…. Amarnath Vasireddy…. మసూచి ! స్మాల్ పాక్స్ !
ఈ పేరు విన్నారు కదా !
ఇది వైరల్ వ్యాధి.
దీని చరిత్ర ఎవరైనా చెప్పారా ?
చదవండి.
ఆ రోజుల్లో ప్రజలు వాటి గురించి అవగాహన ఏర్పరచుకున్నారు.
మసూచిని అమ్మ వారు లేదా అమ్మోరు అనేవారు .
మూడు రకాల అమ్మోరులు
1 . ఇసుక అమ్మోరు : వొళ్ళంతా చిన్నపాటి బుడిపెలు. ఇసుక రేణువులు సైజు లో. ఎనిమిది తొమ్మిది రోజుల్లో నయం అయిపోయేది. మందులు లేవు. వ్యక్తిని క్వరెంటైన్ చేసేవారు. వేప ఆకులపై పడుకోబెట్టేవారు. 9 రోజుల దాకా స్నానం చేయకూడదు . తొమ్మిదో రోజు స్నానం చేస్తే ఇసుక లాంటి మచ్చలు పొయ్యేవి . దీన్ని ఆల్ఫా కరోనాతో పోల్చవచ్చు.
2 . అగ్ని అమ్మోరు. డెల్టా లాంటిది. అరివీర భయంకరం. మొఖంపై స్ఫోటకం మచ్చలు జీవితాంతం ఉండిపోతాయి. ( small pox )
3 . ఆటలమ్మ : ఇది సోకితే పిల్లలు ఆటలాడుకొంటూనే వుంటారు. అందుకే ఆటలమ్మ అని పేరు. ఏమీ సమస్య ఉండదు. ఆటలమ్మ వస్తే మిగతా అమ్మోర్లు రావు. అందుకే ఆటలమ్మ వచ్చిన వారికీ మెడలో బంగారు గొలుసు వేసే వారు. ఇది ఓమిక్రాన్ లాంటిది ( chciken pox )
ఆ రోజుల్లో భయపెట్టే ప్రచారాలు లేవు. ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదో ప్రజలు అనుభవపూర్వకంగా తెలుసుకొన్నారు.
వందలాది సమాజాలు. వేలాది అంటువ్యాధులు. వాటిని సమగ్రంగా అధ్యయనం చేసేదే మెడికల్ ఆంథ్రోపాలజీ.
సమాజ హితం కోరి , నా చదువు , అనుభవాన్ని , సమయాన్ని వినియోగించి మీకు ఇన్నాళ్లు corona పాఠాలు చెప్పా
Share this Article
Ads