వేల కోట్లు… లక్షల కోట్ల బ్యాంకు రుణాలు ఎగ్గొట్టిన వేలాది మంది ఎంచక్కా పలు పార్టీల్లో చేరి, రక్షణ పొంది… మరీ బీజేపీలో చేరినవాళ్లు మరింత రక్షణ పొంది… జల్సాగా, ఎంచక్కా, నిక్షేపంగా జీవితాలను ఇక్కడే ఎంజాయ్ చేస్తున్నారు, మన తెలుగు ఫ్రాడ్‌లూ బోలెడుమంది… జాతిని ఉద్దరించడం కోసం కొందరి రుణాల్ని ప్రభుత్వమే రైటాఫ్ చేసి, అత్యంత కరుణనూ చూపిస్తుంటుంది…
రుణాలు తీసుకున్నవాడు బాగానే ఉంటాడు… అడ్డగోలు కమీషన్లు పొంది రుణాలు ఇచ్చినవాడూ బాగానే ఉంటాడు… కానీ నిజంగానే ఎయిర్‌లైన్స్‌లో నష్టాలు పొంది, కేసుల నుంచి రక్షణ పొందే విధము తెలియక ఎటో పారిపోయి, అజ్ఞాత జీవితం గడుపుతున్నాడు విజయ్ మాల్యా… ఇదెందుకు గుర్తొచ్చిందీ అంటే… ఈమధ్యే ఓ వార్త కనిపించింాది… ఇండియాలో ఎక్కువగా అమ్ముడయ్యే బీర్లు ఏవి అని ఓ సర్వే చేశారట…
నిజమే… బీర్లు అనగానే మాల్యా గుర్తొస్తాడు… తన కేలండర్లు గుర్తొస్తాయి… తన విలాసవంతమైన గత జీవితమూ గుర్తొస్తుంది… ఈ సర్వేలో టాప్ 5 బ్రాండ్ బీర్లను తీసుకున్నారు… అయిదోది బడ్‌వైజర్… చాలామంది దీని సాఫ్ట్‌నెస్‌ను ఇష్టపడతారు… ఆల్కహాల్ పర్సంటేజ్ తక్కువ అని కొందరు జాగ్రత్తపరులు దీన్నే సేవిస్తారు… కాస్ట్ ఎక్కువ, ఐతేనేం, ఒకసారి దీన్ని ఇష్టపడ్డవాడు బ్రాండ్ మార్చడానికి ఇష్టపడడు… ఇదే క్లాస్ బ్రాండ్ అనుకుంటారు వాళ్లు… కానీ మొత్తం దేశీయ బీర్ మార్కెట్‌లో దీని వాటా జస్ట్ 2 శాతం మాత్రమే…
Ads
నాలుగోది కల్యాణి బ్లాక్ లేబుల్… ఇదేదో జానీవాకర్ బ్లాక్ లేబుల్ అనుకునేరు సుమా… యునైటెడ్ బ్రూవరీస్‌కు చెందిన బ్రాండ్… బెంగాలీ బాబులు ఇష్టపడే బ్రాండ్… ప్లస్ తూర్పు రాష్ట్రాల్లోనే ఉంటుంది… హైదరాబాదు సహా సౌత్ నగరాల్లో కూడా దొరకదు… 2.7 శాతం వాటా దీనిది…
సాబ్ మిల్లర్ బ్రూవరీస్ ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ ఉన్న కంపెనీ… దాదాపు 150 వరకూ పేర్లతో అమ్ముతూ ఉంటుందట… ఇండియాలో నాక్అవుట్ బీర్లు అమ్ముతుంది… రీసెంటుగా హైదరాబాదులో కింగ్‌ఫిషర్ బ్రాండ్‌కు కృత్రిమంగా కొరత సృష్టించి, అదేదో కంపెనీ బీర్లను ఉధృతంగా మార్కెట్‌లోకి తీసుకురావడం కోసం జరిగిన కుట్ర పథకం అంటారు మరి… అది రాలేదు, కానీ కింగ్‌ఫిషర్‌కు ఆల్టర్నేట్‌గా చాలామంది తప్పనిసరిగా తాగాల్సి వచ్చిన బీర్ ఇది… దేశంలో థర్డ్ టాప్…
హార్డ్… ఆల్కహాల్ శాతం ఎక్కువ… కాస్త చేదు ప్లస్ వగరు… దీని వాటా మన బీర్ల మార్కెట్‌లో తక్కువేమీ కాదు… 8.7 శాతం… స్ట్రాంగ్ బీర్ కావాలనుకునేవాళ్ల చాయిస్ ఇది… దీనికితోడు స్ట్రాంగ్ బీర్లలో మరో బ్రాండ్ ఫేమస్… ఇది హేవార్డ్స్ 5000… ఇది టాప్ 2… సేమ్, నాక్అవుట్‌లాగే ఇది కూడా… సాబ్ మిల్లర్ వాళ్లదే ఇది కూడా… 15 శాతం వాటా దీనిది…
టాప్ వన్ ప్లేసు మాత్రం కింగ్‌ఫిషరే… లైట్, స్ట్రాంగ్… కింగ్‌ఫిషరిష్టులు చాలామంది ఇది దొరక్కపోతే తాగడం మానేస్తారేమో గానీ వేరే బ్రాండ్ జోలికి పోరు… అదీ దీని స్టేటస్… యజమాని దేశాలు పట్టిపోయినా ఈ బ్రాండ్ మాత్రం రాజ్యమేలుతోంది బీర్ మార్కెట్‌లో… 41 శాతం వాటా దీనిదే… అప్పుడెప్పుడో 1857 నాటి బ్రాండ్ ఇది… తరువాత మూతపడితే విజయ్ మాల్యా 1978లో స్టార్ట్ చేశాడు… ఇదీ బీర్ల వార్త… ఛీర్స్…!!
Share this Article