పార్ధసారధి పోట్లూరి …… చిత్ర పరిశ్రమకి సంబంధించి ఒకే ఒక్క లెజండ్ లేదా దిగ్గజ నటుడు ఉంటాడు ఎప్పటికీ ! తెలుగు చిత్రసీమకి సంబంధించి ఒకే ఒక్క లెజెండ్ ఉన్నారు ! ఆయన సామర్ల వెంకట రంగా రావు గారు SVR! ‘మెథడ్ యాక్టింగ్’ కి ఆద్యుడు భారత చలనచిత్ర సీమకి !
Yes. మెథడ్ యాక్టింగ్ అంటే ఏమిటో అసలు ఎవరికీ తెలియని రోజుల్లో సహజంగానే కర్ణుడు కవచ కుండలాలతో పుట్టినట్లు SVR పుట్టుకతో అబ్బిన విద్యగా నాటకాలు, తరువాత చిత్ర పరిశ్రమకి పరిచయం అయ్యారు. ఇప్పుడంటే మెథడ్ యాక్టింగ్ నేర్పడానికి అంటూ ప్రత్యేకంగా ఇన్స్టిట్యూట్ లు పుట్టుకొచ్చాయి కానీ అలాటివి ఏవీ లేని రోజుల్లోనే SVR చేసి చూపించారు.
SVR మెథడ్ యాక్టింగ్ చేస్తున్నారు అని అప్పట్లో ఎవరికీ తెలియదు, ఆ మాటకొస్తే మెథడ్ యాక్టింగ్ అనేది ఒకటి ఉంటుది అని ఎవరికీ తెలియదు.
Ads
1. పాతాళ భైరవి సినిమాలో నేపాళ మాంత్రికుడు పాత్రలో SVR ని కాక వేరే ఎవరినన్నా ఊహించుకోగలమా ? SVR ఆ సినిమాలో లేకపోతే ఈ రోజు ఆ సినిమా గురించి మనం మాట్లాడుకోము !
2.మాయాబజార్ సినిమాలో ‘ఘటోత్కచుడు’ పాత్రలో SVR ని కాక వేరే ఎవరినన్నా ఊహించుకోగలమా ? SVR లేకపోతే ఆ సినిమా గురించి ఎవరూ మాట్లాడుకోరు ఇప్పటికీ !
3. నర్తనశాల సినిమాలో కీచకుడి పాత్రలో SVR ని కాక వేరే ఎవరినన్నా ఊహించుకోగలమా ? 1964 లో జకార్తాలో జరిగిన ఆఫ్రో – ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో నర్తనశాల ప్రదర్శించబడింది. SVR గారికి బెస్ట్ మేల్ యాక్టర్ అవార్డ్ ఇచ్చారు నిర్వాహకులు…
4. జకార్తా ఫిల్మ్ ఫెస్టివల్ లో నర్తనశాల సినిమాని చూసిన హాలీవుడ్ దర్శకులు మీరు భారతదేశంలో పుట్టారు కానీ అదే అమెరికాలో పుట్టి ఉంటే ఈ పాటికి మీకు ఆస్కార్ అవార్డ్ వచ్చి ఉండేది అన్నారు SVR గారిని ఉద్దేశించి ! ఇందులో ఏ మాత్రం అతిశయోక్తి లేదు కదా ?
5. నర్తనశాల సినిమాలో సైరంధ్రి తనని తిరస్కరించిందని బాధపడుతూ కోపంతో అద్దం ముందు కీచక పాత్రధారి SV రంగారావు చేసిన ఏకపాత్రాభినయం న భూతో న భవిష్యతి ! నిజానికి ఈ సీన్ ని ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చూసిన హాలీవుడ్ దర్శకులు ఆశ్చర్యపోయారుట ! మొత్తం ఒకే టేక్ లో తీసిన ఆ సీన్ లో SVR అభినయం అద్భుతం ! అలాగే డబ్బింగ్ చెప్పినప్పుడు కూడా ఆ సీన్ తాలూకు ఆత్మని రక్షిస్తూ ఏ మాత్రం ఎక్కడా లోపం లేకుండా డబ్బింగ్ చెప్పడం అనేది కేవలం లెజండ్ కి మాత్రమే సాధ్యం ! మరీ ముఖ్యంగా ఏకపాత్రాభినయ దృశ్యం చూసే ఆస్కార్ అవార్డ్ వచ్చి ఉండేది అని అన్నారు అప్పటి హాలీవుడ్ దర్శకులు.
6. ఏదీ భారత దేశం మొత్తం మీద SVR లాంటి లెజండ్ ని ఒక్కరిని చూపించండి ?
7. తెలుగు అక్షరాలని ఔపోసన పట్టిన SVR లాంటి మహా నటుడిని ఒక్కరిని చూపించండి ?
‘క ‘ అక్షరాన్ని ‘ఖ ‘ గా పలకగలిగిన నేటి తరం కథానాయకులకి అవార్డు ఇచ్చేస్తున్నారు ఖర్మ ! SV రంగారావు గారికి పద్మశ్రీ,పద్మ భూషణ్ అవార్డులు ఇవ్వలేదు అంటే వాటికి ఆ అర్హత లేదు అనుకోవాలి కదా ? నిజం! పద్మ అవార్డులకంటే ఇంకా గొప్పది ఏదన్నా ఉంటే అది ఇవ్వాలి కానీ అలాంటి అవార్డు ఏదీ లేదు కనుకనే ఆయనకి ఇవ్వలేదు. అలా అని SVR ఏనాడూ పైరవీలు చేసుకోలేదు అవార్డుల కోసం! అవార్డుల కోసం త్వం శుంఠ అంటే త్వం శుంఠ అని వెంపర్లాడే వాళ్ళకి, అలాగే సదరు అవార్డు అంత గొప్పది ఇంత గొప్పదీ అంటూ వీర భజన చేసే కొన్ని మీడియా సంస్థలకి ఈ పోస్ట్ అంకితం !
Share this Article