.
అరె, ఇతర సిమిలర్ రియాలిటీ షోలు చెడిపోతుంటే, మేం మాత్రం ఎందుకు చెడిపోవద్దు, మనమూ భ్రష్టుపట్టిపోదాం అన్నట్టుగా ఉంది ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ షో వర్తమాన వ్యవహార శైలి… రాబోయే ఎపిసోడ్ బాపతు ప్రోమో అదే చెబుతోంది…
థమన్ భయ్యా, కాస్త తమాయించుకో… సరే, ముందుగా ఓ విషయం… పవన్ కల్యాణ్ రాబోయే సినిమా ఓజీకి బెనిఫిట్ షో ధర 1000 రూపాయలు అట… ఫ్యాన్స్ నుంచే ఉల్టా దోచుకోవడం… పైగా టికెట్ రేట్ల పెంపు 100 నుంచి 125…
Ads
తను సినిమా మనిషే కాబట్టి, ప్రభుత్వం తనదే కాబట్టి… ఎంతైనా పెంచుకోగలడు… ఒక హీరో కోణంలో సరే అనుకుందాం… హీరోలందరూ అంతే కాబట్టి… కానీ ప్రజాజీవితంలో ఉన్న ఓ నాయకుడిగా, ఓ పార్టీ అధినేతగా, డిప్యూటీ సీఎంగా… టికెట్ రేట్ల పెంపు లేకుండా సినిమా రిలీజ్ చేసుకుంటే హుందాగా, అభినందనీయంగా ఉండేదేమో…
(ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎఐ క్రియేటెడ్ ఫోటో… ఆ ఫోటోయే చెబుతోంది అన్ని విషయాలూ…) (మన తెలుగు హీరోలను మించి హిపోక్రటిక్ నటులు నెవ్వర్, ప్రపంచంలో ఎక్కడా ఉండరు…)
నా సినిమా క్వాలిటీ ఇదీ, తక్కువ రేట్లతో ఎక్కువ మంది చూసేలా ఉంటుంది, రండి అని పిలుపునిచ్చినట్టు ఉండేది… అబ్బే… అలా చేస్తే పవన్ కల్యాణ్ ఎందుకవుతాడు..? తనకున్న టైమే తక్కువ… హడావుడిగా పాత కమిట్మెంట్లను పూర్తి చేసి జనం మీదకు వదులుతున్నాడు… హరిహరవీరమల్లు అంతే కదా.., అందులో గ్రాఫిక్స్ క్వాలిటీ చూసి చివరకు తన ఫ్యాన్సే బిత్తరపోయారు, సైలెంట్…
(మహావతార్ నరసింహ, మిరాయ్ సినిమాల్లో తక్కువ ఖర్చుతో మంచి గ్రాఫిక్స్ ప్రజెంట్ చేశారు, మన వందల కోట్ల ఫేక్ గ్రాఫిక్ ఖర్చు కస్టమర్లకు అదొక పాఠం, గుణపాఠం)… సరే, ఓజీ దగ్గరకు వద్దాం… అదీ ఓ స్మగ్లర్ లేదా గ్యాంగ్‌స్టర్ మూవీ… ఇతర రొటీన్ ఫార్ములా హీరోల్లాగే నెగెటివ్ రోల్స్‌ను గ్లామరైజ్ చేయడమా..? ఓ జనజీవన నేత ఏం సంకేతం ఇస్తున్నట్టు..?
అబ్బే, సినిమాను సినిమాగా చూడాలి అనే స్టీరియో ఫోనిక్ డైలాగ్స్ సరే గానీ… పవన్ కల్యాణ్ వంటి హీరో కమ్ పొలిటిషియన్స్ సినిమా చేయవద్దని ఎవరూ అనరు గానీ, కంటెంట్ యాంటీ- సొసైటీ ఉండకుండా జాగ్రత్తపడాలి… సరే, ఇక ఈ చర్చ కూడా వదిలేస్తే… ఉపోద్ఘాతంలో చెప్పుకున్న రియాలిటీ షో తెలుగు ఇండియన్ ఐడల్ విషయానికి వద్దాం…
తాజా ప్రోమో… ఓజీ ప్రమోషన్… తప్పులేదు… థమన్ మ్యూజిక్‌ను కీర్తించేలా, పవన్ కల్యాణ్ వీరభజనలాగా ఉంది… హీరోయిన్ ప్రియాంక, కంటెస్టెంట్లకు పవన్ కల్యాణ్ మాస్కులు, పాటలు… అంతా జేజేల ఎపిసోడ్… చివరకు కంటెస్టెంట్లు పాడుతుంటే రష్యన్ భామలతో పిచ్చి గ్రూప్ స్టెప్పులు… ఓ మ్యూజిక్ రియాలిటీ షోకు ఉండకూడని లక్షణం…
అల్లు అర్జున్‌కు టీగ్లాస్ సార్‌తో పడకపోయినా సరే, అల్లు అరవింద్ బాపతు మెగా ఫ్యామిలీ కంపౌండ్ సినిమా… పైగా అధికారంలో ఉన్నాడు పీకే… మెగా హిపోక్రసీ కదా… అల్లు అరవింద్ సాగిలబడినట్టు అనిపించింది తెలుగు ఇండియన్ ఐడల్ షో ప్రోమో చూస్తే… ఫాఫం…
శ్రీరామచంద్ర గాయబ్… అంతా సమీరా భరద్వాజ్ ఒంటరి హోస్టింగు… అసలు చాలాసేపు థమనే గాయబ్… అరాచకం, ఇష్టారాజ్యం… ఇతర చానెళ్ల సింగింగ్ షోలతో పోలిస్తే కాస్త సదభిప్రాయం ఉండేది దీని మీద… ఫాఫం థమన్… పొల్యూట్ చేసిపారేశాడు… తోడుగా గీతామాధురి ఉండనే ఉందిగా…
అవునూ, ఓజీ సినిమా టికెట్ రేట్లకు తెలంగాణ ప్రభుత్వం హైక్ ఇచ్చిందా..? ఇంకా తెలియదు… కానీ రేవంత్ రెడ్డి ఇస్తాడు… మరో యాభై రూపాయలు అధికంగానే ఇస్తాడు అత్యంత భారీ తీవ్ర గాఢ లోతైన ఔదార్యంతో… తెలంగాణ ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఓ దశ లేదు, ఓ దిశ లేదు… థాంక్స్ టు ది గ్రేట్ దిల్ రాజు…
అసలు డబ్బింగ్ సినిమాలను కూడా స్ట్రెయిట్ తెలుగు సినిమాల్లాగా చూపించి అడ్డగోలు టికెట్ రేట్లకు పర్మిషన్ తెచ్చుకుంటున్న రోజులు ఇవి… ఆ చంద్రబాబు దగ్గర డిప్యూటీ సీఎం హీరోగా ఉన్న సినిమాకు ఇవ్వడా..? ఏపీకన్నా ఓ పది రూపాయలు ఎక్కువే ప్రసాదిస్తాడు… అడ్వాన్స్ థాంక్స్ రేవంతన్నా..!! (బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు, అదనపు షోలపై ఆల్రెడీ యూటర్న్ తీసుకుని దిల్ రాజు చూపించిన బాటలో కుంటుతున్నందుకు…)
(సరే, సరే... ఆ పాటల లోతైన భావజాలం, సమాజశ్రేయస్సు, సంగీత నాణ్యత, ఒడలు పులకరిస్తున్న తెలుగు ప్రేక్షక సమాజం... తదితర అంశాలపై మాట్లాడుకుందాం.... జై హరిహర ఓజీ వీరమల్లు...)
Share this Article