Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మీరు చూడటమే కాదు… పిల్లలకు చూపించాల్సిన సినిమా… దేనికంటే..?!

June 30, 2024 by M S R

కల్కి సినిమా చూశాను. సినిమాగా ఓ గొప్ప ప్రయత్నం. భారతీయులు ప్రపంచ స్థాయి కంపెనీలకి సీఈఓ లుగా పనిచేసి ఈ దేశ మేధా సంపత్తిని నిరూపిస్తే, యూనివర్సల్ కళ అయిన సినిమా రంగంలో కూడా ప్రపంచ స్థాయి సినిమాలు తీయగలరని, అది కూడా హాలీవుడ్ తో పోలిస్తే పదో వంతు కూడా లేని మార్కెట్, బడ్జెట్ తో అని నిరూపించిన సినిమా.

పూర్తి సినిమా కోణం లో చెప్పుకోవాలంటే రెగ్యులర్ సినిమా లు చూసే వాళ్లకి ఫస్ట్ హాఫ్ బోరింగ్ గానే ఉంటుంది. సెకండ్ హాఫ్ సినిమా ఆత్మని ఆవిష్కరిస్తుంది. ఈ సినిమా ఈ కథ లో మొదటి పార్ట్. రెండో పార్ట్ కోసం ఎదురుచూసేలా సెకండ్ హాఫ్ ఉంటుంది.

అమితాబ్ ఈ సినిమాకి ఒక గ్రేస్ తీసుకొచ్చారు. ఆయనే హీరో అన్న స్థాయిలో పెర్ఫార్మ్ చేశారు. ఆయన ఇన్నాళ్ళు చేసిన సినిమాలు ఒక ఎత్తు. ఇది వేరే స్థాయికి తీసుకెళ్లే సినిమా. ఈ వయసులో కూడా తనలో మ్యాజిక్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించారు. అశ్వత్థామ బ్రతికి ఉన్నది అమితాబ్ ని తన పాత్రలో చూడడానికేనా అనిపిస్తారు. ఐదేళ్ల పిల్లలు కూడా కొత్తగా అమితాబ్ ఫాన్స్ అయిపోతారు.

Ads

ప్రభాస్ కి జాతీయ స్థాయిలో ఉన్న ఇమేజ్ ఈ సినిమా తో మరింత పెరుగుతుంది. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత అసలు ప్రభాస్ ఎందుకు ఈ క్యారెక్టర్ కి అనిపించినా, అమితాబ్ తో ఎదురుపడినప్పటి నించి ఇక తన స్థాయి ఏ మాత్రం తగ్గలేదని నిరూపించాడు. ఇక ఆఖరి సన్నివేశాలు, కురుక్షేత్ర సన్నివేశాలు ప్రభాస్ ని డైరెక్టర్ వాడుకున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఇది పూర్తిగా నాగ్ అశ్విన్ సినిమా. తన కల లోకి ఆడియెన్స్ ని తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యాడు. ముందే చెప్పినట్టు కొంత స్టార్టింగ్ ట్రబుల్(ఫస్ట్ హాఫ్ లో పేస్ లేకపోవడం) ఉన్నప్పటికీ, తర్వాత అతని విజన్ కి హాట్స్ ఆఫ్ అనిపించేలా తీశాడు. అమితాబ్, ప్రభాస్ ల మధ్య ఫైట్ సీక్వెన్స్ ఏ డైరెక్టర్ కైనా పెద్ద పరీక్ష. అదీ ఇద్దరూ మంచి వాళ్లు కావడం తో ఇద్దరూ ఓడిపోకూడదని చిన్నపిల్లలు కూడా అనుకునే సందర్భం లో సీరియస్ ఫైట్ తీయడం కత్తి మీద సాము. అది నాగ్ అశ్విన్ సునాయాసంగా చేశాడు.

మహాభారతం మీద తెలుగులో వచ్చినన్ని సినిమాలు ఎందులోనూ వచ్చి ఉండవు. ఎన్టీఆర్ పోషించిన కృష్ణ, కర్ణ పాత్రలు మళ్ళీ తెర మీద చూపించాలంటే ఎన్ని గట్స్ ఉండాలి? ఆ సాహసం చెయ్యడమే కాదు, ఇంతవరకూ భారతం ఆధారంగా వచ్చిన సినిమా లలో దేనిలోనూ టచ్ చేయని అంశాల్ని, కల్కి అవతారాన్నీ ఎంచుకుని గొప్పగా చేశాడు.

ఇక ఈ సినిమా ఎందుకు చూడాలి అంటే మనం భారతీయులం కనుక. హిందువులంకాదు, భారతీయులం. అందుకు. ఏ దేశానికైనా దానికంటూ ఒక నాగరికత, సంస్కృతి, నమ్మకాలు ఉంటాయి. ఒక ఆత్మ ఉంటుంది. ప్రపంచపు మొదటి నాగరిక దేశం భారత దేశమే. ఇది ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ తో ప్రూవ్ అయింది. అలాంటి దేశం లో ఈ దేశపు మూలాల గురించిన ప్రాథమిక అవగాహన ఈ దేశ వాసులకి ఉండాలి. ముఖ్యంగా రాబోయే తరాలకి. ఇందుకు సినిమాని మించిన సాధనం ఏమీ లేదు. పెద్ద గ్రంథాలు చదివే ఓపిక ఇప్పటి తరానికి, రాబోయే తరాలకి లేదు.

మూడు గంటల సినిమాయే బోర్ అన్న కాన్సెప్ట్ కి వచ్చేశారు. ఇప్పటికి యాభై పై బడిన వాళ్లలో కూడా ఎనభై శాతం మందికి భారతం గురించి, పదో వంతు కూడా తెలీదు. ఎన్టీఆర్, ఎస్వీఆర్ సినిమాలు చూసిన తరానికి కూడా అశ్వత్థామ అనే పాత్ర గురించీ, కురుక్షేత్రం లో ఆయన ప్రాధాన్యం గురించీ తెలీదు. ‘ ఇవన్నీ ఎప్పుడో తెలుసు. ఎన్టీఆర్ కర్ణ చూసేశాం’ అనుకునే వాళ్ళకి కూడా అసలు భారతం ఇచ్చే సందేశం తెలీదు.

కురుక్షేత్రం తర్వాతే భారతం ఆత్మ కనపడుతుందని తెలీదు. ఇక కొత్త తరానికి ఏమి చెప్పగలం? అందుకే ఈ సినిమా చూడాలి. గ్రీక్, రోమన్ మైథాలజీ చదవడం, ఆ క్యారెక్టర్ ల మీద హాలీవుడ్ సినిమాలు చూసి మోజుపడి మనవైన సూపర్ హీరో ల కథలు చిన్న చూపు చూసే తరానికి చూపించాల్సిన సినిమా. ఐదేళ్ళ నించీ ఆ పైబడ్డ పిల్లలతో తల్లితండ్రులు, తాతలు చూడాల్సిన సినిమా. నాగ్ అశ్విన్ కి హ్యాట్సాఫ్…. by        విన్నకోట రవికుమార్

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నిన్న అమ్మాయిల గెలుపు హోరు… నేడు అబ్బాయిల పేలవ ఆటతీరు…
  • కొన్ని ఉద్వేగపు కన్నీళ్లకు పేర్లుండవ్… అవి అనుభవైక వేద్యమే…
  • మరో వెలుగుబంటి… కాదు, వాడి తాత…! గుట్ట ఈఈకి గుట్టలుగా ఆస్తులు..!!
  • లంచస్వామ్యం…! లంచం చుట్టూ, లంచం కోసం, లంచం చేత…!!
  • మాటల్లేవ్, మాట్లాడుకోవడాల్లేవ్… మరో మాట లేకుండా చప్పట్లు కొట్టేయడమే…
  • ది గ్రేట్ సైబర్ రాబరీ..! కుంభస్థలాన్నే కొట్టారు హ్యాక్ దొంగలు..!!
  • చైనా సైబర్ మాఫియా..! ఆ చెరలో వందలాది భారతీయులు గిలగిల..!
  • సింగిల్ మదర్‌హుడ్..! పెళ్లి, విడాకులు, ఐవీఎఫ్ సంతానం… రేవతి స్టోరీ…!!
  • ఆమె అమెరికా అమ్మాయి… పాటేమో వేణువుపై… అతనేమో వీణ సవరింపు…
  • జెమీమా రోడ్రిగ్స్..! ఓ తిలక్ వర్మ… ఓ రోహిత్ శర్మ… ఓ విరాట్ కోహ్లీ…!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions