.
నిజమే… ఈ సినిమా చూస్తే పెద్దగా ఏమీ లేదు చెప్పుకోవడానికి… ఒక్కరు తప్ప… ఆమె పేరు మాళవిక మనోజ్…
కన్ఫ్యూజన్‌కు గురిగాకండి… ఇదే పేరుతో ఓ గాయని ఉంది, ముంబై బేస్డ్, మాలి అంటారు, గీత రచయిత్ర కూడా… (31 ఏళ్లు)… మనం చెప్పుకునే ఈమె నటి… బేసిక్‌గా మలయాళీ, సౌదీలోని జెడ్డాలో పుట్టింది… తమిళ ఫేమ్…
Ads
మాళవిక మోహనన్ వేరు… మలయాళీ నటి… ప్రభాస్‌తో రాజాసాబ్ చేసింది… మాళవిక నాయర్ వేరు… ఆమె మలయాళీ నటే… నాని ఎవడే సుబ్రహ్మణ్యం హీరోయిన్… వీళ్లే కాదు, తెలుగులో చాలా బాగుంది సినిమా చేసిన మాళవిక వేరు…
నేల టికెట్టులో చేసిన మాళవిక శర్మ వేరు… తమిళ, మలయాళ సినిమాల్లో చేసే మాళవిక మేనన్ వేరు… చూసీచూడంగానే అనే తెలుగు సినిమాలో చేసిన మాళవిక సతీషన్ వేరు… ఇన్ని ఎందుకు చెప్పాను అంటే… ఓ భామా అయ్యో రామ అనే ఓ సినిమా వచ్చింది కదా నిన్న… అందులో హీరోయిన్ పేరు మాళవిక మనోజ్…
ఈత రాకపోయినా యాక్షన్ అనగానే నీళ్లలో దూకాను, బోల్డ్ రోల్స్‌కూ సై, పదో తరగతికే హీరోయిన్ అయ్యాను వంటి వార్తలు కనిపిస్తున్నాయి కదా… ఆమే ఈమె… ఈ సినిమాలో ఆమె మాత్రమే ప్లస్… చివరకు కంటెంట్ బేస్డ్ సినిమాలు చేస్తూ, అందరినీ ఆకర్షిస్తున్న సుహాస్ కూడా ఆమె ముందు కొన్ని సీన్లలో వెలవెలా… డామినేట్ చేసింది…
మంచి రోల్స్ పడాలే గానీ… మలయాళీ బైజులు, బోర్సేలను కొట్టేస్తుంది ఈమె… ప్లజెంట్ అప్పియరెన్స్… సినిమాలో ఆమె రోల్ మాత్రమే కాస్త బెటర్… కథ ఉత్త సోది… నిజానికి కంటెంట్ బేస్డ్, కాన్సెప్ట్ బేస్డ్, తక్కువ ఖర్చు సినిమాలు చేస్తూ ఆకట్టుకునే సుహాస్ దారితప్పాడా..,? ఈ సినిమా చూస్తే అదే అనిపిస్తుంది…
రకరకాల పైత్యాలతో ఇండస్ట్రీని నష్టాల ఊబిలోకి నెట్టేస్తున్న మీడియం రేంజ్ హీరోల నడుమ… ఇదుగో ఈ సుహాస్‌లే అవసరం ఇప్పుడు… కానీ తను కూడా ఓ అనాసక్త, రొటీన్ సినిమా ఎందుకు చేశాడో…
ఓ హైపర్ యాటిట్యూడ్ ఉన్న మోడరన్ అమ్మాయి… తాగి, యాక్సిడెంట్ చేస్తే హీరో ఇంటికి తీసుకెళ్లి దిగబెడతాడు… లవ్ స్టోరీ స్టార్ట్… హీరోకు ఓ నేపథ్యం… అయ్య అమ్మను వదిలేస్తాడు… కొన్నాళ్లకు అమ్మ కూడా మరణిస్తుంది… మేనమామ పెంచుతాడు, తను పెళ్లి కూడా చేసుకోకుండా…
ఎమోషన్స్ బాగానే ఉన్నాయి గానీ… స్థూలంగా పలుచోట్ల లాజిక్‌రహిత సీన్లు సినిమాను దెబ్బతీశాయి… చివరకు క్లైమాక్స్ కూడా… సినిమాలంటే అసహ్యమట, థియేటర్ బయట నిలబడి, కథ విని, సినిమా హిట్టో ఫ్లాపో చెబుతాడట హీరో… సినిమాలంటేనే ఏవగింపు కదా, ఈ ఆడియో ఎలా భరిస్తాడోయ్ దర్శకా..?
హఠాత్తుగా దర్శకుడు హరీష్ శంకర్, మారుతి కనిపిస్తారు… ప్చ్… అసలు కథాకథనాలే గ్రిప్పింగుగా లేనప్పుడు ఇక సినిమా ఎలా రక్తికడుతుంది..? ఎక్కడా హై లేదు… పోనీలే, ఈసారి అదే మాళవికతో మరో మంచి కథతో ప్రయత్నించవోయ్ దర్శకా..?!
Share this Article