ఏ చిత్రసీమయినా సరే వివాదాలు లేకుండా ఎలా ఉంటుంది..? యాక్చువల్‌గా ఏ రంగమూ భిన్నం కాదు… కానీ ఈమధ్య కొన్నాళ్లుగా కన్నడ చిత్రసీమలో అక్రమబంధాలు వివాదాలు మరీ ఎక్కువయిపోయాయి… మొదట ఒక పవిత్రా లోకేష్, సీనియర్ నరేష్‌ల సహజీవన ప్రేమ బంధం… నరేష్ భార్య రచ్చ రచ్చ చేసింది… ఆ తగాదా ఇంకా తెగనే లేదు…
తరువాత మరొకామె… పవిత్ర జయరాం… టీవీ సీరియల్ నటి కమ్ సినిమా నటి… రోడ్డు ప్రమాదంలో మరణించింది… ఆమె కూడా కొన్నాళ్లుగా చంద్రకాంత్ అలియాస్ చందుతో సహజీవనంలో ఉంది… చందుకు ఆల్రెడీ పెళ్లయింది… పవిత్ర మరణాన్ని తట్టుకోలేక చందు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు…
ఇంకొకామె… హీరో దర్శన్… మరో సినిమా నటి పవిత్ర గౌడ… దర్శన్‌కు ఆల్రెడీ పెళ్లయింది… ఈ పవిత్ర గౌడతో సంబంధం… నడుమ రేణుకాస్వామి అనేవాడు ఆమెను వేధిస్తున్నాడనే కోపంతో దర్శన్ అండ్ మిత్రబృందం రేణుకాస్వామిని హతమార్చారని కేసు… ఇప్పటికి 19 మందిని అరెస్టు చేశారు… రేణుకాస్వామి భార్య, దర్శన్ భార్య లబోదిబో… (పవిత్ర గౌడకు అంతకుముందు సంజయ్ సింగ్‌తో పెళ్లయి, ఖుషీ గౌడ అనే కూతురు కూడా ఉంది)…
Ads
తాజాగా మరో కేసు… కాకపోతే ఈ కథలో పవిత్ర అనే పేరు లేదు… జస్ట్, మరో అపవిత్రమైన కథ… కాంతారా సినిమా తెలుసు కదా, సూపర్ బంపర్ హిట్… అందులో హీరోయిన్ పేరు సప్తమి గౌడ… ఆమె తాజాగా కోర్టుకెక్కింది… ఎందుకంటే..? హీరో కమ్ సింగర్ కమ్ నిర్మాత యువ రాజకుమార్‌కూ ఆమెకు సంబంధముందని ఆయన భార్య శ్రీదేవి భైరప్ప ఆరోపిస్తోంది…
ఈ యువ రాజకుమార్ ఎవరో తెలుసా..? ది గ్రేట్ లెజెండ్ కన్నడ హీరో రాజకుమార్ మనమడు… రాఘవేంద్ర రాజకుమార్ కొడుకు… ఇప్పుడు శ్రీదేవి భైరప్ప, యువ రాజకుమార్ విడాకుల కేసు కోర్టులో ఉంది… విడాకులకు కారణం తన భర్తకు సప్తమి గౌడతో అక్రమ సంబంధం ఉందని శ్రీదేవి ఆరోపణ… పదే పదే బయట కూడా అదే ఆరోపిస్తోంది… ఈ తప్పుడు కూతలతో తన పరువుకు నష్టం వాటిల్లుతుందని సప్తమి గౌడ కోర్టుకెక్కింది…
ఇలాంటి ఆరోపణలు చేయకుండా సంయమనం పాటించాలని కోర్టు ఆర్డర్ పాస్ చేసింది… ఐనా సరే శ్రీదేవి వినిపించుకోవడం లేదు… దీంతో ఇక తప్పనిసరై సప్తమి గౌడ ఏకంగా శ్రీదేవి మీద పరువు నష్టం కేసు పెడుతోంది… 10 కోట్ల పరిహారం చెల్లించాలని, బహిరంగ క్షమాపణ చెప్పాలనేది కేసు… వివాదం పెద్దది కావొద్దనే భావనతో నేను మౌనంగా ఉంటున్నా సరే, నన్ను మరీ బజారుకీడుస్తున్నందున ఇక లీగల్‌గా ప్రొసీడ్ కావల్సి వస్తోందని సప్తమి గౌడ సమర్థన…
ఈ సప్తమి, శ్రీదేవి వివాదంతో ఆ దర్శన్, పవిత్ర గౌడ వివాదం కాస్త దృష్టి మళ్లుతోంంది… మరో సప్తమో, అష్టమో, నవమో ఇష్యూ తెర మీదకు వచ్చేదాకా కొన్నాళ్లు ఈ శ్రీదేవి పంచాయితీ నడుస్తూ ఉంటుందన్నమాట..!!
Share this Article