.
సరిగ్గా నెల క్రితం మనం చెప్పుకున్నాం కదా… కేసీఆర్ అరాచక పాలనలోని మరో ఘోర వైఫల్యం.., దాదాపు 18 వేల కోట్ల ప్రజాధన దుర్వినియోగాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తించిందని…! పరిపాలనలో అడుగడుగునా సాగిన అడ్డదిడ్డపు యవ్వారం ఇది…
ఒకసారి ఓ మాట గుర్తు చేసుకుందాం… కంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించే దశలో… ఇకపై రాష్ట్రంలో కంట్రాక్టు ఉద్యోగి గానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి గానీ కనిపించడని కేసీయార్ గంభీర ప్రకటన చేశాడు గతంలో… ఉత్తదే… అదెంత డొల్ల యవ్వారమో, కంట్రాక్టు ఉద్యోగులు కొనసాగడమే కాదు, వారి పేరిట ఎంతగా తెలంగాణ ప్రజల సొమ్ము దుర్వినియోగం పాలైందో చెప్పుకుంటే ఆశ్చర్యపడాలో, ఛీత్కరించాలో అర్థం కాదు…
Ads
- ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేశాడంటే..? రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగి వివరాలను క్రోడీకరించాలని ఆదేశించాడు… దాని పేరు IFMIS … అంటే ఇంటిగ్రేటెడ్ ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ అండ్ ఇన్‌ఫర్మేషన్… ఫుల్ టైమర్లు, పార్ట్ టైమర్లు, కంట్రాక్ట్ ఎంప్లాయీస్, ఔట్ సోర్సింగ్, గెస్ట్ కొలువులు, డెయిలీ వేజెస్, హవర్లీ బేసిస్… ఇలా ఎవరైనా సరే… ఆధార్ నంబర్, పీఎఫ్ నంబర్, ఈఎస్ఐ నంబర్ల ఆధారంగా సేకరించి, ప్రతి ఒక్కరికీ ఓ యూనిక్ ఐడెంటిటీ నంబర్ ఇస్తారు…
యూనివర్శిటీలు, స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలు… ప్రతి విభాగం నుంచి ఉద్యోగుల వివరాలను సేకరిస్తున్నారు… ఒక ఉద్యోగి వేర్వేరు శాఖల్లో, విభాగాల్లో పనిచేయకుండా గుర్తించడానికి కూడా వీలవుతుంది దీనివల్ల…
అసలు ఒక్కరూ కంట్రాక్టు ఎంప్లాయీ, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీ ఉండరు అన్నాడు కదా కేసీఆర్… అక్షరాలా నాలుగు లక్షల తొంభై మూడు వేల ఎనిమిది వందల ఇరవై మంది (4,93,820) ఉన్నారు… రికార్డుల్లో… జీతాల లెక్కల్లో…! వివరాలు సేకరించడానికి గత నెల 16 డెడ్ లైన్… కేవలం 2,74,844 మంది వివరాలే దొరికాయి… మరి మిగతా 2.18 లక్షల మంది ఎవరు..?
- తరువాత ఈ గడువు కాస్త పెంచారు… ఆధార్ సహా అన్ని వివరాలు ఇవ్వని ఏ ఉద్యోగికీ జీతం ఇవ్వవద్దని కఠిన ఆదేశాలు జారీ… జీతం గనుక ఇస్తే సంబంధిత అధికారిపై చర్యలు తప్పవనీ హెచ్చరించారు… దాంతో కదిలింది పెద్ద డొంక… ఇప్పటికి 3.75 లక్షల మంది ఉద్యోగుల వివరాలు వచ్చాయి… మరి మిగతా 1.25 లక్షల ఉద్యోగులు ఎక్కడ..?
బోగస్ ఉద్యోగులు… కాగితాలపైనే ఉద్యోగులు… వారి జీతాల పేరిట గత పదేళ్లలో కనీసం 15 వేల కోట్ల ప్రజాధనం హారతి కర్పూరం… ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు, ఉన్నతాధికారులు అందినకాడికి దండుకున్నారు… అక్షరాలా ఇది అరాచకం… బహుశా ఏ రాష్ట్రంలోనూ కనిపించని అడ్డగోలు పాలన వైఫల్యం…
ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్-1 అధికారుల వద్ద… హెచ్‌ఓడీలు, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కూడా పేర్లు రాసేసుకుని, కంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పేరిట జీతాలు మాత్రం చెల్లించేస్తున్నారట… కొందరు ఉన్నతాధికారుల బంధువులు కూడా…
మరో ఉదాహరణ ఏమిటంటే..? జీహెచ్ఎంసీలో 21 వేల మంది ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నట్టు లెక్క… కానీ ఫేస్ రికగ్నిషన్ సిస్టం తెచ్చాక 15 వేల మంది లెక్క తేలింది… 6 వేల మంది బోగస్..! ఇది నెల క్రితం లెక్క… అంతెందుకు, వీటన్నింటిపైనా దృష్టి పెట్టాల్సిన జీఏడీలో 1600 మంది తాత్కాలిక ఉద్యోగులున్నట్టు లెక్క చూపిస్తుండగా, నిజంగా పనిచేస్తున్నది 764 మంది మాత్రమే..!
- అసలు కథ ఇది కాదు… ఈ లక్ష బోగస్ ఉద్యోగులు కాదు… నిజంగా రికార్డుల్లో చూపిస్తున్న 3.75 లక్షల మంది ఉన్నారా..? పనిచేస్తున్నారా..? వివరాలు రాసేసి ఎవరు బొక్కుతున్నారు ఈ ధనం..? ఆ స్వాహాపర్వం తీవ్రత ఎంత..?
రేవంత్ రెడ్డి గనుక ఏసీబీ విచారణ, దర్యాప్తుకు ఆదేశిస్తే… ఎన్ని పందికొక్కులు బయటపడతాయో… కమాన్, పాలకా..? నిన్ను ముఖ్యమంత్రిని చేసిన ఈ తెలంగాణ ప్రజానీకానికి ఈ మేలు కాస్త చేసిపెట్టు..! కేసీయార్ పాలన తాలూకు ఏ విషయాన్ని తాకినా… అన్నీ తస్కిన మేడిగడ్డలే అని జాతికి చాటిచెప్పు..!!
Share this Article