.
శోభా శెట్టి… కార్తీకదీపంలో ఆడవిలన్ మోనిత పాత్రతో ప్రతి తెలుగింటికీ పరిచయమైన నటి… ఈమె విలన్ పాత్ర అంత హైలైట్ అయ్యింది కాబట్టే హీరోయిన్ ప్రేమీ విశ్వనాథ్ వేసిన దీప పాత్ర అంత బలంగా జనంలోకి వెళ్లింది…
తరువాత తెలుగు బిగ్‌బాస్-7 హౌజులోకి ఎంట్రీ ఇచ్చింది… నటుడు శివాజీ యావర్, పల్లవి ప్రశాంత్‌తో కలిసి ఓ కూటమి కట్టి… శోభాశెట్టి, అమరదీప్, ప్రియాంక జైన్ (సీరియల్ బ్యాచ్)తో పిచ్చి పోరాటం ఏదో చేశాడు… శోభాశెట్టి ఎనర్జీ లెవల్స్, మాటకుమాట, ఫైటింగుతో ఆ షోలో హైలైటైంది… చివరకు విజేత పల్లవి ప్రశాంత్ ఏమైపోయాడో చూశాం, చదివాం…
Ads
ఆ షో తరువాత శోభకు పెద్దగా అవకాశాల్లేవు… కన్నడం బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది… తెలుగు బిగ్‌బాస్‌తో పోలిస్తే ఫుల్లు కంట్రాస్టు… నీరసంగా, పేలవంగా… రెండు వారాలు కాగానే హోస్ట్ సుదీప్ ఎడాపెడా క్లాస్ పీకాడు… శోభ తనంతటతానే ఏడుస్తూ, బతిమిలాడుతూ సెల్ఫ్ ఎవిక్షన్…
తెర మీద కనిపించలేదు చాన్నాళ్లు… హఠాత్తుగా జబర్దస్త్ లేడీ కమెడియన్ వర్ష చేసే కిస్సిక్ టాక్స్ అనే షోలో కనిపించింది… తను బేసిక్‌గా కన్నడ… కానీ తెలుగు అమ్మాయిలకన్నా ఫ్లూయెంట్ తెలుగు మాట్లాడుతోంది… తెలుగు సీరియల్స్ చేసే కన్నడ నటీనటులు అందరూ అంతే… మంచి తెలుగు సాధన చేస్తున్నారు… (నిఖిల్, కావ్య, ప్రేరణ, ప్రియాంక జైన్, ఆషిక పడుకోన్… ఇలా చాలామంది)
తను కార్తీకదీపంలో తనతోపాటు నటించిన యశ్వంత్‌తో ప్రేమలో పడింది… ఎంగేజ్‌మెంట్ కూడా అయ్యింది… మంత్రాలయం రాఘవేంద్రస్వామిని బాగా పూజించే ఈమె తన పాత జీవితం, కష్టాలు ఎట్సెట్రా చెప్పుకొచ్చింది… కన్నడ బిగ్‌బాస్‌లో కిచ్చా సుదీప్ ఎందుకు ఫైరయ్యాడో వివరించింది… అంత నమ్మబుల్ అనిపించలేదు…
‘‘నా ఆరోగ్యం సహకరించలేదు… జనం వోట్లేసి గెలిపిస్తున్నా సరే, రెండు వారాలకే ఎందుకు హౌజ్ వీడి వెళ్లిపోతాను అంటున్నావు, ఇది కరెక్ట్ కాదు అనే భావనతోనే సుదీప్ ఫైరయ్యాడు… కానీ నాకు తప్పలేదు… నిజంగానే నేను బిగ్‌బాస్ అగ్రిమెంట్స్ బ్రేక్ చేసి ఉంటే, నాకు వాళ్లే వేరే అవకాశాలు ఎందుకిస్తారు..? సో, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి… ఎవరిదీ తప్పు ఉండదు…’’
‘ఖాళీగా ఏమీ లేను, అమెజాన్ ప్రైమ్ వాళ్లకు ఓ వెబ్ సీరీస్ చేశాను… షోలు చేస్తున్నాను..’ అని చెబుతూ, తెలుగులో మోనిత టైపులో ఓ బలమైన నెగెటివ్ షేడ్స్ ఉండే పాత్ర చేయబోతున్నానని వెల్లడించింది… ఆల్రెడీ రన్నింగులో ఉన్న సీరియల్‌లో ఎంట్రీ ఇస్తుందా..? కొత్త సీరియలా చెప్పలేదు గానీ మరో మోనిత వచ్చేస్తుందన్నమాట..!!
Share this Article