Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కీచకుడికి బుద్ధి చెప్పడానికి… వాడి తండ్రిని పెళ్లి చేసుకుంటుంది ఈమె…

July 19, 2024 by M S R

కీచకులు ఉన్నంత కాలం ద్రౌపదులు , రావణులు ఉన్నంతకాలం సీతలు ఉంటారని సినిమా ప్రారంభంలోనే హరికధ ద్వారా చెప్పేస్తాడు దర్శకుడు విశ్వనాథ్ . ఓ కీచకుడి బారి నుండి తనను తాను రక్షించుకుని , తన స్నేహితురాలికి జరిగిన అన్యాయాన్ని సవరించేందుకు , ఆ కీచకుడికే తల్లి అవతారం ఎత్తిన ఓ సీత కధ ఈ సీత కధ సినిమా . సినిమాకు షీరో రోజా రమణే . ప్రహ్లాదుడిగా చిన్నప్పుడే అదరగొట్టిన రోజా రమణి యుక్తవయసులోకి వచ్చాక నటించిన ఈ సినిమాలో కూడా మళ్ళా అంతే పేరు తెచ్చుకొంది .

ఆమె తర్వాత గొప్పగా నటించింది రమాప్రభ . చింతచిగురు పులుపని చీకటంటె నలుపని తెలియని పిచ్చిపిల్లగా అద్భుతంగా నటించింది . వీరిద్దరితో పాటు ప్రధాన పాత్రధారులు చంద్రమోహన్ , దేవదాస్ కనకాల … చంద్రమోహన్ పాత్ర అర్ధంతరంగా ముగిసినా , ఏ పాత్రనయినా అవలీలగా వేయగలనని మరోసారి రుజువు చేసుకున్నాడు . దేవదాస్ కనకాల జల్సారాయుడిగా , స్త్రీ లోలుడిగా చాలా బాగా నటించారు . టైప్ ఇన్స్టిట్యూట్ మాస్టారి పాత్రలో అల్లు రామలింగయ్య , కాంతారావు , పండరీబాయి , శుభ , సాక్షి రంగారావు , పుష్పకుమారి ప్రభృతులు నటించారు .

ఈ సినిమా విజయానికి మరో ముఖ్య కారణం కె వి మహదేవన్ సంగీతం . వేటూరి సుందరరామమూర్తి రచించిన హరికధ భారతనారీ చరితము మధుర కధాభరితము చాలా శ్రావ్యంగా , సందేశాత్మకంగా ఉంటుంది . వేటూరి వారికి బహుశా ఇదే మొదటి పాటేమో ! By the way , నేను పాలకమండలి సభ్యుడిగా ఉన్న సమయంలోనే వీరికి నాగార్జున యూనివర్సిటీ ఆధ్వర్యంలో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయబడింది . పి లీల కంఠం చెవుల తుప్పు వదిలిస్తుంది .

Ads

మరో గొప్ప పాట చింతచిగురు పులుపని చీకటంటే నలుపని చెప్పందే తెలియని చిన్నపిల్ల పాట , చిత్రీకరణ , రమాప్రభ నటన సినిమాకే హైలైట్ . నిజంగానే పతాక సన్నివేశం . మిగిలిన పాటలు మల్లె కన్నా తీయన మా సీత సొగసు , పుత్తడి బొమ్మ , కల్లాకపటం ఎరగని పిల్లలు , నిను కన్న కధ మీ అమ్మ కధ కూడా శ్రావ్యంగా ఉండటమే కాకుండా బాగా హిట్టయ్యాయి కూడా .

నంది పురస్కారాలలో మూడవ ఉత్తమ చిత్రంగా కాంస్య నంది , ఉత్తమ దర్శకునిగా ఫిలింఫేర్ అవార్డులు వచ్చాయి . తాష్కెంటులో జరిగిన చలన చిత్రోత్సవంలో ప్రదర్శించబడింది . మళయాళం , తమిళ భాషల్లోకి రీమేక్ అయింది . దేవదాస్ కనకాల పాత్రని మళయాళంలో కమల్ హాసన్ , తమిళంలో రజనీకాంత్ పోషించారు . మళయాళంలో రోజారమణి తన పాత్రను తానే నటించింది .

కె విశ్వనాథ్ కళా తపస్సు ప్రారంభ దినాలలో వచ్చిన ఈ సినిమా ఈరోజుకీ తప్పక చూడవలసిన సినిమాలలో ఒకటి . ఓ సినిమాగా , ఓ సందేశంగా ఎలా చూసుకున్నా గొప్ప సినిమా. An unmissable musical , feel good movie . యూట్యూబులో ఉంది . చూసి ఉండకపోతే తప్పక చూడండి . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు……….. ( By దోగిపర్తి సుబ్రహ్మణ్యం )

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కేసీయార్ లేదా బాబు అయిఉంటే… ఈ ఈవెంట్ దద్దరిల్లిపోయేది…
  • భారత్ చేతిలో భార్గవాస్త్రం… విదేశీ డ్రోన్లకు పర్‌ఫెక్ట్ విరుగుడు మంత్రం…
  • టర్కీ, అజర్‌బైజాన్… శత్రువుకు మిత్రులు… కాళ్లబేరానికి వస్తున్నారు…
  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions