Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నాణేనికి మరో కోణం… మరో భార్యాబాధితుడు లోకం వదిలేశాడు…

March 8, 2025 by M S R

.

దిక్కుమాలిన చెత్తా టీవీ సీరియళ్లు… కోడళ్లకు హింస, ఆడపడుచుల ఆరళ్లు, అత్తల విలనీ… వేల సీరియళ్లు ఇదే తరహా.,. ఆయా చానెళ్ల క్రియేటివ్ టీమ్స్ నిండా కుళ్లిపోయిన మెదళ్లు…

ఒరేయ్, కాలం మారిందిరా… ఏడుస్తున్నారు మామలు, అత్తలు… అంతెందుకు..? ప్రియులతో కలిసి భర్తలనే కడతేరుస్తున్న పెళ్లాలు… ఇంకా మీరు ఏ కాలంలో ఉన్నారురా ఇడియెట్స్… మహిళా దినోత్సవం రోజున తిట్టడం యాంటీ సెంటిమెంటే… కానీ నిజంగా ఆ సీరియళ్లు వర్తమాన ధోరణులకు మంటే…

Ads

ఫేక్ గృహ హింస కేసులు, ఫేక్ అత్యాచారం కేసులు… ఫేక్ కట్నం కేసులు… అంతెందుకు భరణం, మెయింటెనెన్స్ చిక్కులు భరించలేక, మన కోర్టుల ఏకపక్ష తీర్పులకు జడిసి ఆత్మహత్యలు చేసుకుంటున్న భర్తల కేసులూ చూస్తున్నాం కదా…

వీటి దెబ్బలకు అసలు పెళ్లే చేసుకోవడం లేదు చాలామంది యువకులు… వస్తే, రా, కలిసి ఉండు, నోపెళ్లి, నో జంఝాటం, నీకు నచ్చకపోయినా నాకు నచ్చకపోయినా బ్రేకప్… నీ బతుకు నీది, నా బతుకు నాది… ఈ అలిఖిత ఒప్పందాలతో సహజీవనాలు… తాజాగా ఓ భార్యాబాధితుడి సూసైడ్ కేసు చదువుదాం…



నిశాంత్ త్రిపాఠీ అనే 41 ఏళ్ల ఉద్యోగి… సూసైడ్ నోట్‌ను తను పనిచేస్తున్న కంపెనీ వెబ్‌సైటులో పోస్ట్ చేసి గత శుక్రవారం (ఫిబ్రవరి 28న) ఆత్మహత్య చేసుకున్నాడు… ఈ తీవ్ర నిర్ణయానికి కారణం తన భార్య అపూర్వ పారిఖ్, ఆమె మేనత్త ప్రార్థన మిశ్రా అని కూడా రాసుకొచ్చాడు అందులో…

‘‘జరిగిన దానికి ఈ చివరి క్షణంలో నేను నిన్ను ద్వేషించవచ్చు… కానీ నేను అలా చేయను… ఈ క్షణంలోనూ నేను ప్రేమనే ఎంచుకున్నాను… అప్పుడూ నిన్ను ప్రేమించాను, ఇప్పుడూ నిన్ను ప్రేమిస్తున్నాను… నేను ఎదుర్కొన్న అన్ని కష్టాల గురించి మా అమ్మకు తెలుసు…

నా చావుకు నువ్వు, ప్రార్థన ఆంటీ కూడా బాధ్యులు… సో, దయచేసి ఆమె దగ్గరకు వెళ్లకు, నిన్ను వేడుకుంటున్నాను, ఆమెను ప్రశాంతంగా ఏడవనివ్వు’’ అంటూ రాసుకొచ్చాడు సూసైడ్ నోట్‌లో… తల్లి, సోదరుడు, చెల్లెలికి కూడా సందేశాల్ని రాశాడు…

చివరలో భార్యపై ప్రేమను చాటుతూ ఓ పద్యాన్ని రాశాడు… ఈ నిశాంత్ పాలఘర్ జిల్లాలో ఓ సినిమా యానిమేటర్… విలే పార్లేలోని ఓ హోటల్‌లో దిగి, డోన్ట్ డిస్టర్బ్ అనే బోర్డు వేలాడదీసి గత 28న ఆత్మహత్య చేసుకున్నాడు… హోటల్ సిబ్బందికి డౌటొచ్చి మాస్టర్ కీతో తలుపులు తెరిచి చూసేసరికి ఓ హుక్‌కు ఆయన శవం వేలాడుతూ కనిపించింది…

మనం ఎంతసేపూ ఒకే కోణంలో ఆలోచిస్తున్నాం, వింటున్నాం, చదువుతున్నాం, మన చట్టాలూ అంతే… కానీ నిశాంత్ త్రిపాఠీ వంటి కేసులు పెరుగుతున్నాయి… చాలామంది బయటికి చెప్పుకోవడం లేదు… కొన్ని ఇలా బయటికి రాకతప్పడం లేదు…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions