.
అవునూ, ఇండియా మీద కౌంటర్ క్యాంపెయిన్ కోసం ఎంపిక చేసిన పేర్లు ఎవరివయ్యా అని చూస్తూ… అందులో దివంగత నేత బేనజీర్ భుట్టో, అధ్యక్షుడు ఆసిఫ్ జర్దారీ కొడుకు, పీపీపీ నేత బిలావల్ భుట్టో పేరు ఉంది… వెంటనే మాజీ మంత్రి హీనా రబ్బానీ ఖర్ పేరు కనిపించింది…
ఇాద్దరూ గతంలో విదేశాంగ మంత్రిత్వ శాఖను లీడ్ చేసినవాళ్లే… వాళ్లు గాకుండా మాజీ రక్షణ మంత్రి ఖుర్రం దస్తగిరి ఖాన్, విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి జలీల్ అబ్బాస్ జిలానీ కూడా ఉన్నారు… వాళ్లు గతంలో నిర్వహించిన బాధ్యతలు, అనుభవం, ఇతర దేశాలతో సంబంధాల విషయంలో అవగాహన నేపథ్యంలో సరైన ఎంపికలే…
Ads
కానీ… హీనా, భుట్టోల పేర్లు చదవగానే ఓ పాత కథనం గుర్తొచ్చింది… అది బంగ్లాాదేశ్‌లో పబ్లిషయ్యే బ్లిట్జ్ అనే టాబ్లాయిడ్‌లో మొదట వచ్చింది… తరువాత ఇతర పత్రికల్లో కూడా కనిపించింది… అది ఈ ఇద్దరి ప్రేమాయణం… నిజానికి ఇద్దరూ ఉన్నత విద్యావంతులు… విదేశాల్లో మాస్టర్స్ చేశారు… కాకపోతే ఆమెకు అంతకుముందే పెళ్లయింది… పైగా బిలావల్ హీనాకన్నా పదకొండేళ్లు చిన్నవాడు..,. ఐతేనేం..?
సదరు కథనం వారికి రంకు అంటగట్టింది… హీనాది హైప్రొఫైల్ కుటుంబం, ఓ పాత రాచరికం బాపతు… పాకిస్థాన్ రాజకీయాల్లో ఇన్‌ఫ్లుయెన్స్ ఉన్న ఫ్యామిలీ… ఆమె స్టయిలిష్‌గా ఉంటుంది, ఫోటోజెనిక్ ఫేస్, బాగా మాట్లాడుతుంది, హైలెవల్ సర్కిల్స్… భుట్టో వారసత్వం గురించి తెలిసిందే కదా అందరికీ… పలు అధికార సమావేశాల్లో, బృందాల్లో కలిసి కనిపించేవారు… సేమ్ వేవ్ లెంత్, ఎక్కువ సాన్నిహిత్యం…
ఒక దశలో భుట్టో హీనాతో వెళ్లిపోయి స్విట్జర్లాండ్‌లో స్థిరపడతాను అని తండ్రితో పోరాడినట్టు కథన సారాంశం… అలాగే హీనా భర్త తన వ్యాపార సహోద్యోగితో సంబంధం పెట్టుకుని తనను ఇగ్నోర్ చేస్తే, దాన్ని భరించలేక ఓ దశలో హీనా సూసైడ్ అటెంప్ట్ చేసిందనీ కథనం చెప్పుకొచ్చింది…
నిజం ఏమిటి..? పాకిస్థాన్ రాజకీయాల్ని బాగా ప్రభావితం చేసే ఐఎస్ఐను ఆమె పట్టించుకునేది కాదు… సేమ్, భుట్టో… ఆ కుటుంబం ఉగ్రవాద బాధిత కుటుంబమే… ప్రత్యేకించి బెలూచిస్థాన్‌లో అనేక మందిని ఆర్మీ మాయం చేసేది… ఏమయ్యారో కూడా తెలియదు… అలా అణిచివేయడానికి ప్రయత్నించేది… ఇప్పుడు అదే బెలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్థాన్ ఆర్మీకి చుక్కలు చూపిస్తోంది, అది వేరే కథ…
ఐతే ఆ బెలూచిస్థాన్ ప్రాంతంలో యువకుల మాయం గురించి ఐరాసలో ఓ వర్కంగ్ గ్రూపు ఏర్పాటు కావడానికి ఆమే కారణమని ఐఎస్ఐకి ఆమె మీద కోపం… మహిళల పట్ల వివక్ష సాధారణమైన ఓ సమాజంలో ఆమె వేగంగా ఎదగడం, ప్రపంచవ్యాప్తంగా ఆమె ప్రొఫైల్ పెరిగిపోవడంతో… ఇలాంటి చెత్తా కథల్ని క్రియేట్ చేసి రాయించేదట… అవును, ఐఎస్ఐ కదా ఏమైనా చేయించగలదు… అప్పట్లో పాకిస్థాన్ హైసర్కిళ్లలో ఇవే ముచ్చట్లు…
ఈ రాతల్ని హీనా భర్త ఖండించాడు… హీనా, బిలావల్ నవ్వుకున్నారు ఈ రాతల్ని చదివి… పదేళ్లయి పోయింది ఈ కథనాలు వెలువడి… ఏమైంది..? ఏమీ కాదు, ఏమీ కాలేదు… ఎవరి బతుకులు వాళ్లవే… ఇద్దరూ రాజకీయాల్లో ప్రముఖంగానే ఉన్నారు… ఇప్పుడు ఆమె వయస్సు 47 ఏళ్లు… బిలావల్ భుట్టో వయస్సు 36 ఏళ్లు.., ఇద్దరూ నేషనల్ అసెంబ్లీ సభ్యులే… ఇదీ సంగతి… యాంటీ ఇండియా కౌంటర్ క్యాంపెయిన్ కమిటీలో ఆ ఇద్దరి పేర్లూ చదవగానే ఈ కథంతా గుర్తొచ్చింది చకచకా…!!
Share this Article