.
మరో భార్యాబాధితుడి ఆత్మహత్య… అదీ భరణం, భార్య వేధింపుల బాపతే… ఈమధ్య రెండుమూడు కేసులు చదివాం కదా… ఏకంగా కోర్టుల న్యాయమూర్తులే విస్తుపోతున్నారు కదా భార్యలు పెట్టే కేసులు, అడిగే భరణాలను వింటూ, చూస్తూ…
గృహహింస, కట్నం వేధింపుల కేసులే కాదు… అడ్డగోలు భరణాల డిమాండ్లు… చాలామంది భర్తల్ని నరకయాతనకు గురిచేస్తున్నాయి… చట్టాలు దుర్వినియోగం అవుతున్నాయి… ఇది రియాలిటీ… ఇలాంటి కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది…
Ads
కర్నాటక… హుబ్బళిలో ఈ తాజా కేసు… ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి, పేరు పీటర్… భార్య పేరు పింకీ… ఈ బాధలు, ఆమె డిమాండ్లు తీర్చలేక, వేధింపులు తట్టుకోలేక ఇక జీవితం చాలించడమే బెటర్ అనుకుని, చాముండేశ్వరీనగర్లో తనువు చాలించాడు ఆత్మహత్యకు పాల్పడి…!
తండ్రికి ఓ లేఖ రాశాడు… అందులోనే మరణ వాంగ్మూలం… డెత్ నోట్… క్షమాపణలు కోరుతూ… ‘‘నాన్నా… క్షమించు నన్ను… పింకీ నన్ను చంపేస్తోంది… నా చావును కోరుకుంటోంది… తన టార్చర్ భరించలేకపోతున్నా… ఇక నువ్వే అమ్మానాన్నలను జాగ్రత్తగా చూసుకో అన్నా…’’ అని రాసుకొచ్చాడు…
పెళ్లయి రెండేళ్లు కూడా కాలేదు… 3 నెలలుగా గొడవలు ఎక్కువయ్యాయి… భార్య వేధింపులతో మెంటల్‌గా కూడా అప్సెట్ అయ్యాడు, యజమాని ఉద్యోగం నుంచి తొలగించాడు కూడా… భార్యాభర్తల నడుమ వాగ్వాదాలు, గొడవలు మరింత బాగా పెరిగాయి… విడాకులకు 20 లక్షలు అడుగుతోంది… ఆమెను కన్విన్స్ చేయలేక, పరిష్కారం ఏమిటో తెలియక, తన ఇంట్లోనే ఇక ఉరివేసుకున్నాడు…
ఇలాంటిదే కర్నాటకలోనే మరో కేసు… 39 ఏళ్ల క్యాబ్ డ్రైవర్ తను… పేరు మంజునాథ… స్వస్థలం తూముకూరు… ఆయనకు నయనరాజ్ అనే ఓ మేకప్ ఆర్టిస్టుతో పెళ్లయింది… ఇంట్లో గొడవలు… ఇద్దరికీ పడటం లేదు… విసిగిపోయి ఆమె రెండేళ్లుగా ఆయనతో విడిపోయి విడిగా బతుకుతోంది…
ఆమె కోర్టులో విడాకుల కేసు కూడా పెట్టింది… కానీ మంజునాథ విడాకులు వద్దు, నువ్వు చెప్పినట్టే వింటాను, ఎప్పటిలాగే కలిసి ఉందాం అంటూ ఆమె ఫ్లాట్ దగ్గరకు పదే పదే వెళ్తూ ఆమెను కోరుతున్నాడు… నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు…
ఆమె అడుగుతున్నంత డబ్బు ఇచ్చే సిట్యుయేషన్ లేదు తనకు… చివరకు విసిగిపోయి ఆమె ఫ్లాట్ బయట కిరోసిన్ పోసుకుని అంటించుకున్నాడు… మరణించాడు,.. ఇన్నాళ్లూ భార్యలే బాధితులు… ఇప్పుడు భర్తలు కూడా బాధితులే… కారణాలు అనేకం… డిబేటబుల్ టాపిక్..!! (ఫోటో కర్టెసీ :: ఇండియాటుడే)
Share this Article