అవి రాజకీయ పార్టీలు… వాళ్లు రాజకీయ నాయకులు… ప్రస్తుతం ఎవడికీ నైతికత లేదు కాబట్టి… అటూఇటూ జంపుతున్నారు… డబ్బులు, ఇతర ప్రలోభాలు మాత్రమే ప్రభావం చూపిస్తున్నాయి… క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి… ఈ బేరాల్లో బీజేపీ ప్రస్తుతం దిట్ట… అత్యంత సుస్థిరంగా కనిపించే ప్రభుత్వం కాస్తా తెల్లారేసరికి కుప్పకూలిపోతుంది… దటీజ్ పవర్ ఆఫ్ బీజేపీ నవ్… కానీ…
కొన్ని పరిణామాలు, కొన్ని ప్రయత్నాలు, కొన్ని ప్రలోభాలు జనం దృష్టికి వచ్చేస్తుంటయ్… దానికి ఆయా పార్టీలు, నేతలు చెప్పుకునే సాకులు మాత్రం నవ్వు తెప్పిస్తుంటయ్… ఉదాహరణకు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ సంగతే తీసుకుందాం… మహరాష్ట్ర కాంగ్రెస్‌లో మంచి పలుకుబడి ఉన్న లీడర్… ఆదర్శ్ హౌజింగ్ సొసైటీ స్కాం వంటి యవ్వారాలు బోలెడు ఉండవచ్చుగాక… ఇప్పటికీ ఆ రాష్ట్ర కాంగ్రెస్‌లో ఓ బలమైన సెక్షన్ తనది…
మొన్న హఠాత్తుగా ఆశిష్ కులకర్ణి అనే అధికారి ఇంట్లో ప్రత్యక్షమయ్యాడు… ఆయన ఎవరూ అంటే… ప్రస్తుత మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన చీలిక అధినేత ఏకనాథ్ షిండేకు ఓఎస్డీ… కీలకమైన పోస్టే… ఇప్పుడు శివసేన చీలిక వర్గం ప్లస్ బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, రాష్ట్రాన్ని అర్జెంటుగా బాగా ఉద్దరించే పనిలో పడ్డాయి కదా, మరి షిండే ఓఎస్డీ ఇంట్లో ఈ చవాన్‌కు ఏం పని..?
Ads
అక్కడ మరో మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ లీడర్ దేవేంద్ర ఫడ్నవీస్‌తో కలిసి ఆంతరంగిక చర్చలు జరిపాడు… అదీ సంగతి… తమ రహస్య కలయికకు, మంతనాలకు ఏకంగా షిండే ఓఎస్డీ నివాసాన్నే ఎంచుకున్నారు… మీడియా కంటబడింది… చవాన్ సార్, ఏమిటీ కథ… జంపా..? అనడిగారు ఎవరో… నో, నో, ఓఎస్డీ ఇంట్లో గణేష్ ఉత్సవాల కోసం వచ్చాను, సరిగ్గా ఆ సమయానికి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా అక్కడే ఉన్నాడు… ఏదో మర్యాదపూర్వక పలకరింపు, అంతేతప్ప నేను బీజేపీలో చేరడం వంటి వార్తలన్నీ జస్ట్ రూమర్లు మాత్రమే అని చవాన్ ఏదేదో చెప్పుకొస్తున్నాడు… ఇదే కాదు…
అంతేకాదు, ఆమధ్య ఎమ్మెల్సీ ఎన్నికల్లో చవాన్ ఆధ్వర్యంలోనే పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగుకు పాల్పడ్డారట… ఆమధ్య అసెంబ్లీలో షిండే బలపరీక్ష జరిగినప్పుడు 11 మంది ఎమ్మెల్యేలు హాజరే కాలేదు… వాళ్లంతా చవాన్ వర్గమే… అదేమిటయ్యా, బీజేపీలోకి వెళ్తున్నారా, కీలకమైన బలపరీక్షకు గైర్హాజరయ్యారు అనడిగితే ముంబై ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది, అందుకే సమయానికి హాజరు కాలేకపోయాం అని సమాధానాలు ఇచ్చారు వాళ్లు…
సో, అశోక్ చవాన్ గోడ మీద కూర్చుని రెడీగా ఉన్నాడు, తనతో ఎందరు ఎమ్మెల్యేలు ఉన్నారో తేలాల్సి ఉంది… ‘‘వెయిట్ అండ్ వాచ్’’ అంటోంది బీజేపీ… మహారాష్ట్రలో ఎన్సీపీని, కాంగ్రెస్‌ను, వాళ్లతో జతచేరిన ఉద్దవ్ ఠాక్రేను బీజేపీ టార్గెట్ చేయడంలో ఆశ్చర్యం ఏముంది..? బీజేపీకి తెలిసిన విద్య ఎదుటి పార్టీ నుంచి లీడర్లను లాగేయడం… మహారాష్ట్రలో చేస్తున్నదీ అదే… ఎలాగూ కాంగ్రెస్‌కు నాయకత్వలోపం ఉంది, చవాన్ వంటి నేతలు సొంత దారులు వెతుక్కోవడంలో కూడా ఆశ్చర్యం లేదు…!!
Share this Article