.
విక్కీ కౌశల్ నటించిన ఛావా ఎంత బ్లాక్ బస్టరో తెలుసు కదా… 800- 900 కోట్లు దాటిపోనున్నయ్ వసూళ్లు… రొటీన్ ఫార్ములా సినిమాల్లో హీరో ధీరోదాత్తుడై విలన్లను, గ్యాంగులను ఒక్కడే కాలర్ మాసిపోకుండా తెగనరుకుతాడు… కానీ ఈ సినిమాలో తనకే రక్తాలు కారుతుంటాయి, కళ్లు తీసేయబడతాయి, చర్మం వలిచేయబడుతుంది… ముక్కలుగా నరికేయబడతాడు… కానీ జనం ఉద్వేగంతో కదిలిపోయి ఏడ్చేస్తున్నారు థియేటర్లలో…
అందుకే అన్నది స్టార్ హీరోలూ కలలు కనండిరా… ఇలాంటి ఒక్క పాత్ర కోసం… నిజానికి విక్కీ కౌశల్ సెకండ్ లేయర్ హీరో… ఇప్పుడు స్టార్ హీరో… ఎవడికీ తీసిపోడు… అనితర సాధ్యంగా పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేయగల సత్తా తన సొంతం… తన వివరాలు చూస్తుంటే శామ్ బహదూర్ సినిమా ఆ జాబితాలో కనిపించింది…
అద్భుతంగా చేశాడు… నిజంగా శామ్ బహదూర్‌ను కళ్లెదుటకు తీసుకువచ్చాడు… మరోసారి సినిమాను చూస్తూపోతే… డైరెక్టర్ పలుచోట్ల నిజసంఘటనలను ప్రజెంట్ చేయడానికి భయపడినట్టు అనిపించింది… ఛావా తరహా గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే లేదు… అందుకే బలమైన ఎమోషన్స్‌ను ఆవిష్కరించలేకపోయింది…. (జీ5 లో ఉంది…)
Ads
మన వెగటు, వెకిలి డాన్సులు, చెత్తా సీన్లు స్మగ్లర్ పుష్పరాజ్ బ్లాక్ బస్టర్… ఇదే శామ్ బహదూర్ సమయంలో రిలీజైన మరో చెత్తా సినిమా యానిమల్ బ్లాక్ బస్టర్… కానీ శామ్ బహదూర్ సినిమా చచ్చీచెడీ 100 కోట్లకు చేరింది, అంతే… నిజానికి హీరో ఆఫ్ ది నేషన్ శామ్ బహదూర్… లక్ష్మణ్ ఉటేకర్ వంటి దర్శకుడి చేతిలో పడితే ఛావా రేంజులో హిట్టయ్యేదేమో… విక్కీ కౌశల్ ప్రయాస వృథా కాలేదు గానీ, దక్కాల్సినంత విజయం దక్కలేదు అని… అంతే… (ఇందిరాగాంధీ పాత్రకు ఇంకెవరినైనా తీసుకోవాల్సింది… ఫాతిమా సనా షేక్ ఆ పాత్రకు ఫిట్ కాలేదు)
మోడీ అండ్ కాషాయ గ్యాంగ్ ఏవేవో సినిమాలకు పరోక్షంగా ప్రమోట్ చేస్తారు గానీ ఈ శామ్ బహదూర్ వాళ్ల కంటికి ఎందుకు ఆనలేదు… అర్థం కాదు… ఎస్, మనం తెలివైన మెచ్యూర్డ్ ప్రేక్షకులం కాం, కాలేదు, కాలేమేమో… రొడ్డకొట్టుడు చెత్తా ఫార్ములా సినిమాలు చూసీ చూసీ అదే తీపి అనుకుంటున్నాం… అది వేపకాయ చేదు అని తెలియనంత అజ్ఞానంలోకి మన నిర్మాతలు మనల్ని నెట్టేశారు తరాలుగా…
వాస్తవానికి శామ్ బహదూర్ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ చేసి ఉండాల్సింది… ఛావా విషయంలోనూ అదే తప్పు జరిగింది… అసలు ఇలాంటివే పాన్ ఇండియా సినిమాలు… చరిత్రను వక్రీకరించి, తిక్క క్రియేటివ్ లిబర్టీ తీసుకునే ఆర్ఆర్ఆర్‌లు, పుష్పాలు కావు…
అసలు ఎంత మందికి మానెక్ షా తెలుసు..? షా మన ఫీల్డ్ మార్షల్… ఐదు యుద్ధాల్లో పాల్గొన్నాడు… దేశం ఈరోజు భద్రంగా ఉందంటే స్వతంత్రం వచ్చాక తను అమలు చేసిన యుద్ధవ్యూహాలే… చివరకు పాకిస్థాన్‌ను మోకాళ్ల మీద నిలబెట్టి, బంగ్లాదేశ్ ఏర్పాటు చేసిన హీరో… 93 వేల మంది పాకిస్థాన్ సైనికులను బందీల్ని చేశాడు…
నిజానికి పాకిస్థాన్‌తో యుద్ధం విషయంలో ఇందిర ఎంత సాహసం చేసిందో, అమెరికా ప్రెసిడెంట్‌ను సైతం ఎహెపోరా అని తృణీకరించిందో… యుద్ధానంతరం పీవోకేని లాక్కుని మరీ బందీల్ని విడిచిపెట్టాల్సి ఉండగా అది చేతకాలేదు ఆమెకు… పైగా మానెక్ షాను పిలిచి తక్షణం యుద్ధం ప్రారంభించాలి అని ఒత్తిడి తెచ్చింది…
లేదు, ఇప్పటికిప్పుడు కాదు, సరైన సమయం కాదు, వాతావరణమూ ఏమాత్రం అనుకూలించదు, కాదూ కూడదూ వెంటనే యుద్ధం కావాలీ అంటే నేను తప్పుకుంటాను అని ఖండితంగా, సవివరంగా చెప్పాడు ఇందిరా గాంధీకి… ఓడిపోయే యుద్ధం చేయలేను, వేరేవాళ్లను నా ప్లేసులో తీసుకున్నా 100 శాతం ఓడిపోతాం అన్నాడు…
తరువాత షా తను అనుకున్నప్పుడే యుద్ధం స్టార్ట్ చేసి, జస్ట్ 13 రోజుల్లో పాకిస్థాన్‌ను మోకాళ్ల మీద కూర్చోబెట్టాడు… శామ్ మానెక్ షా, పాకిస్థానీ ఆర్మీ నియంత యాహ్యాఖాన్ ఇదరు కూడా బ్రిటీష్ ఇండియా సైన్యంలో కలిసి పనిచేసిన వారే ! దేశవిభజన తరువాత ఇద్దరూ వేర్వేరు దేశాలకు చీఫ్‌లయ్యారు… యుద్ధం ముగిసేముందు యాహ్యా ఖాన్‌కు మానెక్ షా మెసేజ్ పంపించాడు… 93 వేల మంది సైనికుల ప్రాణాలను పణంగా పెడతావో, ఓటమిని అంగీకరించి, తలవంచుతావో, బంగ్లాదేశ్ ప్రాంతంలో మీ ఆర్మీ సాగించిన అకృత్యాలకు నువ్వు శిక్ష అనుభవిస్తావో తేల్చుకో అని…
యాహ్యా ఖాన్‌కు మానెక్ షా గురించి తెలుసు… అందుకే తలవంచాడు… ఓటమిని అంగీకరించాడు… కొద్దివారాల తరువాత జుల్పీకర్ అలీ భుట్టో ప్రధాని అయ్యాడు… ఇందిర, భుట్టోల నడుమ సిమ్లా శాంతి ఒప్పందం కుదిరి మొత్తం బందీ సైనికుల్ని వదిలేశారు…
అసలు ఆ శాంతి ఒప్పందమే పెద్ద బ్లండర్ అంటాడు మానెక్ షా… ‘‘పాకిస్తాన్ మనల్ని కోతిని చేసి ఆడించింది’’ అన్నాడు… ఎప్పటికయినా ప్రమాదం అని బెంగాల్ నుండి ఈశాన్య రాష్ట్రాలకి వెళ్ళే దారిలో ఉన్న చికెన్ నెక్ ప్రాంతాన్ని విస్తరించి బంగ్లాదేశ్ భూభాగం కలుపుకోమని ఇందిరకి అప్పటి సైనిక వ్యూహకర్తలు చెప్పినా పట్టించుకోలేదు… ఇప్పుడు చికెన్ నెక్ ప్రాంతం చాలా ప్రమాదకరంగా మారింది…
అంతటి నేషన్ హీరోకు దక్కిన గుర్తింపులు, ప్రశంసలు ఏమిటో తెలుసా..? 2008 లో షా వృద్ధాప్యం వల్ల అనారోగ్యంతో ఊటిలోని హాస్పిటల్ లో చేరితే సైన్యానికి చెందిన తోటి జనరల్స్ పరామర్శించడానికి సైతం అనుమతి ఇవ్వలేదు మన్మోహన్ సింగ్ సర్కార్…
మానెక్ షాని హాస్పిటల్ కి వెళ్లి మరీ యోగక్షేమాలు అడిగింది అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం మాత్రమే. చివరికి మానెక్ షాకి రావాల్సిన పాత బాకీలు 1.15 కోట్లు కూడా ఆయన చివరి రోజుల్లో చెక్ రూపంలో ఇచ్చారు. అదీ కలాం చొరవతో మాత్రమే…
కృష్ణమీనన్ అనే చవట రక్షణ మంత్రి ఉండేవాడు… తనను మానెక్ షా పురుగులా తీసిపడేసేవాడు… తను ఎప్పుడూ ఎవరి ఎదుట తలవంచలేదు… చివరకు అదే కృష్ణ మీనన్ శాం మానెక్ షాని మిలటరీ కోర్టులో దోషిగా నిలబెట్టడానికి తీవ్రంగా ప్రయత్నించి, అంతే తీవ్రంగా విఫలం అయ్యాడు…
కలాం తనను కలిసి తిరిగి వెళ్తున్నప్పుడు… ఇంకేమైనా నాతో అయ్యే పనులు ఉన్నాయా అనడిగాడు మానెక్‌షాను హాస్పిటల్‌లో ఆదరంగా… షా కన్నీళ్లు పెట్టుకున్నాడు… కలాం అదేమని అడిగితే… నా దేశ సుప్రీం ఆర్మీ కమాండర్ నా పరామర్శకు వస్తే, లేచి నిలబడి సెల్యూట్ కొట్టలేకపోతున్నందుకు బాధగా ఉంది సార్ అన్నాడు షా…
శామ్ బహదూర్ కథలో అనేక ఎమోషన్స్… గూస్ బంప్స్ వచ్చే అనేక సీన్లను ఆ డైరెక్టర్ పట్టుకోలేదు… లేకపోతే నిజంగానే అది ఛావాను మించిన కథ అయ్యేది… దేశ ప్రజానీకానికి ఈ దేశ రియల్ హీరోలు ఎవరో తెలిసేది…!!
Share this Article