.
హైదరాబాద్… అల్ట్రా లగ్జరీ ఇళ్లకు అల్టిమేట్ డెస్టినేషన్… అంటే 10 కోట్లకు పైబడిన విలాస గృహాలు… అవును, ప్రస్తుతం అల్ట్రా లగ్జరీ రంగంలో హైదరాబాద్ టాప్… సురక్షితమైన, నివాసయోగ్యమైన హైదరాబాద్‌ను భావిస్తున్నాయి ధనికవర్గాలు… ఎంతగా అంటే… ఆర్థిక సంవత్సరం 2026 (FY-26) లో హైదరాబాద్ ఏకంగా ₹8,562 కోట్ల విలువైన విలాసవంతమైన గృహ విక్రయాలను నమోదు చేసి, బెంగళూరు, చెన్నై వంటి నగరాలను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచింది…
అంటే… ప్రస్తుతం అల్ట్రా లగ్జరీ కేటగిరీకి హైదరాబాద్ రాజధాని… తప్పకుండా ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి క్రెడిట్ తీసుకోవాల్సిన విశేషమే… ఇక ఫ్యూచర్ సిటీ అనుకున్నట్టుగా కార్యరూపం ధరిస్తే ఈ అల్ట్రా లగ్జరీ నివాసాలకు ఐడియల్ డెస్టినేషన్ హైదరాబాద్ కాబోతోంది… ఈ అద్భుతమైన వృద్ధిపై వివిధ జాతీయ, ప్రాంతీయ మీడియా కథనాల విశ్లేషణల సారాంశం ఏమిటంటే..?
Ads
1. మూడున్నర రెట్ల అసాధారణ వృద్ధి…: గత ప్రభుత్వ హయాంలో (బి.ఆర్.ఎస్ పాలనలో) పదేళ్ల పాటు కొనసాగిన విధానపరమైన జాప్యం, స్తబ్దత నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నగరాన్ని గట్టెక్కించింది… కేవలం 30 నెలల కాలంలోనే లగ్జరీ హౌసింగ్ మార్కెట్ ₹2,447 కోట్ల నుండి ₹8,562 కోట్లకు పెరిగింది… అంటే సుమారు 3.5 రెట్ల వృద్ధిని నమోదు చేసింది…
2. దక్షిణ భారత్‌లోనే అగ్రగామి…: అల్ట్రా లగ్జరీ విభాగంలో (₹10 కోట్ల కంటే ఎక్కువ ధర ఉన్న ఇళ్లు) హైదరాబాద్ తన ఆధిపత్యాన్ని చాటుకుంది… FY26 లో నగరంలో మొత్తం 625 యూనిట్లు అమ్ముడయ్యాయి… బెంగళూరులో జరిగిన విక్రయాల కంటే ఇది 4 రెట్లు అధికం కావడం గమనార్హం…
3. కొకాపేట – లగ్జరీ హబ్‌గా ఆవిర్భావం…: ముఖ్యంగా కొకాపేట వంటి కారిడార్లలో భారీ స్థాయిలో విల్లాలు, రో హౌస్‌లు, ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది… బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్‌లో 60% ఎక్కువ స్థలం (Larger Floor Plates) లభిస్తుండటం కూడా సంపన్నులను ఇక్కడికి ఆకర్షిస్తోంది…
4. రేవంత్ రెడ్డికి క్రెడిట్…: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎందుకు క్రెడిట్ దక్కాలీ అంటే… తను చేపట్టిన ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలసీలు, మౌలిక పౌర సదుపాయాల కల్పన.., అంతేకాదు, ప్యూర్ పేరిట స్వచ్ఛ హైదరాబాద్ దిశలో ఆచరణ… హిల్ట్-పి పేరిట పరిశ్రమల తరలింపు అందులో ఒకటి… మెట్రోపాలిటన్ సిటీ, అనేక సంస్కృతుల సమాహారం… సో, హై-నెట్-వర్త్ వ్యక్తులు (HNIs) హైదరాబాద్‌ను తమ మొదటి ప్రాధాన్యతగా ఎంచుకుంటున్నారు…
5. నూతన మైలురాళ్లు…: దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా కనెక్టివిటీ మెరుగుపరచడం, అంతర్జాతీయ స్థాయి అర్బన్ డెవలప్‌మెంట్ వల్ల హైదరాబాద్ గ్లోబల్ సిటీగా ఎదుగుతోంది… విల్లాలు, హై-ఎండ్ అపార్ట్‌మెంట్ల విక్రయాల్లో హైదరాబాద్ ఒక కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసింది…
హైదరాబాద్ కేవలం సాఫ్ట్‌వేర్ ఎగుమతుల రంగంలోనే కాదు, రియల్ ఎస్టేట్ అల్ట్రా లగ్జరీ విభాగంలో కూడా తిరుగులేని శక్తిగా ఎదిగింది… గత పదేళ్ల స్తబ్దతను తుడిచిపెట్టి, దక్షిణ భారతదేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా హైదరాబాద్ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది… ఈ ప్రస్థానం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వృద్ధికి, కొత్త పెట్టుబడులకు గొప్ప సంకేతం…
Share this Article