ఓ రైతు తన గాడిదను ఎప్పటిలాగే రాత్రి ఓ చెట్టుకు కట్టివేశాడు… రాత్రిపూట ఓ దెయ్యం చూసి, జాలిపడి తాళ్లు విప్పి వదిలేసింది…
.
గాడిద కదా, దానికేం తెలుసు..? వెంటనే ఓ పొలంలో పడింది… తినేంత కాడికి తిన్నది, మిగతాది ధ్వంసం చేసింది…
.
ఆ పొలం రైతు భార్యకు తిక్కరేగి, ఆ గాడిదను నరికి చంపేసింది… నా గాడిదను చంపేస్తావా అని గాడిద యజమాని ఆగ్రహంతో ఆమెను చంపేశాడు… నా భార్యను చంపుతావా అని ఆమె భర్త ఈ గాడిద యజమానిని ఖతం చేశాడు… నా భర్తను చంపుతావా అని కోపంతో గాడిద యజమాని భార్య సదరు రైతు ఇంటికి నిప్పు పెడుతుంది… నా ఇంటినే కాలబెడతావా అంటూ ఆ రైతు ప్రతీకారంగా ఆమెను, పిల్లల్ని చంపేస్తాడు…
.
ఈలోపు తనకు దెయ్యం కనిపిస్తుంది, తనే గాడిద కట్లు విప్పానని, ఈ అరిష్టాలు ఊహించలేదని చెబుతుంది… నీ కళ్లు చల్లబడ్డాయా అని దెయ్యాన్ని రైతు నిందిస్తాడు…
.
ఒరే మూర్ఖుడా..? నేనేం చేశానురా, కేవలం గాడిద తాళ్లు విప్పాను… అంతే… మీరే మీలోని అసలు దెయ్యాల్ని బయటికి తీశారు… చంపుకున్నారు… ఇక నోర్మూసుకో అని వెళ్లిపోయింది ఆ దెయ్యం…
.
తరువాతకాలంలో ఆ దెయ్యపు సంతానమే ఇండియన్ మీడియాగా అవతరించింది… రోజుకొక గాడిదను, అంటే ఏదో ఓ వివాదాన్ని తాళ్లు విప్పి వదులుతుంది ఈ సంతానం…
.
ఇక ప్రజలు వాదనలతో, తిట్లతో, డిబేట్లతో, దాడులతో చంపేసుకుంటున్నారు… స్నేహితుల్లేరు, పెద్దాచిన్నా లేదు… పక్కింటివారని లేదు, చుట్టాలని చూసేది లేదు… తన్నుకోవడమే…
.
(ఓ ఆంగ్ల పోస్టుకు స్వేచ్చానువాదం ఇది…)
Share this Article