Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మోది చావబాదాల్సిందే..! నెత్తురు పారాల్సిందే..! బుర్రలు పగలాల్సిందే..!!

June 24, 2021 by M S R

నిజానికి ట్రెయిలర్లు, టీజర్లు, పోస్టర్లు, వెబ్ వార్తలు చూసి ఏదైనా సినిమాపై ఒక నిశ్చితమైన అభిప్రాయానికి రావడం కరెక్టు కాదు… కానీ అది అన్నిసార్లూ కాదు… ఇదుగో ఇలాంటివి చూసినప్పుడు ఆ సినిమా పోకడ ఏమిటో అంచనా వచ్చేస్తుంది… అంతేకాదు, సదరు సినిమా నేపథ్యం కూడా ఖచ్చితంగా చర్చకు వస్తుంది… హీరో కృష్ణ మనమడు, మహేష్ బాబు మేనల్లుడు, గల్లా జయదేవ్ కొడుకు అశోకుడి తెరంగేట్రానికి సంబంధించిన ట్రెయిలర్ అది… అందులో హీరో జోకర్ వేషంతో నవ్వుతూ కనిపిస్తాడు ఓచోట… ఈ వీడియో బిట్ చూశాక చాలామంది ఇలాగే నవ్వుకున్నారు… మూతీముక్కూ సక్కగా లేకపోయినా, మొహంలో ఏ భావప్రకటన చేతకాకపోయినా హీరోలుగా వెలుగొందుతున్న వారసరత్నాల్ని చాలామందిని చూశాం, భరిస్తూనే ఉన్నాం… అలాంటిది మరో వారసవజ్రం దూసుకొస్తుంటే మనకెందుకు భయం..? చూద్దాం…

galla

నవ్వెందుకు వచ్చిందంటే..? బోలెడంత సంపద, ఇండస్ట్రీలో నిర్మాతో, దర్శకుడో, హీరో లేక బాగా పాపులారిటీ సంపాదించిన ఇంకెవరో… వాళ్ల కొడుకులు, కూతుళ్లు అదే ఇండస్ట్రీలో అవకాశాలు వెతుక్కోవడాన్ని ఒకరకంగా అర్థం చేసుకోవచ్చు… తమ తండ్రులు లేదా తల్లుల ఇన్‌ఫ్లుయెన్స్ వాళ్లకు ఉపయోగపడుతుంది… మెరిట్ ఉంటే నిలదొక్కుకుంటారు లేకపోతే ప్రవాహంలో పడి కొట్టుకుపోతారు… కానీ రాజకీయ ప్రముఖుల పిల్లలకు ఈ పిచ్చి ఏమిటో అర్థం కాదు… దేవెగౌడ మనమడు నిఖిల్, స్టాలిన్ కొడుకు ఉదయనిధి దగ్గర నుంచి ఇదుగో ఈ గల్లా అశోకుడి దాకా… బోలెడంత డబ్బుకుతోడు సినిమా, పొలిటికల్ బ్యాక్‌ గ్రౌండ్… ఇంకేం కావాలి..? ఇప్పుడున్నవాళ్లతో పోలిస్తే మాకేం తక్కువ..? ఇదేనా వీళ్ల భావన..? ఎలాగూ పాలిటిక్స్ విడిచిపెట్టరు, ఈ ఇండస్ట్రీని వదిలిపెట్టరు… డబుల్ పాపులారిటీ ప్లస్ ఇండస్ట్రీని, ఫేమ్‌ను ఎంజాయ్ చేయడం… కళ, క్రియేటివిటీ, తపన, ప్రయాస ఇవన్నీ బోగస్ పదాలు… డబ్బు పడేస్తే చాలు, ప్రజల బుర్రల్లోకి ఎక్కించడమే… ప్రేక్షకులు భరించడం లేదా ఏం..? తినగతినగ వేము తరహాలో ‘‘స్వీట్‌నెస్’’ చప్పట్లు కొట్టించడం లేదా..?

Ads

galla hero

ఇంకా నవ్వొచ్చేది ఏమిటంటే..? హీరో లాంచ్ అనగానే… సూపర్ మాస్ లుక్కుతో రావాలనే ఓ పడికట్టు భావజాలం… ఇంకా ఏ లోకంలో ఉన్నారు స్వామీ..? మరీ దక్షిణాది హీరో అనగానే చిత్రవిచిత్రమైన ఆయుధాలతో వందల మందిని కసకసా నరికేయాలి, బాదేయాలి, మోదాలి, రక్తాలతో తెర ఎర్రబారాలి… దంచుడు సూత్రమే… ఇది చూడండి, పెద్ద గన్ను పట్టుకున్నాడు… గన్ను అంటే తుపాకీ కాదు, పెద్ద సుత్తి… ఇనుప సామాను తయారీకి వాడతాం కదా, అది… ఇక అది పట్టుకుని ఎందరిని చావగొడతాడో ఈ కొత్త సారు..? స్టారు…!! తెర చూసే ప్రేక్షకులు, తెర మీద విలన్లు..! ఇది చాలదు అన్నట్టు అసలు గన్ను ఉండనే ఉంది… కౌబాయ్ వేషం ఉంది… ఏమో, ఇదీ సరిపోదేమో అనుకుని కాస్త క్లాసిక్ టచ్ కోసం సర్కస్ జోకర్ వేషం ఉంది… అది బెటర్… ఏ ఫీలింగ్సూ పలకకపోయినా కవర్ చేసేస్తుంది… భలే అవుడియా… రా అశోకుడా, వచ్చెయ్… నిధి అగర్వాల్ కూడా ఉందిగా… అవునూ, టీజర్ రిలీజై ఇంతసేపైంది… ఇన్ని లక్షల వ్యూస్, లైక్స్ అంటూ ధూంధాం పోస్టులు స్టార్ట్ కాలేదా..?!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…
  • విశాఖ గ్యాస్ లీక్‌కు ఐదేళ్లు… ఒక్క జర్నలిస్టయినా ఫాలోఅప్ చేశాడా..?!
  • Dekh Thamaashaa Dekh… ఓ కోర్టు కేసు విచారణపై ఫన్నీ ప్రజెంటేషన్…
  • పాపం ఉండవల్లి, ఎంత లాజిక్స్ మాట్లాడేవాడు, ఎలా అయిపోయాడు..?
  • కథ ప్రజెంట్ చేసే దమ్ముండాలే గానీ… పనిమనిషి కూడా కథానాయికే…
  • పర్లేదు, వితండవీరులు కూడా చదవొచ్చు ఈ కథను… కథ కాదు, చరిత్రే…
  • ఒక పనిమనిషి మరణిస్తే ఇంత దయా..?! ఇప్పటికీ వెంటాడే ఆశ్చర్యం..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions