బహుశా రాయలసీమకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే కావచ్చు… ‘ఈనాడు వయా మీడియాగా పోతుంది, అదంటే గౌరవం… సాక్షిని నేను అసలు చదవను… జ్యోతి కూడా టీడీపీ భజన పత్రిక…’ అన్నాడట మీడియాతో ఆఫ్దిరికార్డు మాట్లాడుతూ..! అది నిజమే… సాక్షిని వైసీపీ వాళ్లే పెద్దగా చదవరు… అందులో జగన్ భజన తప్ప మరొకటి ఉండదు… ఇతర పార్టీల వార్తల కవరేజీలో గానీ, బాస్ భజనలో గానీ, ప్రత్యర్థుల మీద దాడిలో గానీ నమస్తే తెలంగాణ ఇంకా దారుణంగా ఉంటుంది… దాన్ని టీఆర్ఎస్ వాళ్లే పెద్దగా పట్టించుకోరు…
సేమ్ జ్యోతి… తెలంగాణ వరకు వోకే… ఏపీలో పూర్తిగా పచ్చరంగు వేసుకుని మరీ బజారులో నర్తిస్తుంటుంది… మిగతా పత్రికలకూ రంగులున్నా సరే, వాటిని వదిలేసి, పేరుకు పెద్ద పత్రికల గతే చూద్దాం… ఈ ఆంధ్రజ్యోతి వార్త ఓసారి చూడండి… దీన్ని ఏ ఆనందం అంటారో తెలియదు గానీ… ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడానికి ముందురోజు రాత్రి 9 గంటల వరకూ వెంకయ్యనాయుడు పేరే బీజేపీ పరిశీలన జాబితాలో ఉందట… ముర్ము పేరు ప్రకటించగానే బీజేపీ వర్గాలే హాశ్చర్యపోయాయట…
Ads
ఏదో పిచ్చి ఆనందం… నో, నో, బీజేపీ మా వెంకయ్యకు అన్యాయం ఏమీ చేయలేదు, ఫాఫం, రాత్రి వరకూ తనకే చాన్స్ ఇద్దామని అనుకుంది… కానీ తప్పనిసరై గిరిజనుల్లో పార్టీకి లబ్ధి ఆశతో ముర్ము పేరును ఎంపిక చేశారు… అంతేతప్ప మన వెంకయ్య ప్రాధాన్యం ఏమీ తగ్గలేదులే అనే విచిత్ర ఆనందప్రకటన ఈ వార్త…
నిజానికి బీజేపీ ఆలోచనల్లో ద్రౌపది ముర్ము పేరు ఎప్పట్నుంచో ఉంది… గత రాష్ట్రపతి ఎన్నికలప్పుడు కూడా ఆమె పేరు ప్రధాన పరిశీలనలో ఉంది… ఈసారి చత్తీస్గఢ్ గవర్నర్ అనసూయ ఉయికె పేరును కూడా కాస్త సీరియస్గా పరిశీలించారు… పార్టీకి రాష్ట్రపతి అభ్యర్థిత్వం విషయంలో ఓ స్ట్రాటజీ ఉంది… మతం, రాజకీయం గట్రా మిళితమై ఉన్న వ్యూహం అది…
రాష్ట్రపతి ఓ రబ్బరు స్టాంప్, ఎవరైతేనేం, ఆమె మాత్రం చేసేదేముంటుంది..? అని యాంటీ మోడీ సెక్షన్లన్నీ ఓరకమైన వ్యతిరేక ప్రచారాన్ని ప్రారంభించాయి… నిజమే… రాష్ట్రపతి రబ్బర్ స్టాంపే అనుకుందాం… మరి ఉపరాష్ట్రపతి..? అసలు ఎంపీల మాటేమిటి..? రాష్ట్రాల్లో మంత్రుల మాటేమిటి..? కేంద్ర మంత్రులు చేసేదేమిటి..? ప్రధాని కార్యాలయం, ముఖ్యమంత్రుల కార్యాలయాలదే కదా పూర్తి నిర్ణయాధికారం… వోకే, రాష్ట్రపతి పోస్టు రబ్బర్ స్టాంపే కదా, మరి ఆ పదవి మా తెలుగు వెంకయ్యకు గనుక ఇవ్వకపోతే ప్రత్యేక దక్షిణ భారతదేశ పోరాటం తప్పదు అంటూ ఇదే ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ చేసిన తిక్క ప్రచారాన్ని ఏమనాలి..? మీకన్నా బండ్ల గణేష్ నయం కాదా…
వర్మ అనే ఓ బురదపంది ఉంది… ఆమె పేరును ప్రస్తావిస్తూ… ద్రౌపది రాష్ట్రపతి సరే, మరి పాండవులు ఎవరు..? కౌరవులు ఎవరు..? అని అత్యంత నీచమైన ట్వీట్ వదిలాడు… సరే, తన కేరక్టర్ ఆ స్థాయే… అది ఓ బొద్దింక పుట్టుక… మళ్లీ ఏబీఎన్, ఇతర ఆంధ్రా మేధావుల విషయానికే వద్దాం… ఇదే ఆంధ్రజ్యోతి వార్త నిజమే అనుకుంటే… తెలంగాణ నుంచి బండారు దత్తాత్రేయ పేరును, తమిళనాడుకు చెందిన తమిళిసై పేరును కూడా బీజేపీ సీరియస్గా పరిశీలనకు తీసుకున్నట్టే కదా… రాత్రి 9 గంటల వరకూ ఏపీకి చెందిన వెంకయ్య పేరు కూడా ఉందనే రాసుకొచ్చారు కదా…
మరిక బీజేపీ దక్షిణాదికి చేసిన ద్రోహం ఏమిటట..? ప్రత్యేక ద్రవిడనాడు పోరాటం దేనికట..? ఏబీఎన్ డిబేట్లకు, ఆంధ్రా మేధావుల కూతలకు అర్థాలేమిటట..? అయిదుగురు పేర్లు పరిశీలిస్తే అందులో మూడు పేర్లు దక్షిణాదివే కదా… (నిజంగా దత్తాత్రేయ, తమిళిసై పేర్లు పరిశీలనకు వచ్చాయా లేదానేది వేరే చర్చ)… అనసూయ ఉయికె, ద్రౌపది ముర్ములు కూడా ఈ సోకాల్డ్ ద్రవిడనాడు మేధావులు ఏడ్చి మొత్తుకునే నొటోరియస్ నార్తరన్ స్టేట్స్ వాళ్లేమీ కాదు… మధ్యభారతానికి చెందిన పేద, వెనుకబడిన రాష్ట్రాల వాళ్లు… తరతరాలుగా వివక్షకు గురవుతున్న ఆదివాసీలు… కనీసం రబ్బర్ స్టాంపుగా మారడానికైనా సరే, వాళ్లకు అర్హత లేదా..? ఈ ఏడుపులు దేనికి..?! మళ్లీ మా వెంకయ్య ప్రాధాన్యం ఏమీ తగ్గలేదులే అని ఇలాంటి వార్తల విచిత్రానందాల పిల్ల కేరింతలు దేనికి..?!
Share this Article