……… By……. Srini Journalist………… నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR) లో చనిపోయిన ప్రతీ రైతు పేరు మీద వారి కుటుంబాలకి 3లక్షల చొప్పున దాదాపు 750 కుటుంబాలకు 23 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం అంటే తెలంగాణ ప్రజల తరపున ఇవ్వబోతున్నారు. కేసీఆర్ ప్రకటనను ఉటంకిస్తూ KTR చేసిన ట్వీట్ కి సినీ తారలతో పాటు చాలా మంది చప్పట్లు కొట్టారు మంచి నిర్ణయం అని. కానీ నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి.
1. ఏడు వందలో, ఎనిమిది వందలో.. ఎంతో కొంత.. కానీ అధికారికంగా రైతుల మృతుల లెక్కలు ఎవరు చెప్పాలి? కేంద్ర ప్రభుత్వమా లేకుంటే రాష్ట్ర ప్రభుత్వమా?
2. కేంద్రం, ఉత్తర్ ప్రదేశ్, హర్యానాలు ఆ ఆలోచనే చేయవు. ఇక మిగిలింది నాన్ బీజేపీ రాజ్యాలు అయిన ఢిల్లీ, రాజస్థాన్. ఆ ప్రభుత్వాలు కూడా రైతుల మృతుల సంఖ్యపై ఎలాంటి కసరత్తు చేయలేదు. మరి ఎలా తేలుస్తారు లెక్కలు. సాధికారమైన కమిటీ రిపోర్ట్ ఆధారంగానే ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు విడుదల చేయాలి కదా, లేకుంటే కోర్టుల ముందు నిలబడతాయా?
3. మన రాష్ట్రానికి ఏ సంబంధం లేకపోయినా మన రాష్ట్ర నిధుల నుంచి ఇచ్చి, మోడీ కూడా ఇవ్వాలి డబ్బులు అంటున్నారు. కేంద్రం, బీజేపీ రాజ్యాలు తరువాత, ముందు బీజేపీయేతర రాజ్యాలయిన పంజాబ్ (ఈ రాష్ట్ర రైతులు ఉన్నారని అంటున్నారు) రాజస్థాన్, ఢిల్లీ వాళ్ళు కదా ముందుగా డబ్బులు ఇవ్వాల్సింది. కేసీఆర్ ప్రకటన కారణంగా బీజేపీ కంటే ఎక్కువ ఇబ్బంది పడేది కాంగ్రెస్ , ఆమ్ ఆద్మీ పార్టీ కదా.
4. ప్రభుత్వ ఖజానా నుంచి చెక్కుల ద్వారానే కదా డబ్బులు వెళ్లాల్సింది. మరి ఏ లెక్కన లిస్ట్ తయారు చేస్తారు? తెలంగాణ ప్రభుత్వమే జ్యూడిషల్ కమిటీయో, రిటైర్డ్ IAS అధికారులతో కమిటీ వేస్తుందా?
5. క్రీడాకారులకు ప్రోత్సహకాలు ఇచ్చినప్పుడు, అధికారికంగా రికార్డ్స్ ఉంటాయి కనుక చెక్స్ ఇవ్వొచ్చు. ఒక రాష్ట్రంలో విపత్తు వస్తే మరో రాష్ట్రం నేరుగా బాధిత రాష్ట్ర సహాయ నిధికి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారు. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు.
6. ఉత్తర్ ప్రదేశ్, హర్యానా రాష్ట్రాల రైతులకు చెక్కులు ఇస్తాను అంటే అస్సలు ఒప్పుకోవు. ఒక రాష్ట్ర ప్రభుత్వ డబ్బులను, మరో రాష్ట్రంలో ఆ ప్రభుత్వ సమ్మతి లేకుండా పంపిణీ జరగడం సాధ్యమా?
7. ఒకవేళ సాధ్యమే అనుకుంటే, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి హైదరాబాద్ కి వచ్చి, అక్కడి ప్రభుత్వం తరపున ఇక్కడ ఆత్మహత్య చేసుకున్న రైతులకు తలా పది లక్షలు ఇస్తాను అంటే, తెలంగాణ ప్రభుత్వం ఉరుకుంటుందా?
8. కర్ణాటక రాష్ట్రం ఏ పది వేల కొట్లో తెలంగాణకు కేటాయించి, ఇక్కడి ప్రభుత్వ బాధితులకు రెగ్యులర్ గా డబ్బులు పంచుతా అంటే?
9. అసలు ఒక రాష్ట్రం తనకు సంబంధం లేని ఇతర రాష్ట్రంలో ఇతర ప్రభుత్వ నిర్ణయాల కారణంగా నిరాశ్రులయిన బాధిత కుటుంబాలకు నేరుగా నిధులు ఇస్తాము అంటే రాజ్యాంగం ఒప్పుకుంటుందా?
Share this Article