కీర్తి భట్… బిగ్‌బాస్‌లో ఉన్న టీవీ సీరియల్ నటి కీర్తి తెలుసు కదా… అనేక కష్టాల సుడిగుండం నుంచి కూడా మొక్కవోని ఆశావాదంతో ముందుకే వెళ్తున్న ఎంత పాజిటివ్ మైండెడో చదివాం… బిగ్‌బాస్ హౌజులో కూడా ఎక్కడా, ఎప్పుడూ తొణక్కుండా… దిగజారకుండా… హుందాగా ప్రవర్తించిన తీరు కూడా చూశాం… ఇప్పుడు వినిపిస్తున్న ఓ లీక్ గనుక నిజమైతే… నిజమైతే… ఆమెను మళ్లీ మెచ్చుకోవాలి…
ఈరోజు సాయంత్రం ఆరు గంటలకే స్టార్ట్ కాబోయే గ్రాండ్ ఫినాలేకు నిఖిల్ ఓ గెస్టుగా వచ్చినట్టున్నాడు… 18 పేజెస్ సినిమా ప్రమోషన్ కూడా కలిసి వస్తుందిగా, అందుకన్నమాట… రవితేజ మరో గెస్టుగా కనిపిస్తున్నాడు… తన ధమాకా సినిమా వస్తోంది కదా… చిన్నపాటి ఎర్లీ ప్రమోషన్ అన్నమాట… శ్రీలీల కూడా… అలనాటి అందాల నటి రాధ కూడా వచ్చినట్టుంది… ఇవన్నీ వదిలేయండి… కీర్తి ఏం చేసింది..?
లీక్ వార్తల ప్రకారమే… రేవంత్ విజేత… ముందు నుంచీ ఆ కమిట్‌మెంట్ ఉన్నట్టుంది బిగ్‌బాస్ టీంతో… ఈ ఆటే పెద్ద స్క్రిప్టెడ్ దందా కదా… రేవంత్ ఆటతీరు, మాటతీరుకు నిజానికి ఎప్పుడో బయటికి వచ్చేయాల్సింది… తరువాత ప్లేస్ శ్రీహాన్… మూడో స్థానంలో కీర్తి… నాలుగోస్థానంలో ఆదిరెడ్డి, ఐదోస్థానంలో రోహిత్… నిజానికి రోహిత్ చివరలో తన సంస్కారవంతమైన ప్రవర్తనతో మంచి పోటీ ఇచ్చాడు గానీ ఐదో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది… ఆదిరెడ్డి అసలు టాప్ ఫైవ్ కేరక్టరే కాదు, చెప్పుకోవడం వేస్ట్…
Ads
ఎప్పటిలాగే సూట్‌కేసు ముందు పెట్టి, ఇందులో ఇంత డబ్బు ఉంది, తీసుకుని వెళ్తావా అని కీర్తిని అడిగారట… ఆమె సింపుల్‌గా వద్దని చెప్పింది… అరెరె, అలా చెప్పి ఉండాల్సింది కాదు, ఆమెకు కొంత సాయం చేయాలనే సానుభూతి భావనతో ఆమె టాప్ త్రీకి తీసుకొచ్చింది బిగ్‌బాస్ టీం అనే విశ్లేషణలు కూడా ఆల్‌రెడీ స్టార్టయ్యాయి… దీనికి ఆద్యుడు గత సీజన్‌లో డబ్బు తీసుకుని విజేతకు షాక్ ఇచ్చిన సోహెల్… బిగ్‌బాస్ విధానాల్లో డొల్లతనాన్ని భలే ఉపయోగించుకున్నాడు… నిజానికి ఆ చివరి అడుగులో contestant character కు పరీక్ష పెట్టడం నీచమైన గేమ్ rule…
కీర్తి ఎందుకు వద్దంది..? ప్రైజ్ మనీ దక్కాల్సింది విజేతకు… అందులో కొంత కత్తిరించి, మిగతావాళ్లకు పంచితే ఇక ఆ ప్రైజ్ మనీకి విలువేముంది..? అది గేమ్ స్పిరిటే కాదు… తను ఎలాగూ విజేతగా నిలవబోను అని ఆమెకు తెలుసు, టాప్ త్రీ దాకా రావడమే ఆమెకు ఆనందం… నిజానికి సూట్ కేసు తీసుకుని వెళ్లిపోతే ఆమెకు ఈ ఆపదల సమయంలో కొంత ఆర్థికంగా ఊరట… కానీ ఆమె టెంప్ట్ కాలేదు… లొంగిపోలేదు… అదే స్పిరిట్‌కు కట్టుబడి ఉంది…
బేకార్ ఆట రూల్స్, బేకార్ స్క్రిప్టెడ్ ఎపిసోడ్స్, పేరుకు ప్రేక్షకుల వోట్లే ఆధారం అంటారు గానీ మొత్తం బిగ్‌బాస్ టీం ఆడే ఆటే అది… కంటెస్టెంట్లు జస్ట్, పాత్రధారులు… ఈసారి సీజన్ అయితే అనేకరకాలుగా చెత్త… ఈ చెత్తకంపు నడుమ అభినందించాలని అనిపిస్తున్నది కీర్తి చూపించిన స్పిరిట్… ఒకవేళ లీక్ వార్తల ప్రకారం ఆమె మూడో ప్లేసులో నిలిచి, ఈ సూట్‌కేసు రిజెక్షన్ జరిగి ఉంటేనే సుమా…!!
Share this Article