.
నిజానికి అబ్సర్డ్ కథావిధానం గురించి యండమూరి అప్పుడప్పుడూ చెబుతుంటాడు… తను దాని మీద ఓ నవల రాశాడు, దాంతో ఓ సినిమా (ముత్యమంత ముద్దు?) కూడా తీశారు… సినిమా దర్శకుడు దాన్ని అర్థం చేయించలేక బోల్తాకొట్టాడు… ఎందుకంటే, నమ్మలేని విషయాన్ని నమ్మేట్టుగా, ఏదో నమ్మదగింది ఉన్నది అన్నట్టుగా చెప్పడం నవల రాసినంత సులభం కాదు కనుక!!
ఈరోజు రిలీజైన ఓహ్ సుకుమారి సినిమా కూడా అంతే… అలాంటి స్టోరీ లైన్ రాసుకోవడం సులభమే, కానీ దాని ఎగ్జిక్యూషన్ అంత వీజీ కాదు, అక్కడే దర్శకుడు ఎవరో గానీ తేలిపోయాడు… ఆసక్తికరంగా ప్రజెంట్ చేయలేకపోయాడు…
Ads
ఇందులో స్టోరీ లైన్ ఏమిటంటే..? ఓ కరెంటు పోరి… అంటే తనను ముట్టుకుంటే కరెంటు తీగను పట్టుకున్నట్గు షాక్ కొడుతుంది… ఆమెకు పెళ్లి చేయాలి, ఊరిలో నుంచి పంపించాలి… ఓ బకరా దొరుకుతాడు… వాడే హీరో… తిరువీర్… తెలుగు ప్రేక్షకులకు తను పెద్దగా అక్కర్లేదు, కానీ మన తెలుగమ్మాయి ఐశ్వర్యా రాజేష్ ఉందనేదే మనకు కనెక్టింగ్ పాయింట్…

ఆమె బాగానే చేసింది, చేయకపోతేనే ఆశ్చర్యం కదా… తిరువీర్ ఓకే… యాదగిరి అని పేరు పెట్టారు, తెలంగాణ నేపథ్యం పెట్టారు… డైలాగులు ఎవరు రాశారో గానీ భయపడినంత కృతకంగా ఏమీ లేవు… తెలంగాణ డయలెక్ట్‌ను ఖూనీ చేశారేమో అని భయపడ్డాం కానీ, నటీనటులు కూడా కాస్త శ్రమపడి, ప్రయాసపడి డిక్షన్‌లో తేడా లేకుండా జాగ్రత్తపడ్డారు… ఝాన్సీ, మురళీధర్ గౌడ్ ఈ విషయంలో పర్‌ఫెక్ట్ కదా… తేడా రాలేదు…
- సినిమాలో ప్రధానలోపం ఏమిటంటే..? ముట్టుకుంటే షాక్ కొట్టడం అనేది ప్రపంచంలో లేని విశేషం… పోనీ, చెప్పాడు ఓ కథగా… మరి ఆ మైనస్ పాయింట్ ఎలా మాయమైపోయింది..? లాజికల్ కంక్లూజన్ ఏమిటో కన్విన్సింగుగా చెప్పాలి కదా…
దీనికితోడు సినిమాలో అక్కడక్కడా నవ్వించే ప్రయత్నాలు కూడా పెద్దగా క్లిక్ కాలేదు, ప్రతి పాత్ర కామెడీ కోసమే తెగ ప్రయత్నించినా సరే, ప్రేక్షకుడికి నవ్వు రాలేదు… దాంతో సినిమాను దేనికోసం చూడాలో అర్థం కాని దుస్థితి… పైగా ఆమనిని సినిమాకు వాడుకునే విధానం ఇదా అని జాలేస్తుంది…
కథలో ఆ కొత్తదనం మినహా ఇక ఏదీ కొత్తగా లేదు… ప్రివెడ్ షూట్ దగ్గర నుంచి శుభం కార్డు దాకా… ఏమాత్రం థ్రిల్ లేదు సీన్లలో… నిజానికి ఓ కరెంటు పోరి దామినితో ఓ యాదిగాడు ఎట్ల సంసారం చేసిండు అనేదే కదా కామెడీ పండించాల్సింది… ఆ కీలకమైన విషయంలోనే తేడా కొట్టేసింది… బెటర్ లక్ నెక్స్ట్ టైమ్ ఐశ్వర్యా… ఇలాంటి అబ్సర్డ్ కథల్ని ఎంచుకోకుండా ఉంటేనే సుమా!!
Share this Article