ఒక సుడిగాలి సుధీర్, ఒక రష్మి జంట అంటే… వాళ్ల కెమిస్ట్రీ బాగుంటుంది, వాళ్ల నడుమ ఏ ప్రేమబంధమూ లేదని తెలిసినా, వాళ్లే పదే పదే చెప్పినా సరే, టీవీ ప్రేక్షకులకు వాళ్లను చూస్తుంటే ఓ సరదా… కానీ వాళ్ల జంట హిట్టయిందని ఇక బోలెడు జంటల్ని ప్రచారం కోసం, పాపులారిటీ కోసం, రేటింగ్స్ కోసం కలిపేసి, విడగొట్టి టీవీ చానెళ్లు నానా డ్రామాలూ ప్లే చేస్తున్నయ్… వార్నీ, వచ్చే వాలంటైన్స్ డే ప్రోమోలు చూస్తుంటే ఆ సుధీర్, రష్మిలకు కూడా పిచ్చి లేవడం ఖాయం…
ఎలాగూ తెర మీద ఆటలే కాబట్టి, కొత్త జంటలు కనిపిస్తే మంచిదే… ఎంజాయబుల్… జాతీయ చానెళ్లు కూడా ఈ వేషాలు వేస్తూనే ఉంటయ్… రియాలిటీ షోలలో కామన్ అయిపోయింది… యాంకర్లే కాదు… జడ్జిలకూ, యాంకర్లకూ… యాంకర్లకూ హోస్టులకూ… కంటెస్టెంట్‌కూ కంటెస్టెంట్‌కూ… చానెళ్ల ఇష్టం… ఏదో రెండు పిచ్చి స్టెప్పులు వేయించడం, సీన్ ఫ్రీజ్ చేసి లవ్ సింబల్ గుద్దేయడం… అదా ఓ జంటను కన్నులపండువగా ప్రజెంట్ చేయడం అంటే… ఛ… అస్సలు కాదు…
Ads
ఇండియన్ ఐడల్‌లో అరుణిత, పవన్ దీప్ నడుమ ఎంత బాగా పండిందో చూశాం కదా… అలా కనెక్ట్ కావాలి… హైపర్ ఆది చూడండి.., ఢీలో ప్రియమణి, జబర్దస్త్‌లో అనసూయ… ఆ ఢీలోనే టీవీ నటులు రవికృష్ణ, నవ్య స్వామి… అంతకుముందు ఢీలో ప్రదీప్‌కూ పూర్ణకూ సెట్ చేశారు, కానీ ప్రేక్షకులు పెద్దగా ఇష్టపడలేదు… ఫాఫం, ఆమధ్య రాకేష్‌కు రోహిణికి ముడిపెట్టారు కదా, అది వర్కవుట్ కాలేదు, ఇప్పుడిక సుజాతను రాకేష్ మెడలో వేశారు తాజాగా… ఇమాన్యుయెల్, వర్ష ఎంత ప్రయత్నించినా జనం యాక్సెప్టెన్సీ లేదు… తాజాగా ఫైమా, ప్రవీణ్… చివరకు పొట్టి నరేష్, షబీనా… రాబోయే శ్రీదేవి డ్రామా కంపెనీ కోసం ఎవరెవరో జంటలు కనిపిస్తున్నారు ప్రోమోలో…
మాటీవీలో వాలంటెన్స్ డే సందర్భంగా బీబీ జోడీ స్పెషల్ అని ఓ ప్రోమో… బీబీ అంటే బిగ్‌బాస్ అన్నమాట… ఏ షో చేయాలన్నా ఆ బిగ్‌బాస్ కంటెస్టెంట్లే కదా మాటీవీకి కనిపించేది… ఫాఫం… నవ్వొచ్చింది ఎక్కడ అంటే… బిగ్‌బాస్ అరియానా, సొహెయిల్ జోడీ అట… సరే, ఇక జీవాడి వాలంటైన్స్ డే స్పెషల్ కొలిక్కి రానట్టుంది… మొత్తానికి ఈ వేలంటైన్స్ డే తెలుగు టీవీ ప్రేక్షకుల బుర్రల్ని వాయగొట్టేయబోతున్నది… అన్నట్టు మరో విషయం…
రష్మి మొన్నామధ్య పెళ్లి చేసుకుంది… అంతకుముందు పెళ్లిచేసుకున్న భర్తతో విడాకులు కూడా సెటిలైనట్టు లేదు… ఢీ నుంచి బయటికి వచ్చేసింది… సినిమా చాన్సుల కోసం తెగ ప్రయత్నిస్తోంది… సుధీర్ ఒంటరివాడైపోయాడు… ఇప్పుడు ఓ రష్మి కావాలి అర్జెంటుగా… ఇప్పటికే తొమ్మిదేళ్లు… ఆ బంధం ఇక మొనాటనీ వైపు వెళ్లొద్దు… అంటే సుధీర్‌కు ఓ జోడీ కావాలి…
తాజా శ్రీదేవి డ్రామా ప్రోమోలో సినిమా నటి ఇషా చావ్లా సుధీర్‌తో కనిపిస్తోంది… అసలే వాలంటైన్స్ డే స్పెషల్, అందులోనూ సుధీర్‌తో జంటగా డాన్సులు… ఆమె గెస్టో, లేక నిజంగానే సుధీర్ పిలిస్తే వచ్చి డ్రామా కంపెనీలో చేరిపోతుందో… ఇలాగే గెస్టుగా వచ్చిన ఇంద్రజ జడ్జిగా, రెగ్యులర్ గెస్ట్‌గా సెటిలైపోలేదా ఏం..? ఇషా కూడా 2014 నుంచీ ఖాళీయే… తెలుగు టీవీ షోలలో స్పేస్ దొరికితే, రష్మి ప్లేసులో జొరబడితే అంతకుమించి ఏం కావాలి తనకు..?! ఇప్పటికే మల్లెమాల టీం రష్మి, సుధీర్ లవ్ ట్రాక్‌ను చూపించడం మానేసింది… ఇక ఈనెలాఖరుకు మల్లెమాల జబర్దస్త్ షోకు సంబంధించి సుధీర్ అగ్రిమెంట్ గడువు ముగుస్తుందట… తరువాత కథ వేచి చూడాలిక…!
Share this Article