.
ఒక కమెడియన్‌ను భిన్నమైన ఉద్వేగాలను ప్రదర్శించే కథానాయకుడిగా చూడటానికి ప్రేక్షకుడి మైండ్‌సెట్ మొరాయిస్తుంది… అందుకే చాలామంది కమెడియన్లు రెగ్యులర్ హీరోలుగా సక్సెస్ కాలేదు…
దాంతో తిరిగి తమకు అలవాటైన కామెడీ పాత్రలకే పరిమితమవుతున్నారు… ఆలీ, సునీల్ దగ్గర నుంచి నరేష్ దాకా… జబర్దస్త్ తాలూకు కమెడియన్లకు మరో మైనస్ ఉంటుంది… అది ఆ నీచాభిరుచి ప్రోగ్రాంలో చేసీ చేసీ ప్రేక్షకుడి మదిలో ఆల్రెడీ ఓరకమైన ఓ వెగటు భావన ఏర్పడి ఉంటుంది…
Ads
అందుకే అంత త్వరగా వాళ్లను హీరోలుగా యాక్సెప్ట్ చేయరేమో జనం… ఐతే అది ఆ నటీనటుల తప్పు కాదు… జబర్దస్త్ వాళ్లకు ఉపాధి వేదిక… సో, వాళ్లు సినిమాల్లో కూడా కొన్ని పాత్రలు చేస్తుంటారు, అది వోెకే… కానీ హీరోలుగా మారితే..?
జాగ్రత్తగా గమనించండి… ప్రదీప్ మేల్ టీవీ యాంకర్లలో నంబర్ వన్… తన స్పాంటేనిటీ, ఈజ్, ఎనర్జీ లెవల్స్ పోలిస్తే ఇంకెవరూ తన దరిదాపుల్లోకి కూడా రారు… అలాగే ఢీ వంటి షోలలో యాంకర్ కమ్ కమెడియన్… అంటే ఆ స్కిట్స్ అలాంటివి…
లుక్కు గట్రా బాగానే ఉంటాడు కదా, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా చేశాడు… ఫట్… ఒక్క పాట మాత్రం హిట్, అందులో తన మెరిట్ ఏమీ లేదు… ఈమధ్య మరో సినిమా… అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి… మరో టీవీ కోహోస్ట్ దీపిక పిల్లి హీరోయిన్… ఎంత ఘోరమైన డిజాస్టర్ అంటే చెప్పలేం…
హీరోగా జనం యాక్సెప్ట్ చేయలేదు… జనం యాక్సెప్టెన్సీ ప్రధానం… అది లేకపోవడం వల్లే పెద్ద పెద్ద సినీ కుటుంబాల నేపథ్యమున్న బోలెడు మంది సక్సెస్ కాలేదు… టీవీ నటుల విషయానికే వస్తే… సుడిగాలి సుధీర్ మంచి పర్‌ఫార్మర్… డాన్స్ టాలెంట్ ఉంది… ప్చ్, తన సినిమాలూ అంతే… కాకపోతే గాలోడు కాస్త బెటర్…
వాళ్లతో పోలిస్తే రాకింగ్ రాకేష్ చాలా జూనియర్… డబ్బులు పెట్టి కేసీయార్ అని ఓ సినిమా తీశాడు… ఫట్… ఇన్నాళ్లూ సంపాదించి, కూడబెట్టుకున్న డబ్బుల హాంఫట్… సుడిగాలి సుధీర్ టీమ్మేట్ గెటప్ శ్రీను, మంచి నటుడే… సో వాట్… రాజు యాదవ్ సినిమా చేశాడు హీరోగా… అదెప్పుడు వచ్చిపోయిందో తనకే గుర్తులేనంత ఫ్లాప్…
జస్ట్, ఉదాహరణలు మాత్రమే… అందుకే హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ తదితరులు ఇతర పాత్రల్లో చేస్తుంటారు గానీ కథానాయకులుగా ట్రై చేయడం లేదు… చేసినా రిజల్ట్ ఏమిటో ఉదాహరణలు చెబుతూనే ఉన్నాయి…
చేతులు మూతులు కాల్చుకున్న Bigg Boss హీరోల ఏడుపు వేరే కథ…
ఇదెందుకు ఇప్పుడు చెప్పుకోవడం అంటే… జబర్దస్త్ బాపతు కమెడియన్లలో చాలా సీనియర్ అదిరె అభి… మంచి టైమింగ్ ఉంటుంది… తనూ ఈమధ్య హీరోగా ఓ సినిమా చేశాడు… ది డెవిల్స్ చెయిర్… థియేటర్లు ఇలాంటి చిన్న సినిమాలకు ఎలాగూ ఎగ్జిబిటర్ల సిండికేట్ ఇవ్వదు.., చూస్తున్నాం కదా… (అసలు టైటిలే ఫస్ట్ లోపం దీనికి)…
సో, తెలివిగా ఆహా ఓటీటీాలో పెట్టేశారు… ప్చ్, బాగా నిరాశపరిచింది… నేను కూడా హీరో అయ్యానోచ్ అని చెప్పుకోవడానికి తప్ప ఈ సినిమా దేనికీ పనికిరాదు… అసలే పైన చెప్పుకున్నట్టు కమెడియన్లను, అందులోనూ టీవీ జబర్దస్త్ బాపతు కమెడియన్లకు జనం యాక్సెప్టెన్సీ కష్టం… దానికిీతోడు అడ్డదిడ్డమైన ఏదో కథను మరీ గబగబా చుట్టేసి ఓటీటీలో పెట్టేశారు…
నిజానికి కొందరు షార్ట్ ఫిలిమ్స్ కూడా మంచి క్రియేటివిటీతో చేస్తున్నారు… జనం చూస్తున్నారు… కానీ ఇదేమిటంటే..? ఓ యక్ష కన్య భూమిపైకి వచ్చి, తిరిగి తన లోకానికి వెళ్లలేదు, నడుమ ఓ మాంత్రికుడు, ఓ కుర్చీని ఆవహించి ఉంటాడు… ఆ మాంత్రికుడు హీరోను ఏం అడిగాడు, తనేం చేశాడు స్టోరీ… ఫాంటసీ స్టోరీలకు మంచి పాటలు, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే గట్రా అవసరం…
అతిలోకసుందరిగా శ్రీదేవిని చూశాక, ఆమె మైండ్‌లో అలా ముద్రపడిపోయాక, ఇక సేమ్ అలాంటి పాత్రలోనే మరెవరో జూనియర్ మోస్ట్ నటి కనిపిస్తే జనం యాక్సెప్ట్ చేస్తారా..? ఏదో స్పూఫ్ అనుకుంటారు… మత్స్య కన్యగా శిల్పా శెట్టినే జనం యాక్సెప్ట్ చేయలేదు అప్పట్లో… భారీ తారాగణం, భారీ సినిమా అయినా సరే…
దీని బదులు ఏదైనా పాత చందమామ కథను తీసుకున్నా వర్కవుట్ అయ్యేదేమో… చివరకు అదిరె అభి యాక్టింగ్ టాలెంట్ కూడా ఇందులో సరిగ్గా వినియోగించుకోలేదు…
జనం అభిరుచి వేగంగా మారిపోతోంది… వినోదానికి నానారకాల మార్గాలున్నయ్… ఈ స్థితిలో సూర్య, విక్రమ్, రజినీ, అజిత్ వంటి పెద్ద హీరోల సినిమాలే ఫట్‌మని పేలిపోతున్నయ్… మరి ఇలా అల్లాటప్పాగా తీయబడే సినిమాల పరిస్థితి..?!
Share this Article