నవీన్ పట్నాయక్ అవమానకరమైన ఓటమిని పొందాడు… అసెంబ్లీ ఎన్నికల్లో కాస్త నయం, లోకసభ ఎన్నికలకు సంబంధించి పరాజయం, పరాభవం కూడా…! సరే, అయిపోయింది… అందరూ తన వారసుడిగా చెప్పబడిన పాండ్యన్ అనే తమిళ మాజీ ఐఏఎస్ అధికారి పెత్తనం కారణంగానే ఈ ఓటమి అనే విమర్శలు వెల్లువెత్తాయి…
ఒక అరవ మొహాన్ని, అంటే ఒడిశేతరుడిని నవీన్ వారసుడిగా చూడటానికి జనానికి ఇష్టం లేదు, అందుకే ఈ తిరస్కరణ అనే విమర్శలు ఒకవైపు… కాదు, అధికార యంత్రాంగంలో పాండ్యన్ అరాచకం ఎక్కువై వ్యతిరేకత ప్రబలింది అని విమర్శలు ఇంకోవైపు… కొందరు రాసిన విశ్లేషణలు మరీ డిఫరెంట్…
పార్కిన్‌సన్స్ వ్యాధితో బాధపడుతున్న నవీన్ పట్నాయక్ ఉద్దేశపూర్వకంగానే, తెలివిగా పాండ్యన్‌ను ముందు పెట్టాడు… తన ఓటమిని తను ముందే పసిగట్టాడు… పరాజయం అంగీకారానికి ఓ సాకు కావాలి, తద్వారా తను గౌరవంగా బయటపడాలి అనుకున్నాడనేది ఆ అభిప్రాయాల సారాంశం… ఏమో, అదంత కన్విన్సింగుగా లేదు… సరే, కొత్త ముఖ్యమంత్రిని ప్రమాణ స్వీకార వేదిక దాకా వెళ్లి, ఆశీర్వదించి తన హుందాతనాన్ని చాటాడు, గుడ్…
Ads
ఈలోపు తన మీద వస్తున్న విమర్శలతో పాండ్యన్ విసుగెత్తి… ఇక రాజకీయాల నుంచే విరమించుకుంటున్నానని ప్రకటించాడు… నవీన్ పట్నాయక్ కూడా తెలివిగా పాండ్యన్ కాదు, నా వారసుడు ఎవరో ప్రజలే ఎంచుకుంటారు అని ఓ వ్యాఖ్య చేశాడు… అలా ఒడిశాలో పాండ్యన్ దుమారం సద్దుమణిగింది… కనుమరుగైంది… సరే, ఎవరి కర్మ, ఎవరి ఖర్మ వాళ్లది… తాజాగా ఓ ఆసక్తికర విషయం ఏమిటంటే..?
కొత్త ముఖ్యమంత్రి మోహన్ మాజి… ఆయనకు ఇప్పుడు అర్జెంటుగా భువనేశ్వర్‌లో ఓ అధికారిక నివాసం కావాలి… ఎందుకు.,.? పాత సీఎం ఖాళీ చేస్తాడు కదా అంటారా..? లేదు, 24 ఏళ్లుగా నవీన్ పట్నాయక్ తన సొంత ఇంటి నుంచే, తన తండ్రి కట్టించి ఇచ్చిన విశాల భవనం నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు… వైఎస్‌లాగా పెద్ద ఇల్లు కట్టలేదు, దాన్ని కేసీయార్‌లా వందల కోట్లు పెట్టి ప్రగతి భవన్‌లా మార్చలేదు, కనీసం జగన్ విశాఖ రెసిడెన్స్ వంటిదీ లేదు…
ఆ ఇంటి నుంచి తను వెళ్లేదేమీ లేదు… తనకు కటక్, ఢిల్లీల్లో కూడా తండ్రి సంపాదించి పెట్టిన వేరే ఇళ్లు కూడా ఉన్నాయి… కాకపోతే సీఎం గ్రీవెన్స్ సెల్‌గా భావించే వేరే భవనం ఒకటి ఉంది… అది ప్రభుత్వానిదే… కానీ అదేమో చిన్నది… సో, స్టేట్ గెస్టు హౌజునే సీఎం రెసిడెన్స్ చేద్దామని అనుకుంటున్నారట… ఐనా దాన్ని రీమోడలింగ్ చేసి, ఓ సీఎం అఫిషియల్ రెసిడెన్స్ స్థాయిలో డెవలప్ చేయడానికి వ్యయం, సమయం కావాలి… అదీ కథ…
బీజేపీ ప్రభుత్వం కదా… ఈ కొత్త ప్రభుత్వ తొలి నిర్ణయం ఏమిటో తెలుసా..? గుడికి సంబంధించిందే… పూరి జగన్నాథుడి గుడికి నాలుగు వైపులా ఉన్న ద్వారాల నుంచి ప్రవేశాలకు అనుమతినిచ్చారు… అంతకుముందు ఒకటే ద్వారం గుండా ప్రవేశాలను పరిమితం చేయడంతో భక్తులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు… బీజేపీ తన మేనిఫెస్టోలో కూడా నాలుగు ద్వారాల ప్రస్తావన చేసింది… అది తీర్చింది, పైగా మెయింటెనెన్స్, డెవలప్‌మెంట్ అవసరాల కోసం 500 కోట్ల కార్పస్ ఫండ్ క్రియేట్ చేయడానికి కూడా నిర్ణయం తీసుకుంది… బీజేపీ- గుడి ఒకదాంతో ఒకటి విడదీయరానివి కదా..!!
Share this Article