Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఒమర్ అబ్దుల్లా తెలివైనవాడు… సమయస్పూర్తి ప్రదర్శించాడు…

April 16, 2026 by M S R

.

రాజకీయాల్లో అదృష్టం ఎంత ప్రధానమో.. సమయస్ఫూర్తి (Presence of Mind), లౌక్యం (Tact), సందర్భశుద్ధి (Appropriateness), ప్రాప్తకాలజ్ఞత (Astuteness) అంతకన్నా ప్రధానం… ఈ లక్షణాలు ఉన్నవాడు రాబోయే ముప్పును ముందుగానే శంకిస్తాడు… నెగెటివిటీని పాజిటివిటీగా మార్చుకుంటాడు… సంక్షోభం నుంచి అవకాశాన్ని (Opportunity out of Crisis) సృష్టించుకుంటాడు…

నిన్న జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లాకు సంబంధించిన ఓ వార్త చదివాక ఇదే అనిపించింది… ముందుగా ఆ వార్త చదవండి… బాగా వైరల్ అయ్యింది నిన్న…

Ads



ఏం జరిగింది? …. ఒమర్ అబ్దుల్లా శ్రీనగర్‌లోని కశ్మీర్ హాట్‌లో ‘నో యువర్ ఆర్టిసన్స్’ అనే కార్యక్రమం  ప్రారంభించడానికి వెళ్లాడు… తీరా రిబ్బన్ కట్ చేసే సమయంలో అది మువ్వన్నెల రంగు (Tricolour)తో జాతీయా జెండాను పోలి ఉంది… అచ్చంగా… వెంటనే తను దాన్ని కట్ చేయడానికి నిరాకరించాడు…

వెంటనే రెండు వైపులా ఆ రిబ్బన్ తొలగించాలని ఆదేశించాడు… దీని వెనుక ఉన్న కారణం రాజకీయమో లేదా వివాదమో కాదు, కేవలం గౌరవం మాత్రమేనని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు… రిబ్బన్ కట్ చేసినప్పుడు అది ముక్కలై కింద పడుతుంది… జాతీయ జెండా రంగుల్లో ఉన్న రిబ్బన్‌ను కత్తిరించి, కింద పడేయడం జాతీయ పతాకానికి ఇచ్చే గౌరవం కాదని ఆయన భావించాడు, ఆ గౌరవానికి భంగం కలగకూడదనే ఉద్దేశంతోనే ఆయన అలా చేశాడని తన మద్దతుదారులు సోషల్ మీడియాలో హైలైట్ చేశారు…

వైరల్ అవుతున్న తీరు… “చిన్న విషయమే అయినా, దేశం పట్ల ఆయనకు ఉన్న గౌరవం గొప్పది” అంటూ నెటిజన్లు మెచ్చుకుంటున్నారు… కొందరు దీన్ని సాధారణ విషయంగా చూస్తుంటే, మరికొందరు మాత్రం ఇది ఒక మంచి సంప్రదాయానికి నాంది అని అంటున్నారు…


……. ఇదీ వార్త… గుడ్, ఒమర్ అబ్దుల్లా జాతీయ జెండాకు ఇచ్చిన గౌరవం అభినందనీయమే… అదీ ప్రత్యేకించి శ్రీనగర్‌లో..! కానీ ప్రాక్టికల్‌గా ఆలోచిద్దాం, రాజకీయాల్లో ఏదీ అసందర్భంగా, కాకతాళీయంగా జరగదు… ఇటు పుల్ల అటు పడినా ఓ రీజన్ ఉంటుంది…

సో, దీన్ని మనం రెండు కోణాల్లో చూడవచ్చు…

  • పొలిటికల్ అక్యూమెన్ (రాజకీయ చతురత)…: ఒకవేళ ఆ రిబ్బన్ కట్ చేసి ఉంటే, “జాతీయ జెండాను అవమానించాడు” అంటూ ప్రతిపక్షాలకు ఒక పెద్ద ఆయుధం దొరికేది… ఆ రిస్క్ తీసుకోకుండా, అక్కడికక్కడే నిర్ణయం మార్చుకుని, దాన్ని ఒక పాజిటివ్ ఇమేజ్ గా మార్చుకోవడంలో ఆయన తెలివితేటలు కనిపిస్తున్నాయి.,,

  • క్రైసిస్ మేనేజ్‌మెంట్…: అనవసరమైన నెగెటివిటీని రాకుండా ఆపుకోవడమే కాకుండా, దాన్ని దేశభక్తికి చిహ్నంగా ఫోకస్ అయ్యేలా చేయడం ఖచ్చితంగా ఒక తెలివైన ఎత్తుగడే…

ఒమర్

ఈ ప్రోగ్రాం మొత్తం వీడియోల్లో రికార్డు అవుతుందని తెలుసు, ఫోటోలు తీస్తున్నారనీ తెలుసు… ఆ రిబ్బన్ కట్ చేస్తే తలెత్తే దుమారం ఊహించగలడు, సీనియర్ పొలిటిషియన్ కదా… ప్రోటోకాల్స్ తెలుసు… సో, ఇవన్నీ గ్రహించి… తెలివిగా వ్యవహరించాడు… నో, ఈ రిబ్బన్ కట్ చేస్తే జాతీయ జెండాకు అవమానం అన్నాడు…

అసలు ఆ ట్రైకలర్ జెండాను పోలిన రిబ్బన్‌ను అలా పెట్టిన అధికారులు ఎవరు..? ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన సంస్థ బ్యాక్ గ్రౌండ్ ఏమిటని ఇప్పుడు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు… ఏదేమైతేనేం… తనకు ఉపయోగపడింది మరోరకంగా… రాబోయే విమర్శలను ముందుగానే పసిగట్టి అప్రమత్తం కావడం ఒక రాటుదేలిన రాజకీయ నాయకుడి లక్షణం…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అవునూ, ఇంతకీ ఈ కథలో అసలు వ్యభిచారి ఎవరు..?
  • మోడీ సూత్రాలు..! ఏదో ఆర్థిక తుఫాన్‌కు ముందు మోగే సైరన్లు..!!
  • రెండు కళ్ళ సిద్ధాంతానికి కాలం చెల్లింది… అటో ఇటో తేల్చుకోవల్సిందే…
  • తెలంగాణ బరిలోనూ ఎన్డీయే కూటమి..? రేవంత్‌రెడ్డి నెత్తిన పాలు..!!
  • ఏమో అనుకుంటాం గానీ… శోభన్‌బాబుకూ కులగజ్జి ఎక్కువే…
  • కర్కోటక అవినీతి జయలలిత… చివరకు ఏం సాధించినట్టు..?
  • అంతరిక్షంలో ఎఐ యుద్ధాలా..? ఇండియా కూడా రెడీ..!
  • ఆ చివరి ఓవర్…. ఐపీఎల్ థ్రిల్లెస్ట్… ముంబై ఇంటికి… బెంగుళూరు టాప్ వన్…
  • విద్వేషం లేదు- విషం లేదు..! సరైన దిశలో ఒక పీఎం- ఒక సీఎం…!!
  • ఇది బాబాయ్ హోటల్ స్టోరీ అస్సలు కాదు … జస్ట్, ఒక బాబాయ్ స్టోరీ …

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions