సుధీర్ తనంతటతానే జబర్దస్త్ షో మానేస్తానని ఏమైనా చెప్పాడా..? ఈటీవీ నుంచి వెళ్లిపోతాను అని చెప్పాడా..? పోనీ, రష్మి ఇక టీవీ షోలు చాలు అని ఫిక్సయిపోయి, అదే విషయాన్ని మల్లెమాల ప్రొడక్షన్స్ వాళ్లకు సమాచారం ఇచ్చిందా..? దాంతో సదరు టీవీ షోల బాధ్యులు కలవరపడిపోయి, అర్జెంటుగా సుధీర్-రష్మి వంటి మరో జోడిని ప్రిపేర్ చేయాలని తహతహలాడిపోతున్నారా..? లేక ఏడెనిమదేళ్లుగా వాళ్ల లవ్ ట్రాకు నడిపిస్తున్నాం, ఇంకా ప్రేక్షకులేం చేస్తారులే, ఏజ్ బార్ అయిపోయారు, కొత్తవాళ్లను ట్రై చేద్దాం అని భావిస్తున్నారా..? లేకపోతే ఏమిటి మరి..? ఇమాన్- వర్ష లవ్ ట్రాకు మీద విపరీతంగా ఇంట్రస్టు చూపిస్తూ, ప్రమోట్ చేస్తూ, హైప్ క్రియేట్ చేస్తూ, నానా కథలూ పడుతున్నారు… కానీ ఈ బ్లాక్ అండ్ వైట్ కాంబో పెద్దగా వర్కవుట్ అవుతుందో లేదో అనే డౌట్ వాళ్లకూ వచ్చినట్టుంది… పైగా వాళ్లిద్దరూ హైట్, టైమింగ్, కలర్… అన్నింట్లోనూ కంట్రాస్టే… అందుకని..?
అప్పుడే మరో ఆల్టర్నేట్ లవ్ ట్రాకు మీద కన్నుపడినట్టుంది… నిన్నటి ఎక్స్ట్రా జబర్దస్త్ షోలో… రాకింగ్ రాకేష్, రోహిణి డాన్స్ చేస్తూ ఎంట్రీ ఇచ్చారు… కాస్త రెచ్చిపోయింగ్స్… నిజానికి ఇద్దరికీ కామెడీలో మంచి టైమింగ్ ఉంది… బాగా చేస్తారు… గతంలో చిన్న పిల్లలతో స్కిట్లు చేసేవాడు, కొన్ని స్కిట్లకు తన సామాజిక స్పృహనూ అద్ది కాస్త డిఫరెంట్ అనిపించుకున్నాడు కూడా… (వీళ్ల స్కిట్లలో కనిపించే కొమురక్క నోటి నుంచి తెలంగాణ స్లాంగ్ పర్ఫెక్టుగా పలుకుతుంది…) ఈ డాన్స్ ప్లస్ ఈ స్కిట్ చూశాక… రష్మి ‘ఏం రాకేష్, రెండు రోజుల్లో వాలంటైన్స్ డే వస్తోంది… ఏంటీ పరిస్థితి..?’’ అంటూ రోహిణి వైపు చూపిస్తూ ‘‘ఏమిటీ కథ’’ అనే అర్థమొచ్చేలా అడిగింది… వెంటనే రోజా కూడా అందుకుని ‘‘పెద్దవాడివై పోయావ్, తమ్ముడి పెళ్లి కూడా అయిపోయింది, ఫ్రీ బర్డ్ అయిపోయావ్, ఏం జరగబోతోంది చెప్పు..? ఎంట్రీలోనే మీ డాన్స్ దగ్గర డౌటొచ్చేసింది నాకు… ఆ జర్కులు గట్రా భలే కుదిరాయ్’’ అని మొదలుపెట్టేసింది… ఆ జంట సిగ్గుపడింది కానీ… అబ్బెబ్బే, ఏమీ లేదు అన్నట్టుగా కూడా సైగల్లేవు… నిజానికి మంచి జోడీయే… కుదిరితే…! ఎలాగూ ఈ లవ్ స్టోరీని కూడా ట్రాకు మీదకు ఎక్కించాలని జబర్దస్త్ టీం కూడా బాగా తొందరమీద ఉన్నట్టుంది కూడా…!! రాకేష్, ఏమంటావ్ మరి..?!
Ads
Share this Article