Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మరో కీలక టెర్రరిస్ట్ ఖతం..! డౌటెందుకు..? గుర్తుతెలియని వ్యక్తులే..!!

June 21, 2024 by M S R

గుర్తుతెలియని సాయుధుల కాల్పుల్లో మరణించిన నిజ్జర్‌కు మొన్న కెనడా పార్లమెంటు నివాళి అర్పించడం ఓ అసాధారణ పరిణామం… ఇండియా ఓ ఉగ్రవాదిగా, వాంటెడ్ పర్సన్‌గా ప్రకటించిన వ్యక్తి మరణిస్తే ఒక దేశం అలా అధికారికంగా నివాళి అర్పించడం అంటే ఇండియాతో సంబంధాలు ఎలా ఉన్నా పర్లేదనే తెంపరితనం ట్రూడో ప్రభుత్వానిది…

ఇండియన్ ఏజెంట్లే హతమార్చారంటూ ఆ దేశం రచ్చ చేస్తోంది… ఇతర దేశాలనూ లాగుతోంది ఇండియాకు వ్యతిరేకంగా… ఐతేనేం, ఆ గుర్తుతెలియని వ్యక్తులు చేసే హత్యలు ఆగుతున్నాయా..? లేదు… ఏకంగా పాకిస్థాన్‌లో కరడుగట్టిన ఉగ్రవాదుల్ని సైతం సింపుల్‌గా లేపేస్తోంది… గతంలో ఉగ్రవాదులకు జనం భయపడే స్థితి ఉంటే, ఇప్పుడు ఉగ్రవాదులే భయంభయంగా మసిలే సిట్యుయేషన్… తాజాగా మరొకడిని లేపేశారు గుర్తుతెలియని సాయుధులు… అదీ పాకిస్థాన్‌లోనే…

మాజీ డైరెక్టర జనరల్, ఎమర్జెన్సీ సర్వీసెస్ అకాడమీ ఆఫ్ పాకిస్థాన్ ఆర్మీ 1122 బ్రిగేడియర్ అమీర్ హంజాను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు… నల్లని దుస్తులు ధరించిన నలుగురు మోటారు బైకుల మీద వచ్చారు, కాల్పులు జరిపారు, పారిపోయారు… వేగంగా జరిగిపోయింది, హంజా కుప్పకూలిపోయాడు… అసలు ఎవరు అమీర్ హంజా..? ఎందుకు హత్య చేశారు..?

Ads

కశ్మీర్‌లో చెట్ల పొదల చాటున దాగి, హఠాత్తుగా రోడ్డు మీదకు రావడం, కాల్పులు జరిపి, తిరిగి చెట్ల పొదల్లోకి వెళ్లిపోయి, అట్నుంచటే పాకిస్థాన్ సరిహద్దులు దాటి వెళ్లిపోయే టెర్రరిస్టులు హంజా శిక్షణ ఇస్తుంటాడు… అదీ తన నేపథ్యం… పది రోజుల క్రితం వైష్ణోదేవిని దర్శించుకుని వచ్చే భక్తుల బస్సుపై దాడికి అసలు బాధ్యుడు అమీర్ హంజానే…

ప్రణాళిక రచన, శిక్షణ అమీర్ హంజాది, అమలు చేసింది ఆయన మనుషులు… All Eyes on Raeisi అనే ప్రచారం చూశాం కదా… వెళ్లి పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో దాక్కున్న అమీర్ హంజా శిష్యులను మూడు రోజుల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు లేపేశారు… అమీర్ హంజాని కూడా సేమ్ అలాగే… పాకిస్థాన్ ఆ అపరేషన్ ఖతం అయిపోగానే కశ్మీర్‌లో వీళ్లకు సహకరించిన ముగ్గురిని సైన్యం మట్టుబెట్టింది… అలా రైసీ దుర్ఘటనకు కారకులు, బాధ్యుల పైకి పంపించబడ్డారు… (By పోట్లూరి పార్థసారథి)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘అనగనగా..’ ఓ సుమంతుడు… మరొక్కసారి అదే ఫెయిల్యూర్ అడుగు…
  • సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి అత్యంత కీలకమైన రాజ్యాంగ ప్రశ్నలు..!
  • అది సరే గానీ… మరి రేవంత్ రెడ్డి ఏమైపోతాడో చెప్పలేదేమిటి..?
  • ఫాఫం, తెలంగాణ వాళ్లు ఎవరూ దొరకడం లేదా సారూ..!!
  • దిక్కుమాలిన, తలకుమాసిన మర్యాద… వీటినే బానిస ధోరణులు అంటారు…
  • ఏ కులమైతేనేం… బలుపు చూపే కులంపై తిరగబడేవాడే,.. కర్ణన్…
  • సినిమా టైటిల్‌లో మొనగాడు ఉంటే చాలు… మనోళ్లకు ఖుషీ…
  • అంతే… ఆ స్పీచ్ తరువాత కాంగీ, సీపీఎం మొహాలు మాడిపోయాయ్…
  • యుద్ధంకన్నా క్లిష్టం… సింధు జలాల వాటాలు… దిక్కుతోచని పాకిస్థాన్…
  • వావ్ మద్రాస్..! అప్పట్లోనే ఆంధ్రాలీడర్లు ఇంకాస్త గట్టిగా పట్టుపట్టి ఉంటే..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions