కొన్ని దురదృష్ట సంఘటనలు జరుగుతూ ఉంటాయి… ఎవరిని తప్పుపట్టాలో తెలియదు, ఎందుకు తప్పుపట్టకూడదో అర్థం కాదు… మొన్నటి ఆదివారం ఎయిర్ ఇండియా ఫ్లయిట్ న్యూయార్క్ నుంచి ముంబై వచ్చింది… రావడమే చాలా లేటు… 11.30కు రావల్సింది 2.10కు ల్యాండయింది… అందులో అమెరికా పాస్‌పోర్టులున్న ఇద్దరు ఇండియన్ల వృద్ధజంట వచ్చింది…
ఇద్దరూ వీల్ చెయిర్ ఆప్ట్ చేసుకున్నారు… అర్హులే… వృద్ధులు… కానీ వీల్ చెయిర్ల కొరత… ఆ ఫ్లయిట్‌లో 32 మంది ప్రయాణికులకు వీల్ చెయిర్లు కావాలి… కానీ ఉన్నది 15 మంది వీల్ చెయిర్ అసిస్టెంట్లు… అవసరానికి సరిపడా లేరు… ఆ జంటలో భార్య ఒక వీల్ చెయిర్‌లో కూర్చోగా, దాదాపు కిలోమీటరున్నర దాకా దూరమున్న ఇమిగ్రేషన్ చెక్ పాయింట్ దగ్గరకు భర్త కూడా ఆమెతోపాటు నడుచుకుంటూ వెళ్లాడు…
తరువాత తను ఒక్కసారిగా కుప్పకూలాడు… అప్పటికప్పుడు నానావతి హాస్పిటల్‌కు తీసుకుపోయారు గానీ ఫలితం లేదు, తను మరణించాడు… గుండెపోటు కారణమని తేల్చారు… ఎవరిని తప్పుపట్టాలి..? ప్రాథమికంగా ఖచ్చితంగా ఎయిర్ ఇండియానే… దీన్ని టాటాలకు అమ్మేశారు, ఏమైందో తెలియదు, స్టార్ అలయెన్స్‌తో కూడిన తరువాత కూడా క్వాలిటీ ఆఫ్ సర్వీస్‌లో తేడా రాలేదు… అదే నాసిరకం సర్వీస్, బిహేవియర్… ఆల్రెడీ ఆ ఫ్లయిట్‌లో 32 మంది వీల్ చెయిర్ బుక్ చేసుకున్నారు కదా, మరి అందుబాటులో ఉంచాలి కదా…
Ads
మా తప్పేమీ లేదు, తన మరణం కేవలం గుండెపోటు వల్లే అని చివరాఖరికి అధికారులందరూ కలిసి తేల్చేస్తారు… గుండె సమస్యలున్నవాడు వీల్ చెయిర్ వచ్చేదాకా ఆగాలి కదా, అంతదూరం నడవడం దేనికి అంటారేమో… భార్య, భర్త ఇద్దరూ ఒకేసారి ఇమిగ్రేషన్‌కు వెళ్తారు, సహజం… సరే, ఆ ముసలాయన తొందరపడ్డాడు అనుకుందాం… అసలు సమస్య ఏమిటంటే..? ఎయిర్ పోర్టుల్లో వాతావరణం…
మెయిన్ ఎంట్రీ నుంచి బోర్డింగ్ దాకా బోలెడంత దూరం నడవాలి… కీళ్లనొప్పులు, కాళ్లనొప్పులు, వృద్యాప్య సమస్యలు, ఇతర అనారోగ్య సమస్యలతో ఉన్నవారు వీల్ చెయిర్ బుక్ చేసుకుంటారు సాధారణంగా… కానీ పోర్టులో ఇంతింత దూరాలు నడవలేక అన్నీ బాగున్నవారు కూడా వీల్ చెయిర్ బుక్ చేసుకుంటున్నారు… లేదా ఒంటరిగా వెళ్లే ప్రయాణికులు ఫాస్ట్ సెక్యూరిటీ చెక్, ఇమిగ్రేషన్ దగ్గర ప్రాధాన్యం కోసం కూడా వీల్ చెయిర్స్ బుక్ చేసుకుంటున్నారు… వీల్ చెయిర్ అసిస్టెంట్లు అదనంగా 200, 300 తీసుకుంటారేమో గానీ మెయిన్ ఎంట్రీ నుంచి బోర్డర్ పాస్ తీసుకోవడం, చెక్ ఇన్ బ్యాగేజీ దగ్గర సాయం నుంచి విమానం ఎక్కేదాకా తోడుంటారు… చదువుకోని ప్రయాణికులు, ఒంటరివాళ్లకు ఇది చాలా బెటర్ సౌకర్యం… ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే విమర్శ తప్పు…
గతంలో నడవలేని అశక్తతకు సంబంధించి డాక్టర్ సర్టిఫికెట్ ఉంటే తప్ప వీల్ చెయిర్ ఇచ్చేవాళ్లు కాదట… ఇప్పుడు లిబరల్‌గానే ఉంటున్నారు… డబ్బు తీసుకుంటున్నారు… అలాంటప్పుడు సరిపడా వీల్ చెయిర్లు ఉంచకపోవడం ఎయిర్ ఇండియా తప్పే… అవసరం ఎంతో ముందు తెలిసి కూడా..! ఎయిర్ పోర్టుల్లో అంత దూరం నడవాలా అని ఆశ్చర్యపోకండి… తరచూ అంతర్జాతీయ విమాన ప్రయాణాలు చేసేవారికి బాగా తెలుసు… నడుమ నడుమ కన్వేయర్లు ఉన్నా సరే, ఆరోగ్యంగా ఉన్న ముసలివాళ్లకే కాళ్లు పీక్కుపోతాయి…
సో, ఈ వృద్ద ప్రయాణికుడి మరణానికి ఎవరిని నిందించాలి..?! (ప్రభుత్వాఫీసుల్లో స్ట్రెచ్చర్లు దొరకక, కనీసం సెలైన్ స్టాండ్లు కూడా దొరకని ఫోటోలో బోలెడు పత్రికల్లో చూసి ఉంటాం కదా… ఎయిర్ పోర్టులు, సర్వీస్ ఇంతకు భిన్నంగా ఉందా..?)
Share this Article