‘‘బీహార్, బక్సర్‌లో ఎన్నికల స్ట్రాటజిస్టు ప్రశాంత్ కిషోర్ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకుని కట్టుకున్న ఇంటిని అధికారులు శుక్రవారం సాయంత్రం కూల్చేశారు…’’ ఇదీ అకస్మాత్తుగా సోషల్ మీడియాలో వచ్చిన వార్త… ముందు ఆశ్చర్యమేసింది, తన వర్క్‌తో చాలామందికి టార్గెట్ అవుతాడు కదా, అందుకని ఈ ఆక్రమణలు గట్రా అవలక్షణాలు లేకుండా క్లీన్‌గా ఉండాలి కదా, అంతెందుకు..? ఒక దశలో తన వారసుడిగా చిత్రించిన బీహార్ ముఖ్యమంత్రితోనే తనకు పడటం లేదు… చాన్స్ దొరికితే తనే టార్గెట్ చేస్తాడు కదా అనిపించింది… పైగా తెల్లారిలేస్తే ఏవేవో నీతులతో ఏదేదో క్యాంపెయిన్ చేస్తూ ఉంటాడు… తీరా వార్త గురించి చదివితే… తూచ్, అందులో ఏమీ లేదు… అసలు ప్రశాంత్ కిషోర్ తప్పు కూడా ఏమీ లేదు… అధికారులు టార్గెట్ చేసి కూలగొట్టడం కాదు అది… అసలు అది ప్రభుత్వ స్థల దురాక్రమణే కాదు…
విషయం ఏమిటంటే..? బక్సర్‌లో ప్రశాంత్ కిషోర్‌కు ఓ పురాతనమైన ఇల్లుంది… ఆయన తండ్రి కట్టించుకున్నాడు దాన్ని… అది నేషనల్ హైవే నంబర్ 84… రోడ్డు పక్కనే ఇల్లు… ఈమధ్య రోడ్డు విస్తరణకు పూనుకున్న నేషనల్ హైవే అథారిటీ అందరికీ నోటీసులు ఇచ్చింది… పరిహారాలు కూడా ఇచ్చేస్తూ, మార్క్ చేసిన మేరకు ఏమైనా నిర్మాణాలు ఉంటే తొలగించుకోవాలని చెబుతోంది… అందులో ప్రశాంత్ కిషోర్ ఇల్లు కూడా ఉంది… కాకపోతే తను అక్కడ ఉండటం లేదు, పరిహారం కూడా ఇంకా తీసుకోలేదు…చూసీ చూసీ అధికారులు ఓ బుల్డోజర్ తీసుకొచ్చి పది నిమిషాల్లో ఆ ప్రహారీ గోడను ప్లస్ గేటును కూల్చేసి వెళ్లిపోయారు… అంతే మరి, ఎంతసేపు..? జస్ట్, చుట్టుపక్కల ఉండేవాళ్లు అక్కడికి ఆసక్తిగా చేరుకునేలోపు పని ముగిసిపోయింది… కాకపోతే ప్రశాంత్ కిషోర్ ఇల్లు కాబట్టి వెంటనే జాతీయ చానెళ్లు, సైట్లలోకి ఎక్కేసింది వార్త… అది కాస్తా ప్రభుత్వ స్థల ఆక్రమణగా, అందుకే ఆ ఇంటిని కూల్చేసినట్టుగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది… సోషల్ మీడియా కదా… అది ఎన్ని వంకర్లయినా తిరుగుతుంది మరి..! ఇదీ అంతే…!!
Share this Article
Ads