ఒక పాత్ర కర్ణుడు… అలియాస్ కరణ్… మరో పాత్ర అర్జునుడు… అలియాస్ అర్జున్… ఇవి రెండూ ప్రధాన పాత్రలు… అన్నదమ్ములే…. అరెరె, ఆగండి అక్కడే… కల్కి గురించి కాదు, ట్రోలింగ్ ఇక్కడా స్టార్ట్ చేయకండి… ఆ సినిమా వేరు, అందులో కర్ణుడు ప్రభాస్, అర్జునుడు విజయ్ దేవరకొండ… రెండురోజులుగా ట్రోల్ తీస్తున్నారు…
కానీ ఇక్కడ చెప్పుకునేది కల్కి కాదు, అసలు ఇది సినిమాయే కాదు… హాట్‌స్టార్‌లో వస్తున్న వెబ్ సీరీస్… ఇందులో అశ్వత్థామ పాత్రే లేదు… వోకేనా…! సరే, ఈ సీరిస్ విషయానికే వద్దాం… మనవాళ్లు రీమేకుల్లో ఎక్స్‌పర్టులు కదా… కొందరేమో విదేశీ కంటెంట్ కాపీ కొట్టేస్తారు, కొందరు రైట్స్ కొని మరీ రీమేకుతారు… కాకపోతే మన నేటివిటీకి తగినట్టు రీరైట్ చేయించుకుంటారు…
ఇదీ అంతే… జర్మనీలో హిట్టయిన Bad Cop Kriminell Gut అనే సీరీస్ రీమేక్ చేశారు… హాట్‌స్టార్‌లో స్ట్రీమింగులో ఉంది, తెలుగులో కూడా..! కొన్నాక, నేటివిటీకి తగినట్టు మార్చుకున్నాక… అరెరె, ఇలాంటి కథల్ని ఇండియన్ సినిమా వేల సార్లు తీసి పారేసిందే కదాని తెలిసొచ్చింది… ఐనా చేసేదేముంది..? హడావుడిగా చుట్టేసి ఓటీటీలో పెట్టేశారు, ఇన్నివేలసార్లు చూసిన మన ప్రేక్షకులు మళ్లీ చూడరా ఏం..? అనుకున్నారు…
Ads
కవలలు, కథాక్రమంలో ఒకరి పాత్రలోకి ఒకరు దూరిపోవడం… అదేనండీ కథ… కాకపోతే ఇందులో అర్జునుడేమో నెగెటివ్ షేడ్స్ ఉన్న కేరక్టర్… కర్ణుడేమో పాజిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర… అదే తేడా… ఇద్దరూ కవల పిల్లలే… అనాథ శరణాలయంలో ఉంటారు… ఎవరో పిల్లల్లేని వాళ్లు వచ్చి కర్ణుడిని దత్తత తీసుకుంటారు… వాడు పెరిగి పోలీసాఫీసర్ అయిపోయి, మరో పోలీసామెను పెళ్లిచేసుకుంటాడు… ఈ అర్జునుడేమో మన ఇండస్ట్రీ రూల్స్ ప్రకారం విలన్ అయిపోతాడు…
కర్ణుడు, అర్జునుడు టచ్‌లోనే ఉంటారు… ఓసారి ఓ మీడియా పర్సనాలిటీ హత్యకు గురై ఆ నేరం అర్జునుడి మీద పడుతుంది… ఏం చేయమంటావు బ్రో అంటూ అర్జునుడు కర్ణుడి దగ్గరకు వస్తాడు… తరువాత కర్ణుడి మీద కూడా అటాక్ జరిగి చనిపోతాడు… ట్విస్ట్ అన్నమాట…
ఇక కర్ణుడి పాత్రలోకి అర్జునుడు ప్రవేశిస్తాడు… ఆ తరువాత మిగతా కథంతా… అబ్బే, ఇక చూడనక్కర్లేదు అనుకుంటున్నారా..? అలాగంటే ఎలా..? మన మీద ఎంతో నమ్మకంతోనే కదా ఈ పాత చింతకాయ పచ్చడిని కొత్త సీసాలో పెట్టి చూపిస్తున్నారుగా… లేక… పర్లేదు, టైంపాస్ చూసేద్దాం అంటారా..? వోకే… క్యారీ యాన్..! కర్ణుడు, అర్జునుడు అనగానే మళ్లీ సోషల్ మీడియాలో ట్రోలకండి…!!
Share this Article