Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈ వెగటు కేరక్టర్ తెరమీదికి మల్లొచ్చింది… ఏం ఇండస్ట్రీరా బాబూ….

April 8, 2025 by M S R

.

శ్రీకాంత్ అయ్యంగార్… ఆమధ్య పిచ్చి కూతలు కూసి, రివ్యూయర్లు, ఫిలిమ్ జర్నలిస్టులను పెంట మీద పురుగుల్లా, కాదు, ఆ పురుగుల విసర్జకాలకన్నా హీనంగా తీసిపారేసిన తిక్క కేరక్టర్ తెలుసు కదా… నథింగ్, ఇలాంటోళ్లను ఎవరూ కంట్రోల్ చేయలేరు… తాజాగా మళ్లీ వచ్చాడురా బాబోయ్…

తొక్కలో లోకం… ఎవడేమనుకుంటే నాకేంటి..? నాకు చాన్సులు ఇచ్చేవాడి ఖర్మ… వాడి దరిద్రం… బొచ్చు, మనది పోయేదేముంది అన్నట్టుగా ఉంటున్నాయి తన మాటలు…

Ads

ఈ సారు గాడు… మైక్ దొరికితే చాలు, ఫాఫం, మైకే వణికిపోతుంది గజగజా… ఏం మాట్లాడతాడో ఎవడికీ తెలియదు, వినేవాడి ఖర్మ… అఫ్ కోర్స్, తనకు కూడా తెలిస్తే కదా ఫాఫం,.. తాజాగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు… ఈ వివరాల్లోకి వెళితే…

అసలు వర్మ స్కూల్ బాపతు కేరక్టర్లు అంతేనేమో… ప్రేక్షకుడు లోకువ… రివ్యూయర్లు పరమ లోకువ… జర్నలిస్టులంటే తనే గతంలో చెప్పాడు కదా… పెంట పురుగుల విసర్జకాలకన్నా హీనం అని… అన్నట్టు ఈయన తన గురువు మెంటల్ వర్మను మించిన కేరక్టర్ నటుడే కాదు, దర్శకుడు కూడా ఉన్నాడట తనలో,.. ఇన్నాళ్లూ తెలియనేలేదు సుమీ…

స్టేల్‌మెట్.,ఇట్స్ యువర్ మూవ్, ఏప్రిల్ ఫూల్ చిత్రాలకు దర్శకత్వం వహించాడట… ఆ సినిమాలకు మనకు తెలియకపోతేనేమి..? వచ్చే ఉంటాయి… ఇవన్నీ సరే…

పొట్టేల్ సినిమా సక్సెస్‌ మీట్‌ (?)లో భాగంగా శ్రీకాంత్ ఆమధ్య మాట్లాడుతూ.. సినిమా రివ్యూయర్లపై దారుణమైన వ్యాఖ్యలు చేశాడు… షార్ట్ ఫిల్మ్ తీయడం కూడా రాని నా ** లు అంటూ అసభ్య పదజాలంతో దూషించాడు…

తాజాగా కులం, క్యాస్ట్ ఫీలింగ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిండు శ్రీకాంత్… వీడియో వదిలిండు… ‘‘చాలా మంది మీ కులమేంటీ? మీకు క్యాస్ట్ ఫీలింగ్ ఉందా? అని అడుగుతున్నారు… నాకు క్యాస్ట్ ఫీలింగ్ ఉంది.. కులం ఫీలింగ్ ఉంది,  నా కులం సింగిల్స్ కులం, సింగిల్స్‌గా ఉన్న అందరూ నా బ్రదర్సే. జై సింగిల్, సింగిల్స్ రాక్స్…’’ అంటూ 90 ఎంఎల్ కొట్టివచ్చినట్టున్నాడు… ఏదో కూశాడు…

https://x.com/Shri__Bharat/status/1908936405583036471?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1908936405583036471%7Ctwgr%5Ea4b614a9776807a6de6cac1fba7f94ead984e13e%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftelugu.filmibeat.com%2Fwhats-new%2Fsrikanth-iyengar-made-controversial-comments-on-caste-154807.html

మరీ శ్రీకాంత్ వంటి కేరక్టర్ల మాటలకూ వార్తలేమిటి..? అందరూ ఆ గురువు శిష్యులే కదా అంటారా..? పాపం, ఆ యాక్ట్రెస్ జ్యోతి ఎంత ఫీలై ఉంటుంది… సింగిల్ అంటాడా..? పైగా సింగిల్స్ అంటే ఓ కులమా..? హవ్వ… కానీ ఏమాటకామాట… తను తాగే బ్రాండ్ ఏమిటో గానీ… చాలా పవర్ ఫుల్ ఉన్నట్టుంది… కిక్కు మామూలుగా లేదు…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మోదీకి ఇండొనేషియా అపూర్వ స్వాగతం – ఎందుకీ ప్రాధాన్యం అంటే?
  • మనకు తెలిస్తేనే నిజం- తెలియకపోతే అబద్ధం అయిపోదు… పునర్జన్మ!!
  • ఒక దశలో ఒకేచోట 50 వేల మంది లైంగిక కార్మికులు!!
  • Nabha Natesh – విరిగిపడి, తేరుకుని, తిరిగి తెరపై ‘మెరుపు కలల’ వైపు!!
  • BRS దాచిపెట్టే వైఫల్యాల్లో మరొకటి – మేడిగడ్డలాగే ‘కన్నెపల్లి’ కూడా!!
  • STOCK MARKET HUMOUR – Sorry, I haven’t verified the Data
  • ట్రంప్ – రెడ్ కార్డ్..! ఫిఫా పోటీల్లోనూ తనే ‘సుప్రీం రెఫరీ!!
  • TGRPDCL @ రైతు డిస్కమ్ – రేవంత్ రెడ్డి సర్కారు భలే ప్లాన్ !!
  • రొనాల్డో శకం ముగిసింది – ఫుట్‌బాల్ సామ్రాట్ కన్నీటి వీడ్కోలు!!
  • Telangana’s Spiritual Renaissance – Revanth Vision for Grandeur

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions