ఒకే టీవీలో పనిచేసే జర్నలిస్టులందరూ కలిసి గ్రూపు ఇంటర్వ్యూ చేయడం ఏదో కొత్తగానే ఉంది…)
Ads
‘‘జర్నలిస్టువా..? కాంగ్రెస్ ఏజెంటువా..? కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేస్తున్నవా..? ఇది మీ సొంత అభిప్రాయమా..? దానికి ప్రజల అభిప్రాయం అని చెప్పడం దేనికి..? స్లీపింగ్ కామెంట్స్ చేయకు…’’ అంటూ మండిపడ్డాడు… (అయ్యా, స్లీపింగ్ కామెంట్స్ అనొద్దు, స్వీపింగ్ కామెంట్స్… కోపంలో భాష కూడా గతి తప్పుతున్నదా..?) ప్రశ్న అడిగితే కాంగ్రెస్ కార్యకర్తలా కనిపించడం ఏమిటి..?
ఆమె ఓ జర్నలిస్టు… ఎస్, ప్రజాభిప్రాయమని కాదు, తన అభిప్రాయాన్ని చెప్పినా సరే, తప్పేముంది..? ప్రశ్న వద్దనుకుంటే సైలెంటుగా అవాయిడ్ చేయొచ్చు, చెప్పగలిగితే మరీ మంచిది… అదే ఎన్టీవీ ఇంటర్వ్యూలో చాలామంది చాలా ప్రశ్నలు అడిగారు… (ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో కనిపిస్తోంది…) టీఎస్పీఎస్సీ ఫెయిల్యూర్ల దగ్గర నుంచి కాళేశ్వరం నాణ్యత దాకా మంచి ప్రశ్నలే అడిగారు… మరి ప్రొఫెషనల్ ప్రశ్నలే కదా అవన్నీ… (టీఎస్పీఎస్పీ, కాళేశ్వరం సహా చాలా అంశాల్లో హరీష్ జవాబులు సరిగ్గా లేవు…)
నిజానికి చాలా విధాన నిర్ణయాల్లో హరీష్, కేటీయార్ సహా పార్టీ ముఖ్యుల పాత్ర ఏమీ ఉండదు… అంతా కేసీయార్ ఇష్టం… ఇప్పుడు ఎన్నికల అవసరం కాబట్టి కేసీయార్ కుటుంబసభ్యులు ఇలా ఇంటర్వ్యూలు ఇస్తూ పార్టీ వాయిస్ వినిపిస్తున్నారు… మీట్ ది ప్రెస్‌కు నిజానికి పిలవాల్సింది కేసీయార్‌ను, ఇతర పార్టీల తరఫున రేవంత్ రెడ్డి, కిషన్‌రెడ్డి ఎట్సెట్రా… వాళ్లు ఆయా పార్టీల అధ్యక్షులు, బాధ్యులు…
సరే, కేటీయార్‌ను ఆర్కే పిలిచినా, మీడియా పిలిచినా, తనే ప్రచార సాధనాల దగ్గరకు వెళ్లినా… యాక్టింగ్ సీఎం కాబట్టి, కేసీయార్ రాజకీయ వారసుడు కాబట్టి, కాబోయే సీఎంగా చెప్పబడుతున్నాడు కాబట్టి వోకే… మరి హరీష్..? కేసీయార్‌ను పిలిచి, కూర్చోబెట్టి, ప్రశ్నలడిగే సీన్ అసలు లేనే లేదు… తను చెప్పాలనుకున్నవి మాత్రమే బహిరంగసభల్లో జనానికి చెబుతాడు… అంతే…
Share this Article