.
నిజానికి ఈ ఇష్యూలో నయనతార కాన్సెప్టుపరంగా చేసిన పెద్ద తప్పేమీ కనిపించదు… తన సినిమా కెరీర్ మీద ఏదో డాక్యుమెంటరీ చేయించింది… ఎవరో ఓ బకరా ఓటీటీ దొరికాడు… అడ్డగోలు రేట్లకు అమ్ముకుంది… సినిమా తారలు ఏ విషయాన్నీ వదలరు కదా సంపాదన కోణంలో… తప్పు కూడా కాదు…
ఒకటి నిజం… అప్పటిదాకా అత్యంత సన్నిహితంగా ఉన్న సినిమా సెలబ్రిటీలు కూడా డబ్బు విషయానికి వచ్చేసరికి… తెల్లారేసరికి బద్ధ శత్రువులవుతారు… ఇక్కడ డబ్బొక్కటే శాసిస్తుంది… నయనతార అయితేనేం… ఇళయరాజా అయితేనేం…
Ads
అవును… ఇళయరాజా అనగానే గుర్తొచ్చింది… అసలు తమిళ ఇండస్ట్రీలో తాజా పెంట పంచాయితీలన్నింటికీ ఇళయరాజే కారణమేమో… నిర్మాతలు డబ్బులు పెట్టి, రిస్క్ తీసుకున్న పాటలకు క్రియేటివ్ రైట్స్ అంటూ రాయల్టీ మీద పంచాయితీలు పెట్టడం స్టార్ట్ చేసింది ఇళయరాజే…
తన ఆత్మబంధువు అని చెప్పుకుంటూనే ఎస్పీ బాలును జుత్తు మొత్తం పీకాడు రాయల్టీ పేరిట… వాడెవడో పాపం, చిన్న చరణం, అదీ మ్యూజిక్ లేకుండా, ఓ సినిమాలో నలుగురు యువకులు ఓ పాటలా పాడుతున్నారని, ఆ నిర్మాతను బజారుకీడ్చి, కోట్లు కక్కించాడు ఇళయరాజా… సరే, తన కక్కుర్తి బాగోతాలు ఇక్కడ రాస్తే సరిపోదు గానీ…
ధనుష్ అందుకున్నాడు… తనూ పెద్ద ముదురు టెంకే కదా… నయనతార తన సెల్ఫ్ డాక్యుమెంటరీ (బియాండ్ ది ఫెయిరీ టేల్) కి కోట్లు కొట్టేస్తోంది కదా,.,. అని ఈర్ష్య పడి, తన సినిమా క్లిప్స్ (నిజానికి షూటింగ్ సీన్స్) తన డాక్యుమెంటరీలో వాడుకున్నది అంటూ కోర్టుకెక్కాడు… అదో పెంట పంచాయితీ… అదయిపోయిందో లేదో మరొకడు అందుకున్నాడు…
చంద్రముఖి కాపీ రైట్స్ పొందిన సంస్థ పేరు ఏబీ ఇంటర్నేషనల్… తాజాగా అది మద్రాస్ కోర్టుకెక్కింది… తన డాక్యుమెంటరీలో నయనతార చంద్రముఖిలోనే కొన్ని సన్నివేశాలు ఉపయోగించింది కాబట్టి జస్ట్, ఓ 5 కోట్లు ఇస్తే సర్దుకుంటామని చెప్పింది… కోర్టు కూడా ఆ డాక్యుమెంటరీ నిర్మించిన డార్క్ స్టూడియోకి, నెట్‌ఫ్లెక్స్‌కీ నోటీసులు జారీ చేసింది…
ఇదేదో బాగుంది కదా అనుకుని సదరు డాక్యుమెంటరీలో ఆమె ఏయే సీన్స్ తన చిత్రాల నుంచి వాడుకుందో, ఇక ఆ చిత్రాల నిర్మాతలు కూడా కోర్టుకెక్కిితే నయనతార మరిన్ని తలనొప్పులు తప్పవు… ఆ డార్క్ స్టూడియో ఓనర్లు నయనతార, తన భర్త విఘ్నేష్‌లే కాబట్టి..!!
కానీ చంద్రముఖి నిర్మాతలు NOC ఇచ్చారని, డబ్బు ఏమీ తీసుకోలేదని నయనతార టీమ్ చెబుతోంది…
Share this Article