Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నందమూరి కుటుంబసభ్యులకు వాహనగండం… తాజాగా మరొకటీ అదే…

February 11, 2023 by M S R

సీన్ వన్……. చాన్నాళ్ల క్రితమే ఓ జ్యోతిష్కుడు ఏదో మాట్లాడుతూ, మాటల సందర్భంలో ఓ మాట చెప్పాడు… ‘‘ఈ నందమూరి ఎన్టీయార్ కుటుంబానికి కారు ప్రమాదాల గండం బాగా ఉంది, అంటే వాహన గండం… వాళ్లు జాగ్రత్తగా ఉండటం మంచిది… ఐనా వాళ్లకు ఎవరు చెబుతారు లెండి…’’ అని నిష్ఠురమాడాడు… వాహనాలు లేకపోతే కదలికే లేని కాలం కదా, ఏం జాగ్రత్తగా ఉండాలి, కార్లు ఎక్కకుండా బతకడం ఎలా సాధ్యం అనుకుని నవ్వుకున్నాను…

సీన్ టు……. ఎన్టీయార్ కొడుకు, బాలకృష్ణ సోదరుడు నందమూరి రామకృష్ణ కారు ప్రమాదంలో గాయపడ్డాడు… లక్కీగా స్వల్ప గాయాలతో బయటపడ్డాడు… శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్ జూబిలీ హిల్స్ రోడ్ నంబర్ 10లో ఆయన స్వయంగా కారు నడిపిస్తున్నాడు… కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది… కారు ముందు భాగం దెబ్బతింది… ఆయన అక్కడే కారు వదిలేసి ఇంటికి వెళ్లిపోయాడు, ఎవరూ ఫిర్యాదు చేయలేదని కేసు నమోదు చేయలేదట పోలీసులు… మామూలు మనుషులతో వాళ్లంతటవాళ్లే కేసు పెట్టేవాళ్లు… అది వేరే కథ… (గతంలోనూ ఈయన భారీ కారు ప్రమాదానికి గురయ్యాడు…)

ఫ్లాష్ బ్యాక్ వన్….. ఈ నందమూరి రామకృష్ణ సోదరుడు మోహనకృష్ణ కొడుకు తారకరత్న గత నెల 27వ తేదీన గుండెపోటు రావడంతో అప్పటి నుంచి బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. పరిస్థితి ఏమాత్రం బాగాలేదు… అయితే దీనికీ కారు ప్రమాద దుర్ఘటనలకూ సంబంధం లేదు… సో, రెండో సీన్‌కు వెళ్దాం…

Ads

ఫ్లాష్ బ్యాక్ టు….. నందమూరి హరికృష్ణ అలియాస్ జూనియర్ ఎన్టీయార్ తండ్రి ఉరఫ్ కల్యాణరామ్ తండ్రి 2018, ఆగస్టు 29న నల్గొండ జిల్లా, అన్నెపర్తి జరిగిన కారు ప్రమాదంలో మరణించాడు… నందమూరి కుటుంబసభ్యుల కారు ప్రమాద గండం తనను బలిగొంది…

ఫ్లాష్ బ్యాక్ త్రి….. నందమూరి హరికృష్ణ పెద్ద కొడుకు నందమూరి జానకీరామ్ 2014, డిసెంబర్‌ 6వ తేదీన నల్గొండ జిల్లాలోనే కోదాడ వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు… వాహన గండల బలితీసుకున్న రెండు ప్రాణం…

ఫ్లాష్ బ్యాక్ ఫోర్… నందమూరి హరికృష్ణ కొడుకు జూనియర్ ఎన్టీఆర్‌ కూడా 2009లో ఖమ్మంలో తెలుగుదేశం ఎన్నికల ప్రచారం ముగించుకొని, కారులో హైదరాబాద్‌ తిరిగి వెళుతుండగా, కారు ప్రమాదం చోటుచేసుకుని, తను తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే… నిజానికి అది ఘోరమైన ప్రమాదమే, భవిష్యత్తులో ఏవో మంచి హోదాల్లోకి వెళ్లే అదృష్టం ఏదో కాపాడినట్టుంది… బయటపడ్డాడు…

సో, ఇవన్నీ నందమూరి కుటుంబానికి చెందిన వాళ్ల కారు ప్రమాదాలు, వాహన గండం ఆనవాళ్లు… తాజాగా రామకృష్ణ తాజా కారు ప్రమాదం కూడా ఈ జాబితాలో కలిపేయాలి… అబ్బే, ఈ జ్యోతిష్కుల మాటలు ఎవరు నమ్ముతారు, ఛస్, హంబగ్ అంటారా..? ఏమో మరి, వీళ్ల కారు ప్రమాదాలు మాత్రం ఈ తేలిక తోసివేతలకు భిన్నంగా కనిపిస్తున్నాయి..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఈ పిచ్చిది ఏదో చెబుతుంది… గుడ్డిగా ఫాలో అయ్యారో, బుక్కయిపోతారు…
  • సారీ-గమలు… మళ్లీ అదే పోకడ… అసలు తప్పేమిటో తెలియడాయె…!!
  • కాకులూ పగబడతాయ్… గుంపుకట్టి దాడిచేస్తయ్… ప్రతీకారం తీర్చుకుంటయ్…
  • ఆరోజున ఆ ముప్పు నుంచి లక్కీగా ఎలా తప్పించుకున్నామంటే..!!
  • విషాదమే… కానీ ఉన్మాదం… కర్నాటక సర్కారు ఘోర వైఫల్యం…
  • ఒక ఫోటో… కవితకు అసలు తెలియదో లేదో… గుర్తుందో లేదో ఫాఫం…
  • 500 రూపాయల నోట్ల చెలామణీపై వార్తలేమిటి..? నిజాలేమిటి…?
  • బాలీవుడ్ డింపుల్ క్వీన్… ప్రీతి మరో మొహం… 34 మంది పిల్లల తల్లి…
  • ఆ పాత్ర దెబ్బతినేసింది… ఫాఫం రాజేంద్ర ప్రసాద్ మెడ విరిగింది…
  • మాటే పాటైనవాడు. పాటే బాటైనవాడు. మనకు కర్ణామృతమైనవాడు

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions