.
సంక్రాంతి కంబాలా పోటీలో ప్రభాస్ ఫస్ట్ ఔటయిపోయాడు కదా… ఈరోజు మరో హీరో ఔట్… ఆ సినిమా పేరు పరాశక్తి… ఆ హీరో పేరు శివకార్తికేయన్… అమరన్ చిత్రంతో మనకూ బాగా పరిచయమే కదా… (సాయిపల్లవి హీరోయిన్ అందులో)…
- ఈరోజు ఆ సినిమా రిలీజైంది… కానీ డిజాస్టర్ టాక్… పైగా ఇందులో తెలుగు వారిని అవమానించే ఓ పదం Golti ఉంది… దీన్ని కట్ చేస్తామని ముంబై సెన్సార్ రివిజన్ కమిటీ ఎదుట అంగీకరించి కూడా, తమిళ వెర్షన్‌లో అలాగే ఉంచారట… దాంతో #BoycottParasakthi అనే క్యాంపెయన్ నడుస్తోంది…
ఇది ప్రధానంగా 1960 ల నాటి హిందీ వ్యతిరేక ఉద్యమం కథ… దర్శకురాలు సుధ కొంగర తెలుగు మహిళ అయి ఉండీ, ఈ తెలుగువాళ్లను కించపరిచే పదాన్ని వాడటం ఏమిటనేది ఒక వివాదం… పైగా అది తీసేస్తే సినిమా ఆత్మ పోతుందని సమర్థించుకుందట ఆమె…
Ads
రెండుమూడు ఇతర వివాదాలు చెప్పుకుని, సెన్సార్ సమస్యలు, సినిమా కథ చెప్పుకుందాం… ఇది తెలుగు, హిందీ, తమిళంలో విడుదల చేసిన చిత్రం… తమిళంలో పురననూరు… తెలుగులో పరాశక్తి… శ్రీలీల హీరోయిన్, జయం రవి, అధర్వ కూడా ఉన్నారు… అతిథి పాత్రలో రానా దగ్గుబాటి కూడా…
- 1952 నాటి శివాజీ గణేషన్ తొలి చిత్రం పేరు కూడా పరాశక్తి… ఆ పేరు వాడటం మీద శివాజీ అభిమాన సంఘాల వ్యతిరేకత… తరువాత నిర్మాతలు ఏవీఎం ప్రొడక్షన్స్ నుంచి అనుమతి తీసుకోవడంతో సద్దమణిగింది… ఈ కథ మాదేనని కొందరు రచయితలు కోర్టుకెక్కారు, విచారణ వోకే గానీ, సినిమా రిలీజు మీద స్టే ఇవ్వలేమని కోర్టు చెప్పింది…
ఇక సెన్సార్ సమస్యలు… ఈ సినిమా 1960ల నాటి మద్రాసులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమాల (Anti-Hindi Agitations) నేపథ్యంతో తెరకెక్కిన రాజకీయ డ్రామా… ఈ సున్నితమైన అంశం వల్లే సెన్సార్ బోర్డు (CBFC) తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది…
-
భాషా పరమైన వివాదాలు..: సినిమాలో “హిందీ రుద్దుడు” (Hindi Imposition) గురించి ఉన్న డైలాగులు, ఇతర దేశాల్లో భాషా విభేదాల వల్ల జరిగిన విచ్ఛిన్నం గురించిన వాయిస్ ఓవర్‌లపై బోర్డు అభ్యంతరం తెలిపింది…
-
భారీ కట్స్…: బోర్డు మొదట సుమారు 23 నుండి 25 వరకు మార్పులు/కట్స్ సూచించింది…
-
పదాల తొలగింపు…: సినిమాలో వాడిన కొన్ని కఠినమైన పదాలను (ఉదాహరణకు: బాస్టర్డ్, సిరుక్కి వంటివి) మ్యూట్ చేయమని లేదా తొలగించమని ఆదేశించింది…
-
చారిత్రక అంశాలు…: 1960ల నాటి రాజకీయ పరిస్థితులను ప్రతిబింబించే కొన్ని సన్నివేశాలు వివాదాస్పదంగా ఉన్నాయని బోర్డు భావించింది….
ఇవన్నీ తీసేస్తే ఇక సినిమా ఆత్మే పోతుందని దర్శకురాలు వాదన… మొదట కట్స్‌కు అంగీకరించలేదు… చివరకు రివైజింగ్ కమిటీకి వెళ్లింది సినిమా… అసలు రిలీజు నాటికి సెన్సార్ సర్టిఫికెట్ వస్తుందా, రిలీజు అవుతుందానే సందేహాలు కమ్ముకున్నాయి…
అక్కడ కమిటీ హెడ్ సుధ కొంగరకు సావధానంగా కొన్ని విషయాలు వివరించడంతో దర్శకురాలు చివరకు కొన్ని కట్స్‌కు అంగీకరించింది… అంగీకరించాల్సి వచ్చింది… (ఈమె గతంలో ఆకాశం నీ హద్దురా అనే సినిమాతో తెలుగువాళ్లకు పరిచయమే)… “హిందీ నా కలను నాశనం చేసింది” అనే డైలాగును “నా ఏకైక కలను హిందీ రుద్దుడు కాల్చేసింది” అని మార్చారు… అలాగే కొన్ని ప్రాంతాల్లో డైలాగులను మ్యూట్ చేశారు…
-
లాస్ట్ మినిట్ క్లియరెన్స్…: సినిమా విడుదల కావడానికి కేవలం 10 గంటల ముందు మాత్రమే సెన్సార్ సర్టిఫికేట్ (U/A 16+) లభించింది… చిత్ర బృందం యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసి క్యూబ్ (QUBE) లో సినిమాను అప్‌లోడ్ చేశారు…
సమీక్ష…
1960ల నాటి మద్రాసు నేపథ్యంలో సాగుతుంది… ఆ కాలంలో తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమం, విద్యార్థి రాజకీయాలు, సామాజిక మార్పుల చుట్టూ కథను అల్లారు… శివకార్తికేయన్ ఒక విద్యార్థి నాయకుడిగా, వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడే యువకుడిగా కనిపిస్తాడు…
1. సాగదీసిన కథనం (Pacing Issues)…: సినిమాలో అతిపెద్ద మైనస్ పాయింట్ దాని వేగం… సుధ కొంగర గత చిత్రాలైన ‘గురు’, ‘ఆకాశం నీ హద్దురా’లో కథ చాలా వేగంగా, ఆసక్తికరంగా సాగుతుంది… కానీ ఈ సినిమాలో డ్రామా పేరిట కథను చాలా చోట్ల సాగదీశారు… ముఖ్యంగా ప్రథమార్ధంలో వచ్చే లవ్ స్టోరీ సినిమా మూడ్‌కు అంతగా సెట్ కాలేదు…
2. ప్రాంతీయ వివక్ష , వివాదాస్పద పదాలు…: సినిమాలో తెలుగు వారిని ఉద్దేశించి వాడిన ‘గొల్టి’ వంటి పదాలు చాలా అసహజంగా, అగౌరవంగా అనిపించాయి… కేవలం ఆనాటి పరిస్థితులను చూపిస్తున్నామని చెప్పి, ఒక వర్గాన్ని కించపరిచేలా డైలాగులు ఉండటం తెలుగు ప్రేక్షకులకు మింగుడు పడటం లేదు… ఇది సినిమాపై ఉన్న పాజిటివ్ వైబ్‌ను దెబ్బతీసింది…
3. ఎమోషనల్ డిస్‌కనెక్ట్…: రాజకీయ నేపథ్యంలో సాగే సినిమాలకు ఉండాల్సిన ప్రధాన బలం ‘ఎమోషన్’… కానీ, ఈ సినిమాలో పాత్రల మధ్య బంధం కంటే భావజాలం గురించి చర్చ ఎక్కువైపోయింది… దీనివల్ల ప్రేక్షకుడు కథతో పూర్తిగా మమేకం కాలేకపోతున్నాడు… సెన్సార్ కారణంగా కొన్ని కీలకమైన సీన్లు కట్ అవ్వడం కూడా సినిమా ఫ్లోను దెబ్బతీసింది…
4. శివకార్తికేయన్ ఇమేజ్..: శివకార్తికేయన్ ఇప్పటివరకు చేసిన మాస్, కామెడీ పాత్రల నుండి బయటకు వచ్చి సీరియస్ రోల్ చేశాడు… నటన బాగున్నప్పటికీ, ఆయన నుండి ఎంటర్టైన్మెంట్ ఆశించే సాధారణ ప్రేక్షకుడికి ఈ సినిమా భారంగా అనిపించవచ్చు…
ప్లస్ పాయింట్లు: 1960ల నాటి మద్రాసును రీ-క్రియేట్ చేసిన విధానం, సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉన్నాయి… జీవీ ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రాణం పోసింది… శ్రీలీల తన పరిధి మేరకు బాగా నటించింది… కొన్ని ఎమోషనల్ సీన్లలో ఆమె నటన ఆకట్టుకుంటుంది…
ఒక వర్గం ప్రేక్షకులకు (రాజకీయ చరిత్రపై ఆసక్తి ఉన్నవారికి) నచ్చవచ్చు కానీ, కమర్షియల్ ఎలిమెంట్స్ ఆశించే వారికి ఇది నిరాశ కలిగిస్తుంది… సెన్సార్ కట్స్, వివాదాల ప్రభావం సినిమా ఫలితంపై స్పష్టంగా కనిపిస్తోంది… సుధ కొంగర తన మార్క్ మేకింగ్‌ను చూపించినప్పటికీ, కథనంలో ఉన్న లోపాల వల్ల సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్... ప్రత్యేకించి తెలుగువాళ్లు ఈ సినిమా చూడాలని అనుకుంటు, తమను తాము అవమానించుకున్నట్టే..!!
Share this Article