Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మరో బాబా బయోపిక్ రుద్రయోగి! కానీ నిజచరిత్ర తెలియని మర్మయోగి!!

November 17, 2026 by M S R

.

దేశభక్తి, దైవభక్తి… ఇప్పుడు సినిమా పరిశ్రమలో ఈ రెండు అంశాల చుట్టూ కొత్త ట్రెండ్ నడుస్తోంది. ఒక దురందర్, ఒక రామాయణం, ఒక హనుమాన్ అంశ్… నిజ జీవిత గాథలు, ఆధ్యాత్మిక నేపథ్యాలు, పురాణ పురుషుల కథలకు ప్రేక్షకుల్లో ఆదరణ పెరుగుతోంది. నీమ్ కరోలి బాబా జీవితం ఆధారంగా వచ్చిన ‘హనుమాన్ అంశ్’ సంచలన విజయం సాధించడంతో ఈ తరహా సినిమాలపై మరింత ఆసక్తి పెరిగింది. ఇప్పుడు మరో బాబా జీవితం వెండితెరపైకి రాబోతోంది.

ప్రఖ్యాత సిద్ధమహాయోగిగా, వయసును జయించిన మార్మికుడిగా ప్రచారంలో ఉన్న దేవ్‌రహా బాబా జీవితం ఆధారంగా ‘రుద్రయోగి’ పేరుతో సినిమా రూపొందనుంది. రచయిత విక్రమ్ మిశ్ర రాసిన ‘మహాదేవ్ అంశ్’ పుస్తకం ఆధారంగా జాతీయ అవార్డు గ్రహీత రవిరాజ్ ముర్ము ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించారు.

Ads

దేవ్‌రహా బాబా గురించి ప్రచారంలో ఉన్న కథలు తక్కువేమీ కాదు. ఆయన వయసు 150 ఏళ్లకు పైనే ఉంటుందని కొందరి నమ్మకం. మరికొందరు 250 నుంచి 700 ఏళ్ల వరకు బతికాడని చెబుతారు. వెదురు మంచెపైనే నివాసం, పాదాలతో ఆశీర్వాదం, కేచరి ముద్రతో ఆకలిని జయించారనే కథనాలు.. ఇలా ఆయన చుట్టూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ప్రచారంలో ఉన్నాయి. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ వంటి రాజకీయ దిగ్గజాలు కూడా ఆయన దర్శనం చేసుకున్నారని చెబుతారు.

rudra yogi

అయితే ఇక్కడే ఒక చిక్కుంది. దేవ్‌రహా బాబా జన్మస్థలం ఏమిటి? పుట్టిన తేదీ ఎప్పుడు? ఆయన అసలు వయసెంత? సాధారణ జీవితాన్ని ఎప్పుడు వదిలి ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాడు? ఇలాంటి ప్రశ్నలకు కచ్చితమైన చారిత్రక ఆధారాలు పెద్దగా లేవు. ప్రచారంలో ఉన్న కథలు ఎక్కువ.. నిర్ధారిత సమాచారం తక్కువ. అలాంటప్పుడు సినిమా రూపకల్పనలో దర్శకుడు ఎంతవరకు వాస్తవానికి కట్టుబడి ఉంటాడు? ఎంతవరకు సృజనాత్మక స్వేచ్ఛ తీసుకుంటాడు? అన్నది ఆసక్తికరం.

నిజానికి ఒక బాబా జీవితంపై సినిమా తీయాలంటే ఆయన మహిమలు, భక్తుల అనుభవాలు, ప్రముఖుల దర్శనాలు చూపిస్తే సరిపోదు. ఆ జీవితంలో ఒక సంఘర్షణ ఉండాలి. ఒక ప్రయాణం ఉండాలి. ఎదురైన సవాళ్లు, పోరాటం, సమాజంతో సంబంధం, ఆయన ఆలోచనల్లోని ప్రత్యేకత.. వీటన్నింటికీ సినిమాటిక్ రూపం ఇవ్వాలి. లేకపోతే తెరపై ఒక మహాత్ముడి గొప్పతనాన్ని ఎంతసేపు చూపించినా ప్రేక్షకుడికి ఆసక్తి నిలవడం కష్టం.

బయోపిక్ అంటే జీవిత చరిత్రను తెరపై చదివించినట్లు ఉండకూడదు. ఆ వ్యక్తి జీవితంలోకి ప్రేక్షకుడిని తీసుకెళ్లాలి. ఆయనతో ప్రయాణం చేయించాలి. ఆయన ఎదుర్కొన్న పరిస్థితుల్లో ప్రేక్షకుడిని భాగస్వామిని చేయాలి.

‘హనుమాన్ అంశ్’ విజయం సాధించింది కాబట్టి మరో బాబా సినిమా కూడా అదే స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అనుకోవడానికి లేదు. ప్రతి వంటకానికి ఒకే రుచి కుదరదు కదా! దేవ్‌రహా బాబా జీవితం ఎంత మార్మికమైనదో, ‘రుద్రయోగి’ కథనం కూడా అంతే ఆసక్తికరంగా ఉంటుందా? లేక మహిమల ప్రదర్శనకే పరిమితమవుతుందా? చూడాలి.

బాబా గొప్పతనం ఒక ఎత్తయితే.. ఆ గొప్పతనాన్ని గొప్ప సినిమాగా మలచడం మరో ఎత్తు. ఈ రెండింటి మధ్య తేడా గుర్తించినప్పుడే ‘రుద్రయోగి’ నిజంగా ప్రేక్షకులను మెప్పించగలదు!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మరో బాబా బయోపిక్ రుద్రయోగి! కానీ నిజచరిత్ర తెలియని మర్మయోగి!!
  • తెలుగు సీఎస్‌లు ఏం చేయగలరు పాపం..? శబరిమలలో బట్టల పంచాయితీ!
  • సాయి పల్లవిని టార్గెట్ చేసేందుకే ‘మాండవి’ని పైకి లేపారు !!
  • 007 కథ ముగిసిపోలేదు – అదుగో కొత్త జేమ్స్ బాండ్ వస్తున్నాడు…
  • మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక భేటీలు!- సుప్రియా సూలేకు పగ్గాలు?
  • రామోజీ స్మరణ సరే… కానీ ఎవరి జయంతి రాష్ట్ర ఉత్సవం కావాలి..? కొలమానాలేమిటి..?
  • బన్నీ రికార్డు బద్దలు… ఓ తెలంగాణ ఫోక్ సాంగ్ సంచలనం!
  • మరో రంగంలో సైబర్ చిక్కులు- అన్నీ వరుసగా… ఏం జరుగుతోంది?
  • బామ్మా అన్నపూర్ణమ్మా… ఏమిటమ్మా ఇది..? ప్చ్, బాగోలేదు సుమీ!!
  • ఎంగిలి వార్తలకూ ఓ పద్ధతి ఉంటుంది డియర్ కేసీయార్ సర్..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions