సినిమాలకు సంబంధించిన బేసిక్ సూత్రం ఒకటే… కొత్త ఆసక్తికర విషయం చెప్పాలి లేదా తెలిసిన విషయాన్నే ఆసక్తికరంగా చెప్పాలి… ఓ నాసిరకం చెత్త కంటెంటును జనం ఆమోదించేలా చేయడం రాజమౌళికి తెలుసు… కానీ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న హిందూ పురాణాలకు లింకై ఉన్న కంటెంటు ఉండీ అక్షయ్ కుమార్ ఓ చెత్త సినిమాను జనం మీదకు వదిలాడు…
నిజానికి చెత్త సినిమా అనే స్ట్రెయిట్ వ్యాఖ్య సరికాదు… రామసేతు సినిమా కమర్షియల్‌గా వర్కవుట్ అవుతుందని అనుకున్నారు, దాంట్లో రీజనింగ్ ఉంది… బ్రహ్మాస్త్ర, కార్తికేయ, కాంతార ఎట్సెట్రా అన్నీ అవే కదా… జనంలో రామసేతు మీద ఆసక్తి ఉంది… అదిప్పుడు కోర్టులో కూడా ఉంది… సో, సబ్‌జుడీస్ గాకుండా, జాగ్రత్తగా స్క్రిప్టు రాసుకున్నారు… చాలా విలువైన అంశాల్ని సేకరించారు… కాకపోతే ఓ లైన్ లోపించింది… ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే లోపించింది…
దర్శకుడు ఏదో ఒక వైపు ఉండాలి, మధ్యలో మారితే బలమైన రీజన్ చెప్పాలి… అక్షయ్ కుమార్ పురావస్తు శాస్త్రవేత్త… సేతుసముద్రం ప్రాజెక్టు కట్టాలనే ప్రతిపాదన వచ్చినప్పుడు అసలు అది మానవ నిర్మితమా..? సహజంగా ఏర్పడిందా..? చెప్పే బాధ్యతను అక్షయ్‌కు అప్పగిస్తారు… ఇక్కడ ఓ ఫ్యాక్ట్ ఏమిటంటే..? రామసేతు ఓ వాస్తవం… అది మనిషి కట్టిందా..? కాదా అనేది వివాదాంశం… ఎందుకంటే రావణుడి మీద సమరానికి వెళ్లడానికి రాముడు కట్టించిన వంతెన అని నమ్మే కోట్లాదిమంది హిందువుల మనోభావాలతో లింకై ఉంది…
Ads
డీఎంకే కరుణానిధి హార్డ్‌కోర్ హిందూ వ్యతిరేకి… నాస్తికుడు… అసలు రామాయణమే అబ్జర్డ్, రాముడేమైనా ఇంజనీరా..? ఎక్కడ చదివాడు..? అని వెక్కిరించాడు… డబ్బులు కావాలి… అందుకే సేతుసముద్రం ప్రాజెక్టును మోశాడు… కేంద్రంలో ఉన్న బలహీన ప్రభుత్వం ఊగిసలాట… ఈ సినిమాలో హీరో కూడా ముందుగా కరుణానిధిలాగే మాట్లాడతాడు… అదే రిపోర్ట్ ఇస్తాడు… కానీ ప్రభుత్వానికి నచ్చదు, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది… ప్రభుత్వ ఆయన్ని సస్పెండ్ చేస్తుంది… దాంతో అసలు నిజం ఏమిటో కనిపెట్టడానికి బయల్దేరతాడు… హీరో కదా…
అది మానవ నిర్మాతమే అనే లైన్ తీసుకుంటాడు దర్శకుడు… పోనీ, అదైనా బలంగా చెప్పగలిగాడా అంటే అదీ లేదు… పూర్ గ్రాఫిక్స్… ఆకట్టుకోని కథనం… అసలు ఇన్నాళ్లు ఫీల్డులో ఎలా ఉన్నాడు అనిపించేలా అక్షయ్ నటన… ఆ పాటలొక దరిద్రం… పైగా సబ్‌మెరైన్లు ఎట్సెట్రా ఎట్సెట్రా… నిజానికి బోలెడు రీసెర్చులు జరిగాయి… సేతుసముద్రం ప్రాజెక్టుకు మంచి ప్రత్యామ్నాయాలు కూడా రెడీ అయ్యాయి… ఇప్పటికీ డీఎంకే మాజీ మంత్రి, టూజీ స్కామ్ నిందితుడు రాజా దీనిపై ఢిల్లీ- చెన్నై చక్కర్లు కొడుతుంటాడు ఫైళ్లు మోసుకుంటూ…!
ఇవన్నీ చెబుతూ పోతే అది డాక్యుమెంటరీ, యూట్యూబ్ స్టోరీ… కానీ ఓ ఆసక్తికరమైన కథలో ఇరికిస్తే అదీ సినిమా… కావల్సినంత క్రియేటివ్ ఫ్రీడం తీసుకోవచ్చు… ప్చ్, వేలు పెట్టి వారం చెడగొట్టినట్టు అక్షయ్ కుమార్ ఈ కథను చెడగొట్టాడు, మళ్లీ ఎవడూ ఎఫర్ట్ పెట్టకుండా…! దర్శకుడు అభిషేక్ శర్మ ఓ కమర్షియల్ సబ్జెక్టును ధ్వంసం చేశాడు… ఇదే కథ ఏ రాజమౌళి చేతిలోనే పడి ఉంటే 1000 కోట్ల సినిమా… నిజానికి కొన్నాళ్లుగా ప్రతి అక్షయ్ సినిమా అట్టర్ ఫ్లాప్… అది థియేటరైనా అంతే, ఓటీటీ అయినా అంతే… తాజాగా మరొకటి… ఎటొచ్చీ తెలుగులోనూ రిలీజ్ చేశాడు కాబట్టి మనం మాట్లాడుకోవడం… లేకపోతే అదీ అవసరం లేదు…!!
Share this Article