.
వెదిరె శ్రీరాం… ఈయన మాజీ కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ సలహాదారు… అందరూ అనుమానించారు… చంద్రబాబే తనను ప్రవేశపెట్టి, బనకచర్లకు అనుకూలంగా ఏవేవో ప్రకటనలు ఇప్పిస్తాడని..! బీజేపీ వాయిస్‌తోనే చెప్పిస్తే బీజేపీ ప్రభుత్వం మీద ఒత్తిడి పంచ్ బాగా ఉంటుందని ప్లాన్ చేశాడని..!!
- కానీ ఏం జరిగింది…? తన సొంత కోటరీ వ్యతిరేకిస్తున్నట్టుగానే… బనకచర్ల ఏటీఎం ప్రాజెక్టు చట్టవ్యతిరేకం అవుతుందనీ, ఏపీ వాదనలో బలం లేదనీ, ఆ వాదన నిలవదనీ తేల్చిపారేశాడు సింపుల్‌గా… ఒకరకంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వ వాదనలకు ఇది అదనపు బలం, సమర్థన…
ఆయనేమంటాడో కాస్త సరళమైన భాషలో చెప్పుకుందాం… అది చంద్రబాబుకు షాక్ మీద షాక్ ఎలా అవుతుందో కూడా ఇట్టే అర్థం చేసుకోవచ్చు…
Ads
ఏడు రాష్ట్రాల్లో గోదావరి ప్రవాహిస్తుంది… 12 సబ్ బేసిన్లు ఉన్నాయి… 196 9ఏప్రిల్ 30న గోదావరి ట్రెబ్యునల్ అవార్డు వచ్చింది… రాష్ట్రాల మధ్య ఒప్పందాలే టెబ్యునల్ అవార్డ్ గా ఉపయోగిస్తున్నారు…
ఏడు మండలాలు ఏపీకి ఇవ్వడంతో శబరి బేసన్ కోల్పోయాం… (ఇప్పుడు అర్థమైంది కదా, వెంకయ్యనాయుడు మోడీని తప్పుదోవ పట్టించి ఆ ఏడు మండలాలను ఎందుకు ఏపీలో విలీనం చేయించాడో… జలం, జలవిద్యుత్తు అన్నీ తెలంగాణ నుంచి కొట్టేయడం)…
తుమ్మిడి హట్టి ప్రాజెక్టు వద్ద 165 టీఎంసీల నీరు వాడుకునేందుకు అందుబాటులో ఉంటుంది… కానీ అదనపు నీరు వాడుకునేందుకు అవకాశం ఉండదు… కాళేశ్వరం వద్ద 286 టీఎంసీల నీరు అవేలబులిటీ ఉందని సీడబ్ల్యూసీ చెప్పింది…
3396 టీఎంసీల జలాలు మొత్తం గోదావరిలో ఉన్నాయి… అందులో 532 టీఎంసీల నీరు ఏపీకి … 968 టీఎంసీల నీరు తెలంగాణకు లా ఆఫ్ ల్యాండ్ రూల్ కింద వాడుకునే అవకాశం ఉంది… పోలవరం వద్ద ప్రతి ఏటా సముద్రంలోకి పోయే నీరు యావరేజ్ గా 3102 టీఎంసీలు అని సీడబ్ల్యూసీ లెక్క తేల్చింది… కానీ…
నికర జలాలు మాత్రమే ఎవరైనా వాడుకోవాలి అని సీడబ్ల్యూసీ చెప్పింది… నదుల అనుసంధానంలో కూడా ఇవే నీరు వాడుకోవాలి… సముద్రంలోకి పోతున్నాయి కాబట్టి ఆ నీరు మేం వాడుకుంటాం అని ఏపీ చెబుతోంది, కానీ 18/08/2022లో నేను చైర్మన్ గా వేసిన కమిటీ రిపోర్ట్ ప్రకారం ఎలాంటి సర్‌ప్లస్ (మిగులు) వాటర్ లేవని సీడబ్ల్యూసీ చెప్పింది…
1138 టీఎంసీలు సముద్రంలోకి పోతున్నాయి… 400 టీఎంసీలు ఛత్తీస్‌గఢ్ వాడటం లేదు… వివిధ కారణాలతో తెలంగాణ 400 టీఎంసీల నీటిని వాడటం లేదు… ఆ నీటిని వాడితే సముద్రంలోకి వెళ్ళే నీరు ఏమీ ఉండవు… (అంటే చంద్రబాబు చెబుతున్న వరద జలాలు, మిగులు జలాలు, వృథా జలాలు ఉత్త బోగస్ మాటలు)…
ఫ్లడ్ వాటర్ అనే పదం దేశంలో ఎక్కడా లేదు … అది కేవలం ఊహ మాత్రమే… ఫ్లడ్ వాటర్ ను సీడబ్ల్యూసీ నిర్వచించలేదు… ఏ రాష్ట్రంలో కూడా ఫ్లడ్ వాటర్ పేరుతో ప్రాజెక్టు కట్టేందుకు అనుమతి లేదు.. సముద్రంలోకి పోయే నీరు మనవే అనుకునే పరిస్థితి ఉండదు..
యావరేజ్ వాటర్ కింద ప్రాజెక్టులు కట్టేందుకు సీడబ్ల్యూసీ ఎలాంటి గైడ్లైన్స్ ఇవ్వలేదు… ఆవరేజ్ వాటర్ కింద ప్రాజెక్టు కట్టి, ఆ తరువాత నీరు కేటాయించమంటే కుదరదు…
జీడబ్లూడిటీ కింద ఉన్న రాష్ట్రాల ప్రాజెక్టుల వివరాలు ఇవ్వాలని సీడబ్ల్యూసీ అడిగింది… ఆయా రాష్ట్రాలకు కేటాయించిన నీటిని వాడుకుంటున్నాయా లిస్ట్ ఇవ్వమని కూడా అడిగింది… అన్ని రాష్ట్రాల వద్ద మ్యాండేట్ తీసుకున్నారా అని జీఆర్ఎంబీ అడిగింది…
నీరు అందుబాటులో ఉంటే పోలవరం ప్రాజెక్టుపై మరో డీపీఆర్ ఇవ్వాలని అడిగింది… పర్యావరణ మంత్రిత్వ శాఖ సీడబ్ల్యూసీ అనుమతి తెచ్చుకోవాలని చెప్పింది… దీనితో పాటు మరిన్ని కండీషన్లు పెట్టింది… నదుల అనుసంధానంలో నదులు ప్రవహించే ఇతర రాష్ట్రాలకు వాటాలు ఇవ్వాల్సి ఉంటుంది…
గోదావరి బనకచర్ల ప్రాజెక్టుకంటే గోదావరి కావేరీ నదుల అనుసంధానం ఖర్చు తక్కువ, నష్టం తక్కువ… సర్‌ప్లస్ వాటర్ కింద సీడబ్ల్యూసీ ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వదు… ఇచ్చంపల్లి నుంచి కావేరికి నీటిని తరలించేందుకు అవకాశం ఉంది…
ఛత్తీస్‌గఢ్ తో కేంద్ర ప్రభుత్వం మాట్లాడి, ఆ రాష్ట్రం నీరు కావేరికి తరలించే అవకాశం ఉంది… ఈ అనుసంధానం వల్ల గోదావరి బేసిన్ లో ఉన్న రాష్ట్రాలకు అదనపు లబ్ది చేకూరుతుంది… చత్తీస్‌గఢ్ బోధ్‌గఢ్ ప్రాజెక్టు కట్టుకునేందుకు సీడబ్ల్యూసీ అనుమతి ఇచ్చింది… ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిన తరువాత సర్‌ప్లస్ వాటర్ అనే ఊహలకే తెరపడుతుంది…
- ఏతావాతా తను చెబుతున్నది ఏమిటీ..? అయ్యా, చంద్రబాబూ నీ బనకచర్ల ఏటీఎం ప్రాజెక్టుకు ఏమాత్రం స్కోప్ లేదు అని..!! ఇదే కదా కొన్నిరోజులుగా ‘ముచ్చట’ కూడా చెబుతున్నది..!!
Share this Article