ఎనభయ్యేళ్లు దగ్గరపడిన బొడ్డు రాఘవేంద్రరావు పక్కన నటించడానికి తారలెవరూ ముందుకు రావడం లేదు… తను ఎందరో తారలకు లైఫ్ ఇచ్చినా సరే, తన లైఫ్‌లో మొదటిసారి నటిస్తుంటే ఎవరూ రెడీ అనడం లేదు… పాపం, తనికెళ్ల భరణి నానా తిప్పలూ పడుతున్నాడు…
ఇవ్వాళారేపు పెళ్లికి అమ్మాయిలను మెప్పించడం ఎంత కష్టమో తెలుసు కదా… సేమ్, హీరోయిన్లను ఒక సినిమాకు ఒప్పించడం కూడా అంతే… పెద్ద పెద్ద హీరోలనే ఫోఫోవోయ్ అనేస్తున్నారు… ఈ సిట్యుయేషన్లో ఈ సినిమాకు మాత్రం మేం రెడీ అంటే మేం రెడీ అని హీరోయిన్లు ఒకే చెప్పేస్తున్నారు… విశేషమే…
Ads
ఆ సినిమా పేరు విరాటపర్వం… దగ్గుబాటి రానా లీడ్ రోల్… నీదీనాదీ ఒకే కథ సినిమా తీసిన ఊడుగుల వేణు దర్శకుడు… నక్సల్స్ ఇష్యూ బ్యాక్ డ్రాప్… వేణు టేస్టు, టేకింగు మీద మంచి అంచనాలే ఉన్నాయి… ఇందులో ప్రియమణి నక్సల్ నాయకురాలిగా ఒక భిన్నమైన రోల్ చేస్తోంది… ఈ లుక్ చూశారా… ఇదీ…
ఇక సాయిపల్లవి ఆల్రెడీ ఏదో అమరవీరుల స్థూపం దగ్గర, ఏదో బస్టాండులో కూర్చున్న ఫోటోలు కూడా బాగా వైరల్ అయ్యాయి… సాయిపల్లవి ఆ సినిమాలో ఫిమేల్ లీడ్ రోల్ చేస్తోంది… నేచురల్ లుక్‌తో కనిపిస్తోంది… సహజనటే కదా… ఆమె నుంచి వేణు ఎంత నటనను పిండుకోగలడో చూడాలి…
ఈ సినిమాలో నందితాదాస్ నటిస్తుండటం మరో విశేషం… భలే ఒప్పించగలిగారు ఆమెను… సహజనటి ఆమె కూడా… పెద్దగా సినిమాలు చేయడం లేదు ఈమధ్య… మరీ భిన్నమైన రోల్ ఏమైనా దొరికితే… ఇదుగో ఇలాంటి సినిమాల కోసం కన్విన్స్ చేయగలిగితే తప్ప… ఆల్రెడీ కొన్నిరోజులు షూటింగులో పాల్గొన్నది కూడా…
లీడ్ రోల్ చేస్తున్న దగ్గుబాటి రానా సినిమాకు క్రౌడ్ పుల్లర్… తను భారీ భారీ ఫార్ములా సినిమాలు మాత్రమే కావాలని కోరుకోకుండా… ప్రయోగాత్మక దర్శకులకు కూడా డేట్స్ ఇచ్చి, ఎంకరేజ్ చేయడం విశేషమే… బాహుబలితో ప్రభాస్ ఎంత పేరు సంపాదించాడో తను కూడా అంతేపేరు సంపాదించాడు… ఐనాసరే, మంచి రోల్ దొరికితే చాలుననే సోయి చూపించడం అభినందనీయమే… సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ సమర్పిస్తోంది… ఇదీ తన లుక్…
ఆల్రెడీ సాయిపల్లవి, ప్రియమణి, నందితాదాస్… ఇప్పుడు తాజా బజ్ ఏమిటంటే..? తెలుగు, తమిళ భాషల్లో బిజీ ఆర్టిస్టు నివేతా పేతురాజ్ కూడా ఈ సినిమాలో ఓ రోల్‌కు వోకే అనేసింది… షూటింగులో కూడా పాల్గొంటోంది… ఇక్కడ చెప్పుకునేది ఏమిటంటే..? తారలు భిన్న పాత్రల కోసం చూస్తున్నారు… కథ చెబితే కన్విన్సయిపోతున్నారు… కమాన్, నేను రెడీ అంటున్నారు…!
Share this Article