Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నాగార్జున బాబు గారూ… వీకెండ్ షోకు దిమాక్ ఇంటి దగ్గర మరిచొస్తారా..?

December 9, 2023 by M S R

బిగ్‌బాస్ వోటింగ్ అనేది ఓ ఫార్స్… బయట అనధికారికంగా జరిగే వోటింగులు కూడా ఓ దందా… ప్రత్యేకంగా సోషల్ మీడియా గ్రూపుల్ని ఎంగేజ్ చేసుకుని, ప్రత్యర్థి కంటెస్టెంట్ల మీద విషం చిమ్మడానికి, తమ బాసులకు సానుకూల వోటింగు పెంచడానికి నానా ప్రయత్నాలూ చేస్తాయి ఈ గ్రూపులు… ఇప్పుడు కొత్తేమీ కాదు, మొదటి నుంచీ ఉన్నదే… దానికి ఆయా వ్యక్తుల పేర్లతో ఆర్మీలు, బెటాలియన్లు…

పోనీ, బిగ్‌బాస్ అధికారికంగా ఏమైనా వోటింగ్ వివరాలు చెబుతాడా అంటే అదీ ఉండదు… అంతా మిస్టరీ… ఆ టీం ఏదనుకుంటే అదే ఫిగర్… ఎవడిని ఎప్పుడు ఎలిమినేట్ చేయాలో ముందే ఫిక్సయిపోతుంది… ఆ ప్రకారమే ఆట డిజైన్ చేస్తారు, నడిపిస్తారు… పెద్ద జోక్ ఏమిటంటే..? హౌజులో ఉన్న వాళ్లకు ఎవరు లీస్ట్‌లో ఉన్నారో, ఎవరు టాప్‌లో ఉన్నారో ఎలా తెలుస్తుంది… ఏమో… నిన్న, మొన్న హౌజ్‌మేట్స్ కూడా ఎవరి వోటింగు ఎంతో చెప్పేసుకుంటున్నారు…

సరే, ఇదంతా ఎలా ఉన్నా… పదే పదే శివాాజీని వెనకేసుకొచ్చే నాగార్జునకు దిమాక్ లేదని తనే ప్రతి వారం ప్రూవ్ చేసుకుంటున్నాడు… తన అహంకారం, తనకో తొట్టి గ్యాంగు… శివాజీ చిల్లర వ్యాఖ్యలు చేస్తుంటాడు… వాటిల్లో పొగరు మిక్సయి ఉంటుంది… యావర్ పిచ్చి బాడీ లాంగ్వేజీతో వెక్కిరిస్తుంటాడు… ఇక ప్రశాంత్ ప్రకాష్‌రాజ్‌ను మించిన యాక్టర్… సానుభూతి పొందే వేషాలు ముందే బాగా ప్రాక్టీస్ చేసి వచ్చినట్టున్నాడు… శివాజీ చిల్లర, వెగటు వ్యాఖ్యలు ఎలా ఉంటాయంటే…

Ads

తాజా ఎపిసోడ్లలో ఓ ఆట… శివాజీకి అసలు ఆడటమే తెలియదు… మధ్యలో శోభాశెట్టితో గొడవ… తనెలాగూ వెళ్లిపోతోందని అనుకుందేమో… ఎవరూ ధైర్యం చేయరు కదా… శివాజీని వేసుకుంది… ఆడేసుకుంది… వ్యంగ్యం, విమర్శ కలగలిపి కొట్టింది… లోెపల ఉన్న శివాజీకి, బయట ఎక్కడో ఉన్న నాగార్జునకు మొహాలు మాడిపోయేట్టు…!!

shobha

అన్ని సినిమాలు చేశాడట, వయస్సు మీద పడుతోంది… కాసింత సంస్కారం కూడా లేదు… ప్రియాంక, శోభలను ఉద్దేశించి… ‘‘చిల్లరోళ్లు, కేరక్టర్ లెస్, మేం పీకేదానికి ఉన్నామా..? వీళ్లను ఎవరు పెళ్లి చేసుకుంటారో గానీ భయపడిపోరా, పెళ్లి తరువాత ఇలాగే ఉంటే..? ఇలాంటోళ్లు మన ఇంట్లో ఉంటే గొంతు మీద కాలేసి తొక్కేవాడట… ఇలాంటోళ్లను ఎక్కడా చూడలేదు’’ అని నీచమైన వ్యాఖ్యలకు దిగాడు… తెలుగులో బలుపు అనే పదం ఉంది… నాగార్జునకు తెలిసినట్టు లేదు…

ఇక్కడ శోభాశెట్టి, అమర్‌దీప్‌ల గురించీ చెప్పాలి… అదేదే వండర్ వుమన్ టాస్క్ పెట్టారు… ఉన్నదే ఇద్దరు కాబట్టి ప్రియాకను, శోభను అలంకరించారు… ప్రియాంక మేకప్ బాగా కుదిరింది… అమర్‌దీప్ ఆమెనే విజేతగా ప్రకటించాడు… ఇంకేం, శోభ రెచ్చిపోయి అమర్‌దీప్ వంక విసురుగా చూస్తూ అన్నీ విసిరికొట్టి వెళ్తుంది… ఇది మరీ మోనిత తరహా బిహేవియర్… కరెక్టు కాదు… అమర్‌దీప్ అయితే మొన్న ఓ టాస్కులో నిజంగానే ఎర్రగడ్డ నుంచి వచ్చినట్టు అరుపులు, కేకలు… ఆ అధికారిక, అనధికారిక వోటింగులను పక్కన పెడితే… ఉన్నంతలో అర్జున్, ప్రియాంక హుందాగా వ్యవహరిస్తున్నారు… మిగతావాళ్లు వేస్టున్నర… ప్రత్యేకించి శివాజీ మొత్తం ఈ సీజన్‌కే ఓ కరోనా…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అమరావతిపై ద్వేషం, విషం… మరీ ఈ డర్టీ ముద్రలతోనా..?!
  • నో నో… కల్వకుంట్ల శైలిమ రాజకీయాల్లోకి అస్సలు రాకపోవచ్చు..!!
  • అమెరికా మీద చైనా అగ్రిటెర్రర్ కుట్ర… ఆ ఫంగస్ దానికోసమేనా..?
  • అప్పు పుట్టని దురవస్థ నుంచి…. వన్ ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ దాకా…
  • జుట్టు సెట్ చేయాలంటే కనీసం లక్ష… ఇదొక సక్సెస్ స్టోరీ…
  • కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, సంగీతం, ఫోటోగ్రఫీ, దర్శకత్వం, నటన…
  • రాజకీయ నాయకులతో కృష్ణ కబడ్డీ… తరువాత తనే పాలిటిక్స్‌లోకి…
  • అచ్చు శ్యాంసింగరాయ్‌ కథలాగే… ఆ సినిమాల్లో ప్రస్తావించిన స్టోరీయే..!!
  • మెగాస్టార్‌ కనిపిస్తే చాలు, ఈ కెమెరా రెచ్చిపోయేది… ఓ విశేషబంధం..!
  • జైనబ్… అఖిల్‌కన్నా 9 ఏళ్లు పెద్ద… ఐతే ఏంటట..? ఆమెకు తెలియదా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions