Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఓ వైద్యుడి మానవత- ఓ పేద కూలీ నిజాయితీ… ఆహా; రుణానుబంధం…

March 12, 2026 by M S R

.

కళ్లు మూసి ఒక్కసారి ఆలోచిస్తే… మన చుట్టూ అపారంగా కమ్ముకుంటున్న నెగెటివిటీ… పాజిటివ్ వైబ్స్ ఉన్న కథలు కనిపించక, ఒకటీ అరా ఉన్నా మీడియా దాన్ని పట్టించుకోక… ఆ నెగెటివిటీయే మనల్ని మరింత బలంగా కమ్మేస్తోంది…

ఒక కథ చదవండి… కథ కాదు, వాస్తవంగా జరిగిందే… ఇది ఓ పదకొండేళ్ల రుణానుబంధం, ఏ పేద కూలీ నిజాయితీ… తన పేరు రామ్ సహాయ్… జరిగింది పంజాబ్ లోని పాటియాలా…

Ads

ఆపదలో అభయహస్తం..: అది పదేళ్ల క్రితం నాటి మాట… పంజాబ్‌లోని పాటియాలాలో రామ్ సహాయ్ అనే కూలీ కడుపు నొప్పితో విలవిలలాడిపోతున్నాడు… చేతిలో చిల్లిగవ్వ లేదు… అకాల్ హాస్పిటల్‌లో డాక్టర్ భగవంత్ సింగ్ దగ్గరకు వెళ్లాడు… ఆయన చూడగానే చెప్పేశాడు… నీకు అపెండిక్స్ ఆపరేషన్ చేయాలి అర్జెంటుగా అన్నాడు… సదరు కూలీ దగ్గర చిల్లిగవ్వ లేదు, ఏడవసాగాడు… వేల రూపాయలు తెచ్చేదెలా..?

ఆ రోగి దీనస్థితిని చూసి డాక్టర్ మనసు కరిగింది… “నీ ప్రాణం ముఖ్యం భయ్యా.. డబ్బులు తర్వాత చూద్దాం” అని చెప్పి, నయా పైసా తీసుకోకుండా ఆపరేషన్ చేసి ప్రాణం నిలబెట్టాడు… నేను ఉచితంగా, దానధర్మంగా వైద్యం చేశానులే అనకుండా… ‘‘నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు వచ్చి ఇవ్వు” అని నవ్వుతూ సాగనంపాడు… పుణ్యకార్యం…

రెక్కల కష్టం- గుండె నిండా నిజాయితీ…: ఆపరేషన్ అయిపోయింది, ప్రాణం నిలబడింది… కానీ రామ్ సహాయ్ మనసులో ఆ డాక్టర్ మాటలు పదే పదే వినిపిస్తూనే ఉన్నాయి… రోజువారీ కూలీ పని చేస్తూ, వచ్చే అరకొర సంపాదనలో పైసా పైసా కూడబెట్టడం మొదలుపెట్టాడు… ఒక ఏడాది కాదు, రెండేళ్లు కాదు… ఏకంగా 11 ఏళ్లు! అవును, తన ప్రాణం ఖరీదును ఆ డాక్టర్ గారికి చెల్లించాలని ఆ పాత నోట్లను భద్రంగా దాచుకున్నాడు…

తిరుగు ప్రయాణం…: పదకొండేళ్ల తర్వాత… ఒకరోజు రామ్ సహాయ్ పాత పాటియాలా ఆసుపత్రి ముందు నిలబడ్డాడు… చేతిలో ముడతలు పడ్డ పాత కరెన్సీ నోట్లు… తనని గుర్తుపడతారో లేదో అన్న సందేహం ఉన్నా, ఆ రుణం తీర్చుకోవాలన్న తపన ఆయనను అక్కడికి నడిపించింది… డాక్టర్ ఊర్లో లేడు, రెండు రోజుల తరువాత వస్తాడని చెప్పారు… రుణం తీర్చుకునే వెళ్లాలని, రెండు రోజుల పాటు అక్కడే తిండి తిప్పలు మానేసి ఎదురుచూశాడు…

చివరకు డాక్టర్ భగవంత్ సింగ్ రాగానే, ఆ వృద్ధ కూలీ ఆయన పాదాలకు నమస్కరించి, తన దోసిట్లోని డబ్బును ఆయన ముందు పెట్టాడు… ఆ క్షణం డాక్టర్ నిర్ఘాంతపోయాడు…

ఆ డాక్టర్ కళ్లలో నీళ్లు తిరిగాయి… ఈ రోజుల్లో లక్షల ఫీజులు కట్టించుకున్నా కనీసం కృతజ్ఞత చూపని లోకంలో, ఒక పేద కూలీ దశాబ్దం దాటినా తన మాటను గుర్తుపెట్టుకుని రావడం ఆయనను కదిలించివేసింది… “ఈ డబ్బు కంటే నీ నిజాయితీ చాలా గొప్పది రామ్ సహాయ్” అంటూ ఆ వృద్ధుడిని ఆలింగనం చేసుకున్నాడు… ఆ డబ్బును తీసుకోవడానికి ఆయన మనసు ఒప్పుకోలేదు… బదులుగా, తనే ఆ పేద కూలీకి ఆత్మీయంగా మిఠాయిలు తినిపించి సాగనంపాడు…


డబ్బులు ఇస్తే బాకీ తీరుతుందేమో కానీ, ఒక మనిషి చూపిన ఔదార్యానికి, ప్రేమకు ఎప్పటికీ రుణం తీర్చుకోలేం… రామ్ సహాయ్ వంటి వ్యక్తులు ఉన్నంత కాలం.. డాక్టర్ భగవంత్ సింగ్ వంటి మహానుభావుల సేవలు వృథా కావని ఈ కథ నిరూపిస్తోంది…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రాజా విక్రమార్క… ఒక వేట, ఒక బందిపోటు, ఒక అగ్గిబరాటా…
  • ఓ వైద్యుడి మానవత- ఓ పేద కూలీ నిజాయితీ… ఆహా; రుణానుబంధం…
  • రైట్ టు డై..! ఈ తీర్పు చెప్పేవేళ… ఆ జడ్జి కంటతడి ఎందుకంటే..?
  • నేను పావనిపుత్ర, నాట్ సరస్వతిపుత్ర… అనంతశ్రీరామ్ సెటైర్ ఎవరిపై..?
  • ఓ చిన్నమాట… చెలరేగిన సీపీఎం సోషల్ ఆర్మీ… చివరకు సీఎం క్షమాపణ…
  • మసాలా కాదు, కంటెంట్ కావాలి… అందుకే మలయాళంలో డెబ్యూ…
  • రాహుల్ గాంధీ పౌరసత్వం కేసు ఎక్కడి దాకా వచ్చింది..?!
  • ఇదే మరి… అనవసరంగా గోకనేల..? ఆనక సారీతో లెంపలేసుకోనేల..?!
  • కడియం, దానం… అసలు జవాబులు దొరకని కొన్ని భేతాళ ప్రశ్నలు…
  • అమెరికాలో రిలయెన్స్ రిఫైనరీ… ఆయిల్ మార్కెట్‌లో సంచలనం…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions