అన్ని రకాల ఊహాగానాలకు అమెజాన్ ప్రైమ్ వాడే తెరవేశాడు… ఈరోజు అర్ధరాత్రి నుంచే… అంటే 24వ తేదీ నుంచి ప్రైమ్‌లో మలయాళం, తమిళం, తెలుగు, కన్నడం భాషల్లో ఈ సినిమా ప్రసారం అవుతుంది… హిందీ మాత్రం ఎందుకో ఆపినట్టున్నారు…
మొదట్లో నవంబరు 11 అన్నారు, తరువాత 18 అన్నారు… దాన్నీ వాయిదా వేశారు… 24, 28… కాదు, డిసెంబరు ఫస్ట్ వీక్… ఇలా రకరకాల ఊహాగానాలు… ఎందుకంటే..? కారణం ఎవరూ చెప్పరు… నిజానికి 400 కోట్ల వసూళ్ల గీత దాటేదాకా ఓటీటీ ప్రసారం వద్దనుకున్నాం… ఇంకా థియేటర్లలో నడుస్తోంది, డబ్బులొస్తున్నాయి అని ఏవేవో లీకులు ఇచ్చి, రాయించుకున్నారు… కానీ ఇంకేదో కారణం బలంగా ఉన్నట్టుంది…
వాటిల్లో ప్రధాానమైంది వరాహరూపం పాట… ఇది మా పాటకు కాపీ అని ఓ ప్రైవేటు మలయాళం ఆడియో కంపెనీ కేసు వేసింది… అన్నిరకాల ప్లాట్‌ఫాం నుంచి ముందుగా ఆ పాటను తీసేయండి అని కోర్టు ఆదేశించింది… తరువాత ఆ కేసు ఏమైందో ఒక్క చిన్న వార్త కూడా కనిపించలేదు… డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ నుంచి ఆ పాటను తీసేశారు… కానీ ఓటీటీలో ప్రసారం చేసే సినిమాలో ఆ పాట తీసేస్తే ఇంకేముంది..? సినిమా బలాన్ని అడ్డంగా నరికేసినట్టే…
Ads
అందుకని కోర్టు బయట సెటిల్‌మెంట్ కోసం ఏవో ప్రయత్నాలు చేస్తూ, ఓటీటీ ప్రసారం వాయిదా వేస్తూ ఉన్నారేమో… మరి ఇప్పుడు ఓటీటీ ప్రసారంపై అమెజానే అధికారికంగా ప్రకటించింది కాబట్టి ఏదో ఓ రాజీ పరిష్కారం కుదిరింది అనుకోవాలా..? అఫ్‌కోర్స్, వాళ్లు చెప్పుకున్న 400 కోట్ల మైలురాయిని కూడా దాటేశారు…
నిజానికి చాలాచోట్ల థియేటర్లలో వసూళ్లు తగ్గిపోయాయి… ప్రత్యేకించి తమిళంలో చాలా పూర్… మొన్న 50వ రోజు తమిళ వెర్షన్ వసూళ్లు 4 లక్షలే… నిజానికి తమిళ ప్రేక్షకులు ఏనాడో ఆ సినిమాను వదిలేశారు… ఏ అడ్డంకీ లేకుండా ఉండి ఉంటే తమిళం, మలయాళం వెర్షన్లను ఎప్పుడో స్ట్రీమింగ్ స్టార్ట్ చేసి ఉండేవాళ్లు… ఇప్పుడు కూడా హిందీ వెర్షన్ ఆపారు…
ఎందుకంటే… కన్నడ వెర్షన్‌కన్నా ఇప్పటికీ హిందీ వసూళ్లు బాగున్నయ్… ఉదాహరణకు మొన్నటి ఆదివారం మొత్తం 2.2 కోట్ల వసూళ్లకు గాను కన్నడ వెర్షన్ 80 లక్షలు కాగా, హిందీలో 1.1 కోట్లు… తెలుగులో కూడా వసూళ్లు తగ్గాయి… సో, హిందీ ఒక్కటి ఆపేసి మిగతావి క్లియర్ చేసేశారు… అవునూ, ఇంతకూ ఓటీటీ వెర్షన్‌లో వరాహరూపం సాంగ్ ఉంటుందా..?!
Share this Article