.
సుజాత కార్తికేయన్… ఒడిశా కేడర్ సీనియర్ ఐఏఎస్ అధికారిణి… చాలా ఎఫీషియెంట్, పవర్ ఫుల్… ఐతేనేం, మన వ్యవస్థ వేరు కదా… నవీన్ పట్నాయక్ సీఎంగా ఉన్నన్ని రోజులూ ఆమె శక్తిమంతురాలు… బీజేడీ అధికారం కోల్పోయి, ఇక నవీన్ పట్నాయక్ పెద్దగా రాజకీయాల్లో చురుకుగా లేడుగా ఆమెకూ కష్టకాలం…
కష్టకాలం అంటే డబ్బుల్లేకపోవడమో, కేసుల పాలవడమో, జైలు పాలు కావడమో కాదు… సర్వీసులో ఉండలేని పొగను, సెగను ఎదుర్కోవడం..! బీజేపీ పేరుకు చాలా నీతులు చెబుతుంది… కానీ ఆచరణ వేరు… ఈమే పెద్ద ఉదాహరణ…
Ads
2000 కేడర్ ఈమె… భర్త పేరు వీకే పాండ్యన్… తనూ సేమ్ ఇయర్ ఐఏఎస్… తమిళ రూట్స్… నవీన్ పట్నాయక్ వాళ్ల పనితీరు చూసి స్వేచ్ఛను ఇచ్చాడు… ఒక దశలో పాండ్యన్ యాక్టింగ్ సీఎం… ఆయన భార్య మహిళా శిశు అభివృద్ది శాఖకు సెక్రటెరీ కమ్ కమిషనర్…
లక్షల డ్వాక్రా, స్వయంసహాయక మహిళా సంఘాల్ని విస్తరించి, వేల కోట్ల టర్నోవర్ సాధించేలా చేసింది… అదుగో అక్కడ బీజేపీకి కడుపుమంట… ఎన్నికల ముందు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది… ఏమనీ అంటే… ఆమె మహిళల్ని నవీన్ పట్నాయక్‌కు వోటేసేలా ప్రభావితం చేస్తుందని… మన ఎన్నికల సంఘం సంగతి తెలిసిందే కదా… బదిలీ చేసింది…
ఆర్థిక శాఖలో ఏదో ప్రాధాన్యం లేని సెక్రెటరీ పోస్టుకు… ఎన్నికలకు ముందే పాండ్యన్ వీఆర్ఎస్ తీసుకుని అధికారికంగానే బీజేడీలో చేరాడు… నవీన్ పట్నాయక్ వారసత్వం తనదే అనుకుంది రాష్ట్రం… కానీ డెస్టినీ ఎదురుతన్నింది… బీజేడీ ఓడిపోయింది… తన ఓటమికి పాండ్యన్ ఓవరాక్షనే కారణం అనుకున్న నవీన్ పట్నాయక్ తనను పూర్తిగా దూరం పెట్టేశాడు…
ఇప్పుడాయన్ని పట్టించుకునేవాడే లేడు… ఆయన భార్య 6 నెలలు ఏదో సాకుతో లీవ్ పెట్టింది… ఐపోయాక పొడిగించడానికి కొత్త బీజేపీ ప్రభుత్వం అంగీకరించలేదు… రోజూ మీడియా విమర్శలు, బీజేపీ సందేహాలు… మరోవైపు భర్త పరిస్థితీ అగమ్యగోచరం… చివరకు తనూ వీఆర్ఎస్ తీసుకుందామని అప్లయ్ చేసింది… 3 నెలలు గడువు కూడా అడగకుండానే కేంద్రం ఠకీమని యాక్సెప్ట్ చేసింది…
మరి ఇప్పుడిక భార్యాభర్తలు ఏం చేయబోతున్నారు..? పెద్ద ప్రశ్న… బీజేడీ ఆల్రెడీ పాండ్యన్‌ను దూరం పెట్టేసింది… ఆయన భార్యనూ ఎంకరేజ్ చేయదు… డబ్బు అనేది కాదు వాళ్ల సమస్య… మొన్నమొన్నటిదాకా రాష్ట్రంలోకెల్లా పవర్ ఫుల్ కపుల్… ఇప్పుడేం చేయాలనే సందిగ్ధంలో, మథనంలో మునిగిపోయింది..!
రాజకీయ పార్టీలతో, నాయకులతో అంటకాగే సివిల్ సర్వీసు అధికారులు ఎప్పుడోసారి ఈ సిట్యుయేషన్ ఎదుర్కోవడానికి మానసికంగా, ఆర్థికంగా ప్రిపేర్ అయి ఉండాలనేది సుజాత కార్తికేయన్ కథలో నీతి..!! తెలుగు రాష్ట్రాల్లోనూ తరచి చూస్తే ఉదాహరణలు దొరక్కపోవు..!!
Share this Article