.
ఆమె తన హెయిర్ డ్రైయర్‌ను అమ్మేసింది, ఎందుకంటే అతను రాసిన చేతివ్రాత ప్రతులను మెయిల్ చేయాలి… ఆ తర్వాత ఆ రచనకే నోబెల్ బహుమతి వచ్చింది… ఈ కథలోకి వెళ్దాం…
గేబ్రియల్ గార్సియా మార్క్వెజ్ వయస్సు 13 సంవత్సరాలు… కొలంబియాలోని ఒక స్కూల్ డ్యాన్స్‌లో అతను మెర్సిడెస్ బార్చాను చూశాడు… ఆమె అందంగా, ఆత్మవిశ్వాసంతో కనిపించింది… అతను తన స్నేహితుల వైపు తిరిగి, ఒక టీనేజ్ ఊహలా అనిపించే ప్రకటన చేశాడు…: “నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నాను….”
Ads
కానీ ఆమెకు అసలు అతను ఎవరో తెలియదు… తను పేద కుటుంబం నుండి వచ్చిన స్కాలర్‌షిప్ విద్యార్థి… ఆమె ఓ ఫార్మసిస్ట్ కూతురు, సంపన్నంగా, ఉన్నతంగా, అపురూపంగా పెరిగింది… ఆమె అతని స్థాయికి చాలా దూరంలో ఉంది… ఎత్తులో… కాబట్టి, వాస్తవం సహకరించనప్పుడు కలలు కనేవారు చేసే పనినే అతను చేశాడు…: తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకోవడానికి ఆ నగరాన్ని విడిచి వెళ్లిపోయాడు…
పద్దెనిమిది సంవత్సరాలు గడిచాయి… అతను ఒక నగరం నుండి మరో నగరానికి తిరుగుతూ, జర్నలిజం ఉద్యోగాలు, సాహిత్యపు కలలను వెంబడి పరుగులు తీశాడు… ఎప్పుడూ డబ్బు లేకుండా ఉండేవాడు, కానీ ఎప్పుడూ రాస్తూనే ఉండేవాడు… తాను పెళ్లి చేసుకుంటానని ప్రతిజ్ఞ చేసిన ఆ అమ్మాయి గురించే ఎప్పుడూ ఆలోచించేవాడు…
1958లో, ఒక సీరియస్ జర్నలిస్ట్‌గా నిలదొక్కుకున్న తర్వాత, అతను ఆమె కోసం తిరిగి వచ్చాడు… ఈసారి, ఆమె ‘సరే’ అంది… వారు వివాహం చేసుకున్నారు, ఇద్దరు కుమారులు పుట్టారు, డబ్బు తప్ప అన్నింటిలోనూ సంపన్నమైన జీవితాన్ని నిర్మించుకున్నారు…
గార్సియా మార్క్వెజ్ రచనలు చేశాడు… నవలలు ప్రచురించాడు… విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు కానీ ఆదాయం మాత్రం దాదాపు సున్నా… మెర్సిడెస్ ప్రతి పైసాను ఆచి తూచి ఖర్చు చేసేది, కుటుంబాన్ని నిర్వహించేది, బ్యాంకు ఖాతాలు అవసరాలకు వ్యతిరేకంగా ఉన్నా, తన భర్త ప్రతిభను మాత్రం బలంగా నమ్మేది…
అప్పుడు 1965లో, వారు అకాపుల్కోకు కారులో వెళ్తున్నప్పుడు, ఒక అసాధారణ సంఘటన జరిగింది… ఒక నవల మొత్తం కథాంశం అతని మనస్సులో మెరుపులా, పూర్తిగా రూపుదిద్దుకుంది… అది ఏడు తరాల బ్యూండీయా కుటుంబం కథ… ఒక శతాబ్దం పాటు సాగిన ఓ ప్రేమ, యుద్ధం, ఒంటరితనం కథ….
వెంటనే అతను కారును వెనక్కి తిప్పి, నేరుగా ఇంటికి డ్రైవ్ చేశాడు… “నేను ఈ పుస్తకాన్ని రాయాలి,” అని మెర్సిడెస్‌తో చెప్పాడు… “దీనికి చాలా సమయం పడుతుంది, మన దగ్గర ఉన్న డబ్బు అయిపోతుంది…” ఆమె స్థిరంగా అతని కళ్లలోకి చూసింది… చెప్పింది… “మీరు తప్పకుండా రాయండి…”
పద్దెనిమిది నెలల పాటు, గార్సియా మార్క్వెజ్ తన అధ్యయనం గదిలోకి అదృశ్యమయ్యాడు… ప్రతి రోజూ… రోజంతా అదే ధ్యాస… మకోండో కథ తనను ఆవహించినట్లుగా రాశాడు… అతను జర్నలిజాన్ని వదిలేశాడు… పూర్తిగా సంపాదించడం మానేశాడు… వారి పొదుపు అంతా ఆవిరైపోయింది…
మెర్సిడెస్ వారి మనుగడకు ప్రధాన ఆధారం అయింది… ఆమె ఇంటి యజమానులతో, అప్పు ఇచ్చినవారితో, విద్యుత్ సంస్థలతో, ఇతర బేసిక్ నీడ్స్ సంస్థలు, బకాయిలను డీల్ చేసేది… మాట్లాడేది… ఆమె వారి కారును, వారి ఏకైక విలువైన ఆస్తిని అమ్మేసింది…
ఆమె అతనిని ప్రతి ఆర్థిక సమస్య ఇబ్బంది పెట్టకుండా రక్షించింది, తద్వారా అతను కథలోనే ఉండగలిగేలా…! నాన్న పని చేస్తున్నప్పుడు నిశ్శబ్దంగా ఉండమని తన కొడుకులకు చెప్పింది… కలను వాస్తవం అడ్డుకోవడానికి ఆమె నిరాకరించింది… స్నేహితులు వారిని పిచ్చివాళ్ళుగా భావించారు… పిల్లలకు కనీసం స్కూల్ షూస్ కొనడానికీ డబ్బు లేనప్పుడు బంధుగణం ఆయన్ని తిట్టింది, దిక్కుమాలిన నవల రాయడం మానేసి నీ కుటుంబ జీవనంపై కాన్సంట్రేట్ చేయి అని చెప్పింది…
కానీ మెర్సిడెస్ వెనక్కి తగ్గలేదు… 1966లో, చేతివ్రాత ప్రతులు పూర్తయ్యాయి… దాదాపు 500 పేజీలు… నూరు సంవత్సరాల ఏకాంతం (One Hundred Years of Solitude) కథ, అతను తనలో రోజుల తరబడీ మథించి, మోసిన కథ, ఇప్పుడు నిజమై, టైప్ చేయబడి, బ్యూనస్ ఎయిర్స్ (Buenos Aires)లోని పబ్లిషర్‌కు పంపడానికి సిద్ధంగా ఉంది…
వారిద్దరూ తమ అపార్ట్‌మెంట్‌లో పూర్తయిన పనిని పట్టుకుని నిలబడ్డారు, అలసిపోయారు కానీ విజయం సాధించిన భావన… అప్పుడు దాన్ని పోస్ట్ చేయాలి… మెక్సికో సిటీ నుండి అర్జెంటీనాకు అంతర్జాతీయ పోస్టల్ ఖరీదైనది… చేతివ్రాత ప్రతులు బరువుగా ఉన్నాయి… అపార్ట్‌మెంట్ మొత్తంలో మిగిలిన ప్రతి పైసాను లెక్కించారు…
సరిపోలేదు… మెర్సిడెస్ వెనకాడలేదు… ఇంకా ఇంట్లో అమ్మని పరికరాలు, వస్తువులు ఏమున్నాయో వెతకసాగింది… నగలు, ఒక రేడియో, వంటగది ఉపకరణాలు… ఆమెకు హెయిర్ డ్రైయర్ కనిపించింది.., ఆమె ఎంతో ప్రేమగా చూసుకున్న ఒకే ఒక చిన్న విలాస వస్తువు…, ఆమె వద్ద మిగిలి ఉన్న కొన్ని మంచి వస్తువులలో ఒకటి… ఆమె మిగతావన్నీ ఎప్పుడో అమ్మేసింది…
వారు ఆ డబ్బును పోస్ట్ ఆఫీస్‌కు తీసుకెళ్లారు, చేతివ్రాత ప్రతులను ప్యాకేజీ చేశారు – పద్దెనిమిది నెలల పని, సంవత్సరాల పేదరికాన్ని సూచించే ఆ 500 పేజీలు – పోస్టేజీకి డబ్బు చెల్లించి, తమ భవిష్యత్తు మొత్తాన్ని ఒక పోస్టల్ క్లర్క్‌కు అప్పగించారు… వారు తమ సర్వస్వాన్ని పందెం కట్టారు…
నూరు సంవత్సరాల ఏకాంతం జూన్ 1967లో ప్రచురించబడింది… కొన్ని వారాల్లోనే, అది ప్రపంచాన్ని కుదిపేసింది… మొదటి ఎడిషన్ వేగంగా అమ్ముడైంది…
తర్వాత రెండవది… మూడవది… డజన్ల కొద్దీ భాషల్లోకి అనువాదాలు… విమర్శకులు దానిని ఒక కళాఖండంగా పిలిచారు… బ్యూండీయాల గురించి, మకోండో గురించి, ఈ అద్భుతమైన, హృదయాన్ని కదిలించే, ఆశ్చర్యపరిచే పుస్తకం గురించి పాఠకులు మాట్లాడకుండా ఉండలేకపోయారు…
ఇది ఇప్పటివరకు 46 భాషల్లో 50 మిలియన్లకు పైగా కాపీలు అమ్ముడైంది… ప్రపంచవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలలో దీనిని బోధిస్తున్నారు… ఏ భాషలోనైనా రాసిన గొప్ప నవలలలో ఒకటిగా పరిగణించబడుతుంది…
1982లో, ప్రధానంగా ఈ పుస్తకం కారణంగానే, గేబ్రియల్ గార్సియా మార్క్వెజ్ సాహిత్యంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు… పేదరికం తక్షణమే ముగిసింది… వారు మెక్సికో సిటీలో ఒక అందమైన ఇంటిని కొన్నారు… ప్రపంచమంతా తిరిగారు… మళ్లీ డబ్బు గురించి ఎప్పుడూ చింతించలేదు…
తన జీవితాంతం, ప్రతి ఇంటర్వ్యూలో, అతను మెర్సిడెస్‌ను నూరు సంవత్సరాల ఏకాంతంకి “నిజమైన రచయిత్రి”గా అభివర్ణించాడు… దానిని రాయడానికి అనుమతించిన పరిస్థితులను ఆమె సృష్టించిందని అతను చెప్పాడు…
వారు 56 సంవత్సరాలు, అంటే 2014లో అతను మరణించే వరకు, వివాహ బంధంలో ఉన్నారు… మెర్సిడెస్ 2020లో 87 ఏళ్ల వయసులో మరణించింది…
ఎప్పుడో ఏమీ తెలియని టీనేజ్ వయస్సులో పుట్టిన హఠాత్ ప్రేమ… తరువాత పెళ్లి… అతని వెనుక బలంగా నిలబడిన ఆమె… ఆయన కలకు ఆమె నీళ్లు పోసింది, పెంచింది… అనుకూల పరిస్థితులు క్రియేట్ చేసింది… అడ్డంకులు రాకుండా అడ్డుగా నిలబడింది… ఫలితం… నోబెల్… అవును, రాసిన అతనికన్నా… ఆమే దానికి వాస్తవ రచయిత..!!
Share this Article