మరో పాన్ ఇండియా సినిమా బర్‌బాద్ అయిపోయింది… 400 కోట్ల భారీ బడ్జెట్‌తో తీసిన బ్రహ్మాస్త్ర దారుణమైన నెగెటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది… (చాలా తక్కువ బడ్జెట్‌తో తీసిన తెలుగు సినిమా ఒకేఒక జీవితం సక్సెస్ టాక్ పొందింది… బింబిసార, సీతారామం, కార్తికేయ సినిమాలకు ఇది అదనంగా జతచేరింది…) ఏతావాతా దేశం మొత్తమ్మీద ఇండియన్ సినిమాకు మరో భారీ గుణపాఠం ఏమిటంటే… భారీ హైప్, అత్యంత ఎక్కువ బడ్జెట్, గ్రాపిక్ హంగులు, భారీ తారాగణం మాత్రమే సినిమాను బతికించలేదు అని..!
సౌతిండియా రైట్స్ తీసుకుని, సినిమా వ్యాపారిగా మారిన దర్శకుడు రాజమౌళికి మింగుడుపడని చేదు నిజం ఏమిటంటే… బ్రహ్మాస్త్ర కాస్తో కూస్తో హిందీలో నడిచే అవకాశముంది… కానీ సౌతిండియాలో డిజాస్టర్… దానికి కారణాలు బోలెడు… మళ్లీ ఆ చర్చలోకి పోవడం లేదు కానీ రాజమౌళిని అచ్చంగా నేల మీదకు దింపింది సినిమా… దేశవ్యాప్తంగా విశ్వసనీయత ఉన్న రివ్యూయర్లు సినిమా పట్ల పెదవి విరిచి, నెగెటివ్ రివ్యూలు రాయడంతో ఆ దెబ్బ ఏకంగా స్టాక్ మార్కెట్ మీద కూడా పడింది… నిజం…
ఈ సినిమాకు ప్రధాన ఆర్థిక వనరు డిస్నీ హాట్‌స్టార్… దానికితోడు ప్రధానంగా పీవీఆర్, ఐనాక్స్ సినిమాల నెట్‌వర్క్ దారుణంగా భంగపడింది… ఈ సినిమా మీద ఆశలే గ్రాఫిక్స్, త్రీడీ మీద… అవి తప్ప సినిమాలో ఇంకేమీ కనెక్టింగ్ అంశాలు లేకపోవడంతో రివ్యూయర్లు కడిగి పారేశారు… వాటి ప్రభావం వెంటనే ఆ రెండు గ్రూపుల షేర్లపై నెెగెటివ్‌గా పడింది… ఎంత అంటే, వాటి బాధ్యులే ఆశ్చర్యపడేలా…
Ads
మరీ దొబారా, ధాకడ్, రక్షాబంధన్, లాల్‌సింగ్ అంత దారుణంగా కాకపోయినా బ్రహ్మాస్త్ర ఫలితం పెద్దగా ఆశాజనకంగా లేదు… 400 కోట్లు ఖర్చు పెట్టాం అని నిర్మాతలు చెబుతున్నారు కదా… గరిష్ఠంగా 130 నుంచి 200 కోట్ల వసూళ్లు దాటకపోవచ్చునని తాజా అంచనా… ఈ దెబ్బకు ఓటీటీ ప్లాట్‌ఫారాలు కూడా భారీగా ఆఫర్ చేసే పరిస్థితి లేకుండా పోయింది… ఇది మరో దెబ్బ…
ఐనాక్స్ కూడా అంతే… ఆగస్టు మొదటి వారంలో ఏకంగా 522 దాకా ఎగబాకిన ఈ షేర్ ధర ఈరోజు నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో 490 కు చేరుకుంది… పీవీఆర్, ఐనాక్స్ సేమ్ ట్రెండ్…
ఎవరు నిర్మించారు, ఎవరెంత డబ్బు పెట్టారు అనే వివరాల జోలికి అవసరం లేదు గానీ, సౌతిండియా ప్రేక్షకులకు అస్సలు కనెక్ట్ కాని కారణంగా రాజమౌళికి చేతులు కాలిపోబోతున్నయ్… అసలు ఆర్ఆర్ఆర్ లెక్కల మీదే చాలామందికి అనుమానాలున్నయ్… ఇప్పుడు బ్రహ్మాస్త్ర రాజమౌళిని తీవ్రంగా నిరాశపరుస్తున్నది… అఫ్‌కోర్స్, రాజమౌళి చేసిందే తప్పు…
Share this Article