Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఏమయ్యా… రాముడు నీలమేఘశ్యాముడు అనే విషయమూ తెలియదా నీకు..?

June 17, 2023 by M S R

పార్ధసారధి పోట్లూరి ….. 

మాయాబజార్ vs ఆదిపురుష్!

ఏది తప్పు? ఏదీ ఒప్పు?

Ads

అసలు తప్పొప్పులు వెదకడానికి మనం ఎవరం?

అసలు వాల్మీకి విరచిత రామాయణం ని యధా తథంగా అనువదించిన కవులు ఉన్నారా?

ఒక కంభ రామాయణం, ఒక మొల్ల రామాయణం ఇలా వాల్మీకి రామాయణం ని ఆయా భాషలలోకి అనువాదం చేసినప్పుడు రాముడి సౌశీల్యం ఎలాంటిదో చెప్పే విషయంలో కొన్ని అతిశయోక్తులని చొప్పించి ఉండవచ్చు! కానీ మూలం ఏదయితే ఉందో అది చెడకుండా జాగ్రత్త పడ్డారు!

అక్కడ అతిశయోక్తి అంటే అది భక్తి తో కూడిన వర్ణన అంతే కానీ ఆయా అనువాదకుల స్వప్రయోజనం కోసం అలా వ్రాయలేదు! కొన్ని విశేషణాలని అదనంగా తగిలించారు అదీ భక్తి భావంతో మాత్రమే!

దీనినే ‘కాళిదాసు కవిత్వం కొంత, కవి గారి పైత్యం కొంత ‘ అనే అర్థంలో చూడకూడదు!

*********************

తప్పు లేదా విమర్శ చేయడానికి అర్హత ఉండాలా?

అర్హత ఉండాలి కానీ వేద వేదాంగాలు చదివి ఉండ నక్కరలేదు! నిండైన భక్తి ఉంటే చాలు!

రామచంద్ర ప్రభువు నీల మేఘ శ్యాముడు అని కదా చదువుకున్నాం? నీలం అంటే నలుపో లేదా బులుగో అన్నది కూడా ప్రస్తుతమే!

అపర రామ భక్తుడు అయిన బాపు గారు రామచంద్ర ప్రభువుని నీలం రంగులోనే చూపించారు మనకి.

బాపు గారి కంటే ముందే లవకుశ సినిమాలో కూడా రాముడిని నీలం రంగు లోనే చూపెట్టారు కదా?

సినిమా సంగతి పక్కన పెడితే వాటికి ముందు మనుగడలో ఉన్న నాటక రంగం లో కూడా రామ పాత్ర వేషధారి నీలం రంగు వేసుకునే వారు.

మరి మన పూర్వీకులకు సంస్కృతంలో నీలం అంటే నలుపు అని తెలుసుకోకుండా ఉన్నారా?

*******************

రామాయణాన్ని ఎవరు ఎలా తీసినా మనం ఆదరించాలా?

అస్సలు కూడదు! రామాయణ, మహా భారతాలు వక్రీకరించినపుడు నిరసన వ్యక్తం చేయాల్సిందే!

అలా చేయక పోవడం వల్ల కలిగే నష్టం ఏమిటో దానవీరశూరకర్ణ సినిమా ఉదాహరణ గా ఉంది!

తెలుగు వారిది గొఱ్ఱె దాటు మనస్తత్వం! కనుకనే DVSK లాభాలు ఆర్జించింది కురుక్షేత్రం సినిమా నష్టపోయింది!

కురుక్షేత్రం సినిమాకి కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించారు అది కూడా మూల భారతంలో ఉన్న దానిని ఏ మాత్రం వక్రీకరించకుండా తీశారు కానీ నష్టాలు చవి చూసింది. DVSK? సినిమా మొత్తం NTR, కొండవీటి వెంకట కవుల పైత్యంతో నిండిపోయంది! పోనీ టెక్నికల్ గా అన్నా ఏవన్నా గొప్పగా ఉందా అంటే అదీ లేదు.DVSK కి రెహమాన్ DOP కానీ ద్రౌపదికి కృష్ణుడు వస్త్రం అందించే సీన్ లో ముందు ఇనుప తీగెలు కదులుతూ ప్రేక్షకులకి కనువిందు చేసింది. కానీ లాభాలు ఆర్జించింది! అఫ్కొర్స్ అప్పట్లో ఎవరూ ఊహించలేకపోయారు NTR రాజకీయ రంగ ప్రవేశానికి కర్టెన్ రైజర్ గా DVSK ని వాడుకున్నాడు అని!

**********************

మాయా బజార్ సినిమా కథ భారతంలో లేదు! ఇది నిజమే!

కానీ నిజంగానే భారతంలో ఉన్నది అని భ్రమింప చేశారు.

ఎక్కడ కదిరి వెంకట రెడ్డి అలియాస్ KV రెడ్డి?

ఎక్కడ ఓం రౌత్?

ఇప్పటికీ కేవీ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని కొత్త తరం తెలుగు దర్శకులు స్క్రిప్ట్ ఎలా వ్రాయాలో నేర్చుకుంటున్నారు ! మాయా బజార్ సినిమా స్క్రిప్ట్ అనేది తెలుగు దర్శకులకి భగవత్ గీత!

భారత దేశం మొత్తం ఏకగ్రీవంగా తమ మొదటి ఓటు మాయా బజార్ సినిమాకి వేశారు!

మాయా బజార్ సినిమా కి కథ వ్రాసుకున్నది మహా భారతంని స్ఫూర్తిగా తీసుకొని వ్రాసుకున్నారు. పాండవుల ప్రస్తావన ఉంటుంది కానీ వాళ్ళు ఎక్కడా కనపడరు. VFX కాదు కదా కనీసం మూడు లేదా నాలుగు రకాల లెన్సులు కూడా లేవు అప్పట్లో! సెకండ్ జనరేషన్ కెమెరా మాత్రమే అందుబాటులో ఉంది. 10KV జెనరేటర్ లు లేవు. DOP మార్కస్ బార్ట్లే ఆంగ్లో ఇండియన్! మన ఇతిహాసాల మీద అవగాహన లేని పరమతస్థుడు.

మరి అంతటి అద్భుతం ఎలా సాధ్యమైంది?

కేవీ రెడ్డి! KV రెడ్డి!

********************

మాయా బజార్ సినిమా చూడలేదా? అలాగే ఆది పురుష్ ఎందుకు చూడకూడదు అన్న పోలిక చేశారు చూడండి అదీ చెత్త కంపారిజన్,!

దాన వీర శూర కర్ణ చూడ లేదా? ఆదిపురుష్ కూడా చూడండి అని అంటే ఇంత పెద్ద వ్యాసం వ్రాయాల్సి వచ్చేది కాదు!

ఆది పురుష్ చూడండి బాగున్నా బాగా లేకపోయినా! నాలాంటి ఛాందసులకు అసలు నచ్చదు కాబట్టి నేను చూడను! లోగుట్టు తెలుసుకుంటే మీరు కూడా చూడరు!

*****************************

ఆది పురుష్ సినిమాకి అసలు నిర్మాత ఎవరు? T సీరీస్? లేక అంతర్జాతీయ ఫైనాన్స్ సంస్థలా? అసలు ఫైనాన్షియర్ ఎవరో తెలిస్తే వాళ్ల అజెండా ఏమిటో తెలిసిపోతుంది!

సినిమా రిలీజ్ అవక ముందే అంటే 6 నెలల క్రితమే నిర్మాత, ఓం రౌత్ కి 4.3 కోట్ల రూపాయల విలువ చేసే ferrari కారు బహుమతి గా ఎలా ఇవ్వగలిగాడు? అదీ టీజర్ దరిద్రంగా ఉంది అని అందరూ దుమ్మెత్తి పోసిన సమయంలొ! రౌత్ నా రూమ్ లో కి రా అంటూ ప్రభాస్ రౌత్ ని మెడ మీద చెయ్యి వేసి రూంలోకి తీసుకెళ్ళింది అందరూ చూశాక నిర్మాత ఖరీదు అయిన ferrari కారు బహుమతి గా ఎలా ఇచ్చాడు?

అసలు నిర్మాత T సిరీస్ భూషణ కుమార్ అయితే సినిమా గురించి బాడ్ టాక్ తెచ్చుకున్న తరువాత అంత ఖరీదు చేసే కారు ని బహుమతిగా ఎలా ఇచ్చాడు?

ఇదంతా జరిగింది 2022 అక్టోబర్ లో అన్న సంగతిని గుర్తు పెట్టుకొండి.

*******************

నిత్యం ఖరీదయిన డ్రగ్స్, మద్యం మత్తులో ఉండే వాళ్లు తీసే సినిమాలకు మనం ఎందుకు వత్తాసు ఇవ్వాలి?

అంటే వీళ్లు రామాయణం తీశారు కాబట్టి మనం సనాతనం కాబట్టి వాళ్ల డబ్బుకు న్యాయం చేయాలా?

ప్రభాస్ నటించాడు కాబట్టి చూస్తే సరి! అంతవరకు అయితే చాలు! వాళ్లకు ఎలాంటి హిందూ ధర్మ సెంటిమెంట్ ఉండదు!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions