లైగర్ ఏ స్థాయి డిజాస్టరో చదువుతూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం… థియేటర్లకు వెళ్లి, గజ్జన వణికిపోతూ మధ్యలోనే పారిపోయి వస్తున్నవాళ్లూ ఉన్నారు… రిలీజుకు ముందు విజయ్, పూరీ తదితరుల ఎచ్చులు గుర్తుచేసుకుని, వాటిని కోట్ చేసి, మరీ మీమ్స్ వదులుతున్నారు నెటిజెన్స్… ప్రత్యేకించి ఆగ్ లగాదేంగే వంటి… విజయ్ మాటను ప్రేక్షకులు గౌరవించి, నిజంగానే కాలబెట్టారు… ఎంత అంటే..? తెలుగు సినిమాల్లోకెల్లా లోయెస్ట్ ర్యాంకు ఇచ్చి, సినిమా బాధ్యులందరూ సిగ్గుతో తలదించుకునేలా చేశారు… అదెలా అంటారా..?
మామూలుగా ప్రతి సైటు ప్రతి సినిమాకు ఏదో ర్యాంకు ఇచ్చి, ఏదో రివ్యూ వదులుతూ ఉంటుంది కదా… అది కూడా ఈమధ్య దందా అయిపోయింది… ఆ ర్యాంకులకు పెద్దగా విశ్వసనీయత లేదు… కాకపోతే నెటిజనం నమ్మకపోయినా చూస్తుంటారు… ఈ ర్యాంకుల్లో కోట్ల మంది నెటిజన్లు కాస్త నమ్మేది ఐఎండీబీ ర్యాంకుల్ని… ఇదే గాకుండా రాటెన్ టొమాటోస్ వంటివీ ర్యాంకులు ఇస్తుంటాయి… కానీ ఐఎండీబీ ర్యాంకులకు కాస్త విలువ ఏడ్చింది…
నిజానికి ఐఎండీబీ ర్యాంకులు దాని లక్షల మంది పాఠకులు ఇచ్చే రేటింగ్స్ క్రోడీకరించి, ఏదో ఓ అంకె ఖరారు చేస్తుంది… అంటే ఇదేం లోపరహితం కాదు, దీని పాఠకులు అధికంగా మగవాళ్లు… పైగా ఈ వెబ్‌సైట్ ర్యాంకుల్ని ట్వీక్ చేస్తుంటుంది కూడా… అంటే తన అభిప్రాయానికి అనుగుణంగా మార్చడం… ఐనాసరే, ఐఎండీబీ ర్యాంకు బాగా ఉంటే సినిమాకు ఓ విలువ… ర్యాంకు బాగాలేకపోతే అదొక నగుబాటు, సిగ్గుచేటు…
Ads
అసలు అత్యంత తక్కువ ఐఎండీబీ రేటింగ్ ఉన్న తెలుగు సినిమాలు ఏమిటి అని ఓసారి సెర్చితే… హాశ్చర్యం… లైగర్ కనిపించింది… నిఝంగా నిఝం… (ఈ స్టోరీ ఫైల్ చేసే టైముకి అదే lowest) https://www.imdb.com/search/title/?languages=te&title_type=feature&sort=user_rating,asc ఫాఫం, విజయ్… ఫాఫం, పూరీ… దీని ర్యాంకు మరీ 1.6… ఔటాఫ్ 10… ఇక ఇప్పట్లో ఎవడూ ఈ రేంజుకు చేరుకోడేమో బహుశా… ఎందుకంటే ఆ రేంజులో ఫ్లాపయింది…
సరే, ఈ లైగర్‌ను తరిమేసి, టాప్ టెన్ పరిశీలిస్తే… బాలయ్య సినిమాలు ఎక్కువగా ఉంటాయి… నేచురల్… అడ్డదిడ్డంగా ఏదేదో తీసేసి జనం మీదకు వదలడంలో బాలయ్య దర్శకులు ఎక్స్‌పర్ట్స్ కదా… ఓసారి ఆ టాప్ టెన్ (తక్కువ రేటింగుల్లో) సినిమాల్ని చూద్దాం…
- లైగర్ (1.6) (2022)
- రగిలే గుండెలు (1.7) (1985) మోహన్‌బాబు సినిమా… దర్శకుడు చంద్రశేఖర్‌రెడ్డి…
- పరమవీరచక్ర (1.8) (2011) బాలయ్య సినిమా… దర్శకుడు దాసరి నారాయణరావు….
- ఒక్క మగాడు (1.9) (2008) బాలయ్య సినిమా… దర్శకుడు వైవీఎస్ చౌదరి…
- మహారథి (2.0) (2007) బాలయ్య సినిమా… దర్శకుడు వాసు…
- విజయేంద్రవర్మ (2.0) (2004) బాలయ్య సినిమా… దర్శకుడు స్వర్ణ సుబ్బారావు…
- క్లైమాక్స్ (2.1) (2020) మియా మల్కోవాతో రాంగోపాల్ వర్మ తీసిన కళాఖండం…
- వీరభద్ర (2.2) (2005) బాలయ్య సినిమా… దర్శకుడు రవికుమార్ చౌదరి…
- మస్త్ (2.2) (2009) శివబాలాజీ హీరో… దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి…
- శీనుగాడు చిరంజీవి ఫ్యాన్ (2.2) (2005) బ్రహ్మానందం… దర్శకుడు రాధాకృష్ణ
….. ఆగండాగండి… ఈ ర్యాంకులకు కలెక్షన్లకూ సంబంధం లేదు… సూపర్ హిట్, బంపర్ హిట్ సినిమాలకు కూడా తక్కువ రేటింగ్ కనిపించవచ్చు… ముందే చెప్పినట్టు ఇదోరకం లెక్క… టాప్ టెన్ చూస్తే మీకే అర్థమవుతుంది…
Rank & Title | IMDb Rating | Your Rating | ||
---|---|---|---|---|
1. C/o Kancharapalem (2018) | 8.4 |
|
||
2. Mayabazar (1957) | 8.3 |
|
||
3. Jersey (2019) | 8.3 |
|
||
4. Nuvvu Naaku Nachchav (2001) | 8.2 |
|
||
5. Mahanati (2018) | 8.2 |
|
||
6. Aha Naa Pellanta (1987) | 8.2 |
|
||
7. Agent Sai Srinivasa Athreya (2019) | 8.2 |
|
||
8. Aa Naluguru (2004) | 8.0 |
|
||
9. Baahubali 2: The Conclusion (2017) | 8.0 |
|
||
10. Bommarillu (2006) | 8.0 |
ఇవన్నీ ఎలా పోతేనేం గానీ… విజయ్ దేవరకొండ లైగర్ సినిమా కింది నుంచి ఫస్ట్ ప్లేసులో ఉండటం తనకు ఫ్యాన్స్‌కు నొప్పి కలిగించే అంశమే… ఫాఫం, చార్మి ఎంత బాధపడిపోతోందో…!! (అనసూయ మాత్రం ఫుల్ ఖుష్)…
Share this Article