తమిళనాడు… మధురైలో హరీశ్ వర్మన్ అనే ఒక బాలుడు… తనకు ఓ సైకిల్ కొనుక్కోవాలని చిరకాల కోరిక… పైసా పైసా పొదుపు చేసుకుంటున్నాడు… సరిపడా సొమ్ము సమకూరాక సైకిల్ కొనుక్కుని, దానిపై బడికి వెళ్లాలని ఆశ… పొదుపు డబ్బుల్ని రెండేళ్లుగా దాచుకుంటున్నాడు… తండ్రి ఓ చిన్న ఎలక్ట్రీషియన్… నేరుగా సైకిల్ కొనిచ్చే స్థోమత లేదు… అయితేనేం..? కరోనా నేపథ్యంలో ఈ రోగ వార్తలు వినీ, ఈ చావు వార్తలు చూసి, ఆ పిల్లవాడి మనస్సు చలించిపోయింది… తను దాచుకున్న డబ్బును సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇస్తున్నట్లు ఏకంగా సీఎం స్టాలిన్‌కే ఓ లేఖ రాశాడు…
.
ఈ సొమ్మును ఎవరైనా ఓ కోవిడ్ పేషెంట్ చికిత్సకు అందివ్వాలని ఆ బాలుడు తన లేఖలో పేర్కొన్నాడు… ఈ లేఖ చూసి స్టాలిన్ కదిలిపోయాడు… ఆ పిల్లవాడికి ఒక సైకిల్ బహుమానంగా పంపించాడు… ఈ సైకిల్‌ను స్థానిక ఎమ్మెల్యే, ఇతర నాయకులు ఆ బాలుడికి అందించారు… దీంతో ఆ బాలుడు సైకిల్‌ను తడుముకుంటూ తెగ సంబరపడిపోయాడు… అంతేకాదు, ఆ బాలుడికి స్టాలిన్ ఫోన్ చేశాడు… ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించాడు…
.
.
.
మళ్లీ నచ్చావురా స్టాలినా…. జీతే రహో… ఈ స్పిరిట్ కరోనా నియంత్రణలో అక్షరాలా పాటించాలని ఆశిస్తున్నాం… కేసులు, వ్యాప్తి, మరణాలు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఉంది… తమిళప్రజలందరూ ఆ అసమర్థ బీజేపీ-అన్నాడీఎంకే సంయుక్త ప్రభుత్వంపై విరక్తితో ఉన్నారు… అందుకే నిన్ను ఎన్నుకున్నారు… అమ్మ క్యాంటీన్ల కొనసాగింపుపై నీ నిర్ణయాన్ని జనులంతా మెచ్చుకున్నారు… ఇంకా కావాలి… ఫ్రీ టెస్టులు, ఫ్రీ వేక్సినేషన్, ఫ్రీ అంత్యక్రియలు కోరుకుంటున్నారు… స్టాలిన్, 68 ఏళ్ల వయస్సులో ముఖ్యమంత్రివయ్యావు… జీవితాన్ని సార్థకం చేసుకునే బంగారు అవకాశం వచ్చింది… ఇల్లు కదలకుండా, నయాపైసా ప్రజల గురించి పట్టించుకోకుండా, చిల్లర గప్పాలు కొట్టుకునే బ్యాచు నేతల్లోకి చేరకుండా… ఏతుల ముఖ్యమంత్రివి ఎందుకు బతికి ఉన్నావురా అని జనంతో ఛిఛీ అనిపించుకోకుండా… ఈ గత్తర దుర్దినాల్లో ప్రజల్ని ఆదుకో..!
Ads
Share this Article